Viral News in Telugu: ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి గేట్ మీద పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. పుణేలో ఈ విషాదం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి గేట్‌తో ఆడుకుంటూ ఉండగా ఉన్నట్టుండి అది పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో మరో చిన్నారికి అక్కడికి వచ్చింది. ఆ గేట్ చిన్నారిపై పడిపోయి అక్కడికక్కడే మృతి చెందింది. ఇంటి పక్కనే ఆడుకోడానికి వెళ్లిన కూతురు ఇలా చనిపోవడం తల్లిదండ్రులను షాక్‌కి గురి చేసింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మరో ఇద్దరు చిన్నారులు అక్కడే ఉన్నారు. ఓ చిన్నారి గేట్‌తో ఆడుకుంటూ పూర్తిగా ఓ వైపు జరిపింది. ఆ తరవాత అది బ్యాలెన్స్ తప్పింది. సరిగ్గా అక్కడే నిలుచున్న గిరిజపై గేట్ కూలిపోయింది. ఇది జరిగిన వెంటనే భయంతో మిగతా ఇద్దరు చిన్నారులు పరుగులు పెట్టారు. వందల కిలోల బరువున్న గేట్ పడడం వల్ల తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపడుతున్నారు.
Viral News: ఇంటి ముందు ఆడుకుంటుండగా మీద పడిన గేట్, మూడేళ్ల చిన్నారి అక్కడికక్కడే మృతి - వీడియో
Ram Manohar
Updated at:
02 Aug 2024 12:19 PM (IST)
Viral Video: పుణేలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తు గేట్ పడిపోయింది. ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.
పుణేలో ఇంటి ముందు ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారిపై ప్రమాదవశాత్తు గేట్ పడిపోయింది. ఈ ఘటనలో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది.