2000 Rupee Currency Note:
స్టాలిన్ ట్వీట్
రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు RBI సంచలన ప్రకటన చేసింది. రెండేళ్ల క్రితమే వీటి ప్రింటింగ్ ఆపేసిన RBI ఇప్పుడు అధికారికంగా వాటిని వెనక్కి తీసుకోనుంది. ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్‌కే స్టాలిన్ స్పందించారు. కర్ణాటకలో ఎదురైన ఓటమిని కప్పి పుచ్చుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు. ట్విటర్ హ్యాండిల్‌లో బీజేపీపై విమర్శలు చేస్తూ ట్వీట్ చేశారు. కరెన్సీ నోట్లతో ముడి పెడుతూ ఆ పార్టీపై సెటైర్లు వేశారు.
"500 అనుమానాలు, 1000 మిస్టరీలు, 2 వేల తప్పులు..కర్ణాటకలోని ఓటమి..వీటన్నింటినీ కప్పి పుచ్చుకునేందుకు ఒకటే ఒక ట్రిక్ ఉంది. రూ.2 వేల నోటుని రద్దు చేయడం"
- ఎమ్‌కే స్టాలిన్, తమిళనాడు సీఎం
కర్ణాటకలో సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికే ఆయన స్పెషల్ ఫ్లైట్‌లో అక్కడికి చేరుకున్నారు. స్టాలిన్‌ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం సిద్దరామయ్య ఆహ్వానించారు. అయితే...కరెన్సీ నోట్లపై స్టాలిన్ ట్వీట్ చేసిన కాసేపటికే...అక్కడి బీజేపీ యాక్టివ అయింది. వెంటనే ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై ట్వీట్ చేశారు. కల్తీ మద్యం తాగి అంత మంది చనిపోయినా..ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండి పడ్డారు.
"కల్తీ లిక్కర్ తాగి 22 మంది చనిపోయారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేలు పరిహారంగా ఇచ్చారు. అసలు అలాంటి కల్తీ లిక్కర్ ఫ్యాక్టరీలను నడిపేదే డీఎమ్‌కే పార్టీ. Tasmac ద్వారా రూ.50 వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఈ అవినీతిని దాచేందుకు చూస్తున్నారు"
- అన్నమలై, తమిళనాడు బీజేపీ చీఫ్