BJP woman leader son Video Scandal:  ఉత్తరప్రదేశ్‌లోని మొయిపురిలో  బీజేపీ మహిళా మోర్చా నాయకురాలైన సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తాకు సంబంధించిన 130కి పైగా అశ్లీల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. మొయిన్ పురిలోని  బీజేపీ మహిళా మోర్చా సిటీ ప్రెసిడెంట్ సీమా గుప్తా కుమారుడు శుభం గుప్తా ఈ వీడియోలు తీసుకున్నారు. మొయిన్ పురిలో ఉన్న దాదాపు అన్ని ప్రముఖ  హోటళ్లు ,  రెస్టారెంట్లలో ఆయన నిర్వాకాలు కనిపిస్తున్నాయి.  శుభం గుప్తా  పలువురు మహిళలతో  అభ్యంతరకర స్థితిలో ఉన్న వీడియోలు ఉన్నాయి. 

శుభం గుప్తాకు తన భార్య  షీతల్ గుప్తా మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భర్త శాడిస్ట్ అని  అసహజ లైంగిక శృంగారానికి పాల్పడటం.. సిగరెట్ కాల్చడం వంటి పనులు చేస్తున్నాడని ఆరోపించారు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఈ వీడియోలు విడుదల అయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  షీతల్ గుప్తా తన భర్త ఈ అశ్లీల వీడియోలను తనకు బలవంతంగా చూపించేవాడని ఆరోపిస్తున్నారు. ఈ వీడియోలు ఇతర మహిళలతో శృంగారం చేస్తున్నప్పుడు తనను తాను చిత్రీకరించుకునేవాడు. 

నాలుగు సంవత్సరాలుగా శుభం తనను మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె ఆరోపించింది.   ఈ 130 వీడియోలు ఎలా లీక్ అయ్యాయనే దానిపై ఖచ్చితమైన సమాచారం లేదు, కానీ ఇవి శుభం గుప్తా  భార్య షీతల్ గుప్తానే లీక్ చేసి ఉంటారని భావిస్తున్నారు.  శుభం గుప్తా కర్ణాటకలోని బీజేపీ నాయకుడు ప్రజ్వల్ రేవణ్ణ స్కాండల్‌తో “పోటీ” పడుతున్నాడని సమాజ్ వాదీ పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 

  ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని మండ్సౌర్‌లో బీజేపీ నాయకుడికి సంబంధించిన మరొక అశ్లీల వీడియో వైరల్ అయిన సమయంలోనే బయటకు రావడంతో బీజేపీ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వీడియోల వ్యవహారంలో యూపీలోని యోగి సర్కార్ ఆత్మరక్షణా ధోరణిలో పడింది.