Big Leaders Small Kids AI Videos: రాజకీయాలు చాలా సీరియస్. ఆ రాజకీయ నేతలు అప్పుడప్పుడూ సెటైర్లు వేసి జోకులు వేయాలని ప్రయత్నిస్తూంటారు. ఆ సీరియస్ నెస్ కు ఆ జోకులు కుదిరితే వర్కవుట్ అవుతుంది లేకపోతే నవ్వుల పాలవుతుంది. కానీ చాలా మంది రాజకీయ నేతల స్పీచ్‌లు మాత్రం ప్రత్యేకంగా ఉంటాయి.  వారి వాగ్ధాటే వారి ఎదుగదలలో కీలకం అనుకోవచ్చు.              

అయితే ఇప్పుడు అలాంటి లీడర్లు చిన్నతనంలో క్యూట్ గా ఉంటూ.. అలాంటి మాటలే మాట్లాడితే ఎలా ఉంటుంది. చాలా ఫన్నీగా ఉంటుంది. అందుకే కొంత మంది ఇలాంటి వీడియోలు సిద్దం చేసి సోషల్ మీడియాలో వదులుతున్నారు. ఇవి వైరల్ గా మారుతున్నాయి. పార్లమెంట్ లో అందరు ప్రముఖ నేతలు ఉంటారు. వారి చిన్నప్పటి క్యూట్ వీడియోలు చూస్తే నవ్వకుండా ఉండలేరు.                 

ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా ఇక్కడ ప్రత్యేకం.  ఇక ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యమంగా మీమర్స్ అసలు మిస్ కారు ఇటీవల ఆయన కొడిత కొట్టించుకోండి..కానీ పేరు రాసుకోండి అని చెప్పిన డైలాగ్ వైరల్ అయింది. దాంతో చేసిన ఏఐ పిల్లాడి వీడియో  క్యూట్ గా ఉంటుంది. కామెడీగా ఉంటుంది                                  

ఇక బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కూడా  మాట్లాడితే ఫన్ పంచ్ లతో సాగిపోతుంది. ఇలాంటి ఓ ఫన్ పంచ్‌తో చేసిన క్యూట్ వీడియో కూడా ఆన్ లైన్ లో చక్కర్లు కొడుతోంది.  

కేటీఆర్ మాటలు కూడా దూకుడుగా ఉంటాయి.   ఆ ఏఐ వీడియోను కూడా హైలెట్ చేస్తున్నారు.  

సినిమాల్లో మహేష్ బాబు డైలాగ్ కూడా ఓ వీడియో వైరల్ అవుతోంది.  

 నెటిజన్లు రకరకాల క్రియేటివిటీ చూపించి..   ఆకట్టుకుంటున్నారు. ఈ విషయంలో  మీమర్స్.. ఏఐ క్రియేటర్లు దూకుడు చూపిస్తున్నారు.  సినిమాల్లో కనిపించే గ్రాపిక్స్ కన్నా  చాలా క్వాలిటీగా ఈ ఏఐ వీడియోలు ఉంటున్నాయి. అందుకే విపరీతంగా షేర్ చేసేందుకు నెటిజన్లు ఆసక్తి చూపిస్తున్నారు.