Adani Group has declared that all allegations false And baseless : అమెరికా కోర్టులో నమోదైన కేసు గురించి అదానీ గ్రూపు ఓ ప్రకటన విడుదల చేసింది. యూఎస్ డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్, యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ కమిషన్ ఆరోపణలన్నీ నిరాధారం వాటిని తిరస్కరిస్తున్నామని అదానీ గ్రూప్ స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రూపు తరపున అధికారిక ప్రకటన విడుదల చేశారు.


 


నిరూపణ అయ్యే వరకూ అన్నీ ఆరోపణలే !                


"నిరూపణ అయ్యే వరకూ నేరారోపణలు చేసిన వ్యక్తి నేరస్తుడు కాదని, స్వచ్చమైన వ్యక్తేనని" అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ జస్టిస్ చెబుతున్న విషయాన్ని అదానీ గ్రూప్ గుర్తు చేసింది. ఈ విషయంలో న్యాయపరంగా చేపట్టాల్సిన చర్యలను తీసుకుంటామని అదానీ గ్రూపు తెలిపింది. 


అత్యున్నత విలువలతో నడుస్తున్న సంస్థ అదానీ గ్రూపు               


అదానీ గ్రుపు నిర్వహణలో అత్యున్నత ప్రమాణాలు పాటిస్తామని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. గ్రూపు కార్యకలాపాల్లో  పారదర్శకత ఉంటుందని అలాగే తమ గ్రూపు కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రతి చోటా అక్కడి నియమ నిబంధనలు తూ.చ తప్పకుండా పాటిస్తుందన్నారు. అదాని గ్రూపు న్యాయానికి కట్టుబడి సంస్థ అని స్టాక్ హోల్డర్లు, భాగస్వాములు, ఉద్యోగులుక అదానీ గ్రూపు తెలిపింది. కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని చోట్ల చట్టాలను తగ్గట్లుగానే సంస్థ నడుస్తోందని స్పష్టం చేశారు.  


సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు లంచం ఇచ్చారని అమెరికా కోర్టులో కేసు


భారతదేశంలో సోలార్ ఎనర్జీ ప్రాజెక్టును దక్కించుకునేందుకు గౌతమ్ అదానీ, సాగర్ ఆర్ అదానీ, వినీత్ ఎస్ జైన్‌ సహా ఏడుగురు $250 మిలియన్ల (రూ. 2,100 కోట్లు) లంచాన్ని అధికారులకు ఆఫర్‌ చేశారంటూ.. అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్‌ కోర్టు అభియోగాలు మోపింది. పెట్టుబడిదార్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధుల సమీకరణ ప్రయత్నాలు చేసినట్లు ఆరోపించింది.  నిందితులు US పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేశారని, ఫెడరల్ చట్టాలను ఉల్లంఘించారని అభియోగపత్రంలో ఆరోపించారు. అయితే ఇవన్నీ నిరూపణ కాని ఆరోపణలు అని అదానీ గ్రూపు స్పష్టం చేసింది. 


గతంలోనూ అదానీ గ్రూపుపై అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ ఆరోపణలు  


గతంలోనూ అమెరికాకు చెందిన హిండెన్ బెర్గ్ సంస్థ అదానీ గ్రూపుపై కొన్ని ఆరోపణలతో ఎటాక్ చేసింది.ఆ సమయంలోనూ అదానీ గ్రూపు షేర్లు భారీగా నష్టపోయాయి. ఆ తర్వాత హిండెన్ బెర్గ్ చేసిన ఆరోపణల్లో నిజం లేదని సెబితో పాటు సుప్రీంకోర్టు విచారణలో తేలింది. దీంతో మళ్లీ అదానీ గ్రూపు కోలుకుంది. ఆ తర్వాత కూడా అదానీ గ్రూపుపై హిండెన్ బెర్గ్ ఆరోపణలు చేసినా మార్కెట్ పట్టించుకోలేదు. ఈ సారి అమెరికా నుంచే అదానీ గ్రూపులో మరో దాడి జరిగింది. ఈ సారి అక్కడ నేరుగా కేసుస నమోదు కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. ఈ కారణంగా అదానీ గ్రూపు షేర్లు నష్టాల్లో ఉన్నాయి.