West Bengal SSC Scam:


టీచర్ రిక్రూట్‌మెంట్‌లో స్కామ్‌ జరిగింది


పశ్చిమ బెంగాల్‌లో ఓ మంత్రి అసోసియేట్ ఇంట్లో నుంచి రూ. 20 కోట్ల నగదుని స్వాధీనం చేసుకుంది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. వెస్ట్ బెంగాల్ మినిస్టర్ పార్థ ఛటర్జీ అసోసియేట్‌గా పని చేస్తున్న అర్పిత ముఖర్జీ ఇంట్లో ఈ నోట్ల కట్టలు దొరికాయి. టీచర్ రిక్రూట్‌మెంట్‌ విషయంలో స్కామ్‌కు సంబంధించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈడీ ఈ ఇంట్లో రెయిడ్ నిర్వహించింది. ఆ సమయంలోనే ఈ గుట్టు  బయటపడింది. స్కూల్ సర్వీస్ కమిషన్‌ (SSC)స్కామ్‌కు పాల్పడి ఇంత డబ్బు సంపాదించినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇన్ని నోట్ల కట్టలు చూసి ఆశ్చర్య పోయిన ఈడీ అధికారులు..వాటిని లెక్కబెట్టేందుకు బ్యాంక్ అధికారులను పిలిచారు. కౌంటింగ్ మెషీన్లు తీసుకొచ్చి మొత్తంలెక్కించారు. ఈ రెయిడ్ చేస్తున్న సమయంలోనే రూ.2,000, రూ.500 నోట్లన్నీ కట్టలుగా పడి ఉన్నాయి. ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ డబ్బుతో పాటు 20 మొబైల్ ఫోన్లనూ స్వాధీనం చేసుకున్నారు. ఈ మొబైల్స్ వినియోగించే, స్కామ్‌కు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు.





 


ఇంకొందరి ఇళ్లలోనూ రెయిడ్‌లు..


విద్యాశాఖ మంత్రి పరేశ్ సి అధికారి ఇంట్లోనూ ఈడీ రెయిడ్ నిర్వహించింది. తరవాత ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య ఇంట్లోనూ ఈ రెయిడ్‌ కొనసాగింది. పార్థ ఛటర్జీ ప్రస్తుతం ఇండస్ట్రీస్ అండ్ కామర్స్‌ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు విద్యాశాఖమంత్రిగా ఉన్న సమయంలోనే SSC స్కామ్ జరిగిందన్నది ఈడీ అధికారులు చెబుతున్న విషయం. అక్రమంగా కొందరికి SSCలో అపాయింట్ చేశారనే ఆరోపణలున్నాయి. అయితే తృణమూల్ కాంగ్రెస్ మాత్రం ఈ రెయిడ్‌లను "వేధింపులు" అంటూ మండి పడుతోంది. అమరుల దినోత్సవ ర్యాలీని ఘనంగా నిర్వహించిన మరుసటి రోజే ఈడీ అధికారులు రెయిడ్ చేయటం భాజపా తట్టుకోలేకపోయిందని, అందుకే ఇలా వేధిస్తోందని ఆరోపించారు రవాణాశాఖ మంత్రి ఫిర్హద్ హకీమ్. భాజపా మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేస్తోంది. ఎస్‌ఎస్‌సీ కమిషన్‌ రిక్రూట్‌మెంట్‌లో అవినీతి జరిగిందని స్పష్టం చేస్తోంది. 


Also Read: SSMB 28 Exclusive Update: మహేష్ బాబుతో విజయ్ సేతుపతి - ఆగస్టు నుంచి