ENBA Awards 2023: మీడియా రంగంలో ఎన్నో ఏళ్లుగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న ABP Network జర్నలిజంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ సేవలకు ఇప్పటికే గుర్తింపు రాగా ఇప్పుడు మరోసారి ప్రతిష్ఠాత్మక అవార్డులు దక్కాయి. Exchange4Media News Broadcasting Awards (ENBA) 2023 లో మొత్తం 50 అవార్డులు సొంతం చేసుకుంది. 32 విభిన్న కేటగిరీల్లో ABP News అవార్డులు దక్కించుకుంది. ABP Ananda కి 5 అవార్డులు,  ABP Majha కి నాలుగు అవార్డులు వచ్చాయి. డిజిటల్ న్యూస్ కేటగిరీలో ABP Live ఏకంగా 9 అవార్డులు సాధించి రికార్డు సృష్టించింది. ABP News కి 21 బంగారు పతకాలు, 21 వెండి పతకాలు, 6 కాంస్య పతకాలు దక్కాయి. వీటితో మరో రెండు స్పెషల్ జ్యూరీ అవార్డులూ వచ్చాయి. ABP Network CEO  అవినాశ్ పాండే CEO of the Year అవార్డుని సొంతం చేసుకున్నారు. 

అవార్డుల లిస్ట్‌లో కొన్ని..

 

S.NO. కేటగిరీ   ఛానల్  కథనం  అవార్డు 
1

బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్-హిందీ 

ABP News చంద్రయాన్-3 రాకెట్ షో  వెండి పతకం 
2 బెస్ట్ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్-గుజరాత్, రాజస్థాన్  ABP Majha జీరో అవర్  బంగారు పతకం 
3 Best In-depth Series- Hindi ABP News SAKSHAT వెండి పతకం 
4 Best News Coverage - Hindi ABP News KANJHAWALA KAND కాంస్య పతకం 
5 CEO of the Year ABP Network   అవినాశ్ పాండే

భారత్‌లోని టీవీ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఏయే సంస్థ ఎలా పని చేస్తోంది..? ఆయా సంస్థల సిద్ధాంతాలేంటి..? ప్రజల్ని ఏ మేర ప్రభావితం చేస్తున్నాయి..? అనే అంశాలను పరిశీలించి వాటి ఆధారంగా అవార్డులు ఇస్తుంది ENBA. అందులో భాగంగానే హిందీ, ఇంగ్లీష్ భాషల్లో  Best News Channel of the Year, Best Editor in Chief, Best CEO of the Year లాంటి అవార్డులు ప్రకటిస్తుంది. మొత్తం 7 కేటగిరీల్లో ప్రధానంగా అవార్డులు ఇస్తుంది ఈ సంస్థ. అందులో ప్రోగ్రామింగ్, పర్సనాలిటీ,మార్కెటింగ్, డిజిటల్ మీడియా, ఇంటర్నేషనల్ న్యూస్, ఓవరాల్ ఎక్స్‌లెన్స్‌తో పాటు స్పెషల్ అవార్డులు ఇస్తుంది రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతో కూడిన జ్యూరీ ఈ అవార్డులను ఎంపిక చేస్తుంది.