Actor Ashwin Mushran Shares Shocking FASTag Scam Incident: ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ అశ్విన్ ముష్రాన్ రీసెంట్ గా పెట్టిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు వాహనదారుల్లో హాట్ టాపిక్ గా మారింది. మున్నాభాయ్ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు, ఇన్ స్టాగ్రామ్ లో ఒక వీడియోను షేర్ చేశాడు. తన ఫాస్ట్‌ట్యాగ్ (FASTag) అకౌంట్ లో సరిపడా బ్యాలెన్స్ ఉన్నప్పటికీ టోల్ గేట్ దగ్గర జరిగిన ఒక వింత ఇన్సిడెంట్ గురించి అతడు ఆ వీడియోలో వివరించాడు. ఈ అలెజ్డ్ ఫాస్ట్‌ట్యాగ్ స్కామ్ ఆన్ లైన్ లో విపరీతంగా వైరల్ కావడంతో, చాలా మంది నెటిజన్లు కామెంట్ సెక్షన్ లో తమకు కూడా ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఎదురైందంటూ కామెంట్లు పెడుతున్నారు.

Continues below advertisement

Continues below advertisement

 

Read Also: Kunal Khemu Buys New Luxury Mercedes Benz G Class: బాలీవుడ్ యాక్టర్ కునాల్ ఖేము గ్యారేజ్ లోకి కొత్త లగ్జరీ ఈవీ: మెర్సిడెస్ బెంజ్ జి క్లాస్ ఎలక్ట్రిక్ కార్ కొనుగోలు..  

బాంద్రా వర్లీ సీ లింక్ దగ్గర ఘటన.. 

అశ్విన్ ముష్రాన్ తెలిపిన వివరాల ప్రకారం, అతడు ముంబైలోని బాంద్రా-వర్లీ సీ లింక్ మీదుగా కార్ లో వెళ్తున్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ టోల్ బూత్ ఆపరేటర్ అతడి కార్ ను ఆపి, ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్ లో సరిపడా డబ్బులు లేవని చెప్పాడు. బ్యాలెన్స్ లేనందున రూ. 200 పెనాల్టీ కట్టాలని డిమాండ్ చేశాడు. అయితే ఆ తర్వాత అశ్విన్ తన అకౌంట్ చెక్ చేసుకోగా అందులో ఏకంగా రూ. 3,000 బ్యాలెన్స్ ఉన్నట్లు తెలిసింది. దీంతో టోల్ సిబ్బంది తన దగ్గర తప్పుగా ఫైన్ వసూలు చేశారని గ్రహించిన నటుడు, ఇదొక కొత్త రకమైన ఫాస్ట్‌ట్యాగ్ ఫ్రాడ్ ఏమోనని సోషల్ మీడియా ద్వారా పబ్లిక్ ను అలర్ట్ చేశాడు.

Read Also: పెట్రోల్‌ కాదు, కొత్త ఇంధనంతో దూసుకుపోనున్న Maruti Fronx.. జూన్ 4న లాంచ్!  

నిలదీయడంతో రూ. 200 రీఫండ్

ఈ ఇన్సిడెంట్ ను అశ్విన్ ముష్రాన్ అలాగే వదిలేయకుండా క్రాస్ వెరిఫై చేయాలని డిసైడ్ అయ్యాడు. అతడు తిరుగు ప్రయాణంలో అదే కార్ లో అదే టోల్ ప్లాజాను దాటినప్పుడు ఫాస్ట్‌ట్యాగ్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా నార్మల్ గా స్కాన్ అయింది. దీంతో తన అకౌంట్ లో ఉన్న రూ. 3,000 బ్యాలెన్స్ ప్రూఫ్ ను టోల్ బూత్ సూపర్‌వైజర్ కు చూపించి అతడు గట్టిగా నిలదీశాడు. యాక్టర్ ప్రూఫ్స్ చూపించడంతో టోల్ మేనేజ్‌మెంట్ వెనక్కి తగ్గి, అతడి నుంచి కలెక్ట్ చేసిన రూ. 200 పెనాల్టీ అమౌంట్ ను తిరిగి రీఫండ్ చేసింది. టెక్నికల్ ఎర్రర్ వల్లే ఇలా జరిగిందా లేక కావాలనే చేశారా అనేది క్లియర్ గా తెలియకపోయినా డ్రైవర్లు అలర్ట్ గా ఉండాలని అతడు కోరాడు.

ఫాస్ట్‌ట్యాగ్ మోసాల నుంచి బ్రేకప్.. 

ఇలాంటి ఫాస్ట్‌ట్యాగ్ మోసాల బారిన పడకుండా ఉండటానికి వాహనదారులకు అశ్విన్ కొన్ని యూజ్ ఫుల్ టిప్స్ ఇచ్చాడు. జర్నీ స్టార్ట్ చేసే ముందే ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ చెక్ చేసుకుని ఒక స్క్రీన్ షాట్ ప్రూఫ్ గా ఉంచుకోవాలి. టోల్ సిబ్బంది అకౌంట్ లో ఫండ్స్ లేవని చెబితే వెంటనే అదనపు పేమెంట్లు చేయకుండా ఫిజికల్ వెరిఫికేషన్ చేయమని అడగాలి. ఇలాంటి ఇష్యూస్ వస్తే కంప్లైంట్ చేయడానికి '70395 86803' నంబర్ ను సంప్రదించాలని యాక్టర్ సూచించాడు. రూ. 200 చిన్న అమౌంట్ లా అనిపించినా, వందలాది వాహనాల నుంచి ఇలా కలెక్ట్ చేస్తే అది పెద్ద స్కామ్ అవుతుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.