Today Top Headlines In AP And Telangana:


దావోస్‌లో అనుసరించే వ్యూహంపై చర్చ 


ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల కల్పన, భారీ పెట్టుబడుల సాధనే లక్ష్యంగా జనవరి 20నుంచి 24వరకు దావోస్‌లో సీఎం చంద్రబాబు టీం పర్యటించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఎలాంటి వ్యూహంతో వెళ్లాలి పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏం చేయాలనే అంశంపై పెట్టుబడుల టాస్క్ ఫోర్స్ కమిటీ చైర్మన్ నారా లోకేష్ అధికారులతో చర్చించారు. అయిదు రోజులపాటు జరిగే ఈ సదస్సులో వివిధ దేశాలకు చెందిన 50మందికిపైగా అంబాసిడర్లు, పారిశ్రామికవేత్తలతో రాష్ట్ర బృందం సమావేశం కానుంది. ఏపీ పెవిలియన్‌లో 30మంది ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరుపుతారు. ఇంకా చదవండి.


జాగో ఢిల్లీ జాగో అంటున్న కేటీఆర్


జాగో ఢిల్లీ జాగో అంటూ బీఆర్‌ఎస్ కొత్త ప్రచారం ప్రారంభించింది. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ విమర్శలు చేశారు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలను విడుదల చేయడంపై సెటైర్లు వేశారు. తల్లికి బువ్వ పెట్టనోడు- చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తీరు ఉందని సోషల్ మీడియాలో విమర్శలు చేశారు. తెలంగాణలో 420  హామీలు ఇచ్చి గంగలో కలిపిన రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో కొత్త నాటకానికి తెరతీశారని మండిపడ్డారు. ఇంకా చదవండి.


చంద్రబాబుపై షర్మిల సెటైర్లు   


ఎన్నికల్లో సూపర్ సిక్స్ పథకాలు అంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు వాటి అమలు సంగతే మర్చిపోయారంటూ విమర్శలు చేశారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. ఏరు దాటే దాకా ఓడ మల్లన్న.. దాటాక బోడి మల్లన్న’’ అనే మాటల్ని తలపిస్తోందని ఆరోపించారు. ఎన్నికల టైంలో గుర్తు లేని ఆదాయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుందని అన్నారు. పథకాలు ఎగ్గొట్టేందుకే సాకులు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా చదవండి.


వివాహేతర సంబంధం, ఆపై వ్యభిచారం


సెల్‌ఫోన్ సిగ్నల్ ఓ జంట కేసును ఛందించింది. తెలంగాణలోని పుప్పాలగూడ గుట్టల వద్ద జంట హత్యలు ఎంత కలకలం సృష్టించాయో తెలిసిందే. దీన్ని విచారించిన నార్సింగి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. అక్రమ సంబంధం ఆపై వ్యభిచారం రెండు నిండు ప్రాణాలను తీసింది. ముగ్గర్ని జైలు పాలు చేసింది. ఏకాంతంగా ఉన్న టైంలో వీడియోలు చిత్రీకరించేందుకు అంగీకరించలేదని మహిళను, ఆమె ప్రియుణ్ని చంపేశారు నిందితులు. ఇంకా చదవండి.


నాగ చైతన్య చేపల పులుసు


యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న 'తండేల్' సినిమాలో శ్రీకాకుళం తీర ప్రాంతానికి చెందిన యువకుడి పాత్రలో నటిస్తున్నారు. సముద్రంలోకి వెళ్లిన తర్వాత ఒక్కోసారి ఒడ్డుకు రావడానికి చాలా రోజుల సమయం పడుతుంది. ఇలాంటి మత్స్యకారుని పాత్ర చేయడం మాత్రమే కాదు అందులో జీవించేశాడు అక్కినేని నాగ చైతన్య. ఈ చిత్రం కోసం శ్రీకాకుళం యాస నేర్చుకోవడమే కాదు సినిమా షూటింగ్ టైంలో స్థానిక ప్రజలకుచేపల పులుసు వండి వడ్డించారు.  ఇంకా చదవండి.