Air India plane crash Black box recovered: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం  AI171 విమాన ప్రమాదం సంబంధించి  ఒక బ్లాక్ బాక్స్ రికవరీ అయింది. ఈ బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ విమానం అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి లండన్ గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరి, టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోయింది. ఈ ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించగా, సీటు నంబర్ 11Aలో ఉన్న ఒక ప్రయాణికుడు విశ్వాస్‌కుమార్ రమేశ్ మాత్రమే  బయటపడ్డారు. 

విమానంలో రెండు బ్లాక్ బాక్సులు ఉంటాయి. ఒక బ్లాక్ బాక్స్ రికవరీ అయిందని.. రెండవ బ్లాక్ బాక్స్ కోసం ఇంకా సెర్చ్  చేస్తున్నట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి.   ఫ్లైట్ డేటా రికార్డర్,   కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ ఇప్పటికే లభించినట్లుగా తెలు్సోతంది.  కాక్‌పిట్‌లో పైలట్ల సంభాషణలు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో కమ్యూనికేషన్,  ఇతర శబ్దాలను రికార్డ్ చేస్తుంది. ఈ రెండు పరికరాలు ప్రమాద కారణాలను అర్థం చేసుకోవడానికి కీలకమైనవి. ముఖ్యంగా ఈ ప్రమాదంలో మెకానికల్ ఫెయిల్యూర్, ఇంజిన్ మాల్‌ఫంక్షన్, బర్డ్ స్ట్రైక్, లేదా హ్యూమన్ ఎర్రర్ వంటి అంశాలను విశ్లేషించడానికి ఈ రెండు పరికరాలుఉపయోగపడతాయి.   పైలట్లు జారీ చేసిన మేడే కాల్ వెనుక ఉన్న కారణాలపై  అనేక ఊాహాగానాలుఉన్నాయి. బ్లాక్ బాక్స్ రికవరీ టేకాఫ్ , ప్రమాదం మధ్య జరిగిన విషయాలపై మరింత క్లారిటీఇస్తుంది.  బ్లాక్ బాక్స్ అనేది పేలుళ్లు,  నిప్పు , నీరు, అధిక ఒత్తిడి ,ప్రమాదాల వంటి తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా ఉంటుంది.  ప్రతి విమానంలో రెండు బ్లాక్ బాక్స్‌లు ఉంటాయి, ఇందులో ఫ్లైట్ డేటా రికార్డర్ (FDR) , కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ (CVR) ఉంటాయి. FDR ఆల్టిట్యూడ్, స్పీడ్, ఇంజిన్ థ్రస్ట్, ఫ్లైట్ పాత్ డేటా వంటి సాంకేతిక  విషయాలనురికార్డ్ చేస్తుంది, అయితే CVR కాక్‌పిట్‌లోని పైలట్ల సంభాషణలు, చుట్టుపక్కల శబ్దాలను రికార్డ్ చేస్తుంది, ఇవి కాక్‌పిట్‌లో జరిగే విషయాలపై స్పష్టమైన అవగాహనను అందిస్తాయి.  

  బ్లాక్ బాక్స్  ను  భారతదేశ ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) లేదా అంతర్జాతీయ ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపిస్తారు.  డేటా విశ్లేషణకు వారాల నుండి నెలల వరకు పట్టవచ్చు.   ఒకవేళ రికార్డర్‌లు దెబ్బతిన్నట్లయితే ఇంకాఎక్కువ సమయం పడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అంశంలో భారతదేశంతో పాటు  యునైటెడ్ స్టేట్స్ (NTSB),  యునైటెడ్ కింగ్‌డమ్ నుండి నిపుణులు దర్యాప్తులో పాల్గొంటున్నారు. బోయింగ్ టెక్నికల్ టీమ్ కూడా సహాయం అందిస్తోంది.  ఈ బ్లాక్ బాక్స్‌లు ప్రమాద కారణాలను వెల్లడించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దర్యాప్తు ఫలితాలు వచ్చే వరకు, బర్డ్ స్ట్రైక్ లేదా ఇతర సాంకేతిక/మానవ తప్పిదాలపై గురించే ఎక్కువ ప్రచారం జరిగే అవకాశం ఉంది.