అన్వేషించండి

Super Subbu Web Series Review - సూపర్ సుబ్బు రివ్యూ: Netflixలో సెక్స్ ఎడ్యుకేషన్ సిరీస్ - సందీప్ కిషన్ & టీమ్ ఎలా చేశారంటే?

OTT Review - Super Subbu On Netflix: సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. సెక్స్ ఎడ్యుకేషన్ మీద తీసిన ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో తెలుసుకోండి.

Sundeep Kishan's Netflix Original Series Super Subbu Review In Telugu: యువ కథానాయకుడు సందీప్ కిషన్ నటించిన వెబ్ సిరీస్ 'సూపర్ సుబ్బు'. మిథిలా పాల్కర్, మానసా చౌదరి హీరోయిన్లు. మురళీ శర్మ, బ్రహ్మానందం, సంపూర్ణేష్ బాబు, రఘుబాబు ప్రధాన తారాగణం. నెట్‌ఫ్లిక్స్‌ కోసం రూపొందిన ఒరిజినల్ సిరీస్ ఇది. జూలై 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సెక్స్ ఎడ్యుకేషన్ మీద తీసిన ఈ సిరీస్ ఎలా ఉంది? సందీప్ కిషన్ ఎలా చేశారు? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ (Super Subbu Story Explained In Telugu): సుబ్బు... చిలుకూరి సుబ్రహ్మణ్య రావు (సందీప్ కిషన్)ది హైదరాబాద్. ఆయన తండ్రి కుక్కుటేశ్వర రావు (మురళీ శర్మ) స్కూల్ హెడ్ మాస్టర్. తనయుడిపై ఆయనకు ఎప్పుడూ సరైన అభిప్రాయం లేదు. అబ్బాయికి ఉద్యోగం రాకపోతే తన పరపతి ఉపయోగించి ఓ స్కూల్‌లో టెంపరరీ ఉద్యోగం ఇప్పిస్తాడు.

ఆదిలాబాద్ జిల్లాలోని మాకీపూర్ గ్రామంలో ప్రజలకు కుటుంబ నియంత్రణ లేకుండా పోయిందని, ఆ ఊరి ప్రజలకు 'సెక్స్ ఎడ్యుకేషన్' క్లాసులు తీసుకోమని సుబ్బును పంపిస్తారు. ఆ ప్రోగ్రాం సక్సెస్ అయితే ఉద్యోగం పర్మినెంట్ చేస్తామని చెబుతాడు. అమ్మాయిల వైపు సుబ్బు చూస్తే చాలు తాచు తొక్కిన పాములా పైకి లేస్తాడు తండ్రి కుక్కుటేశ్వర రావు. టీవీలో కండోమ్ యాడ్ వచ్చినా ఊరుకోడు. ఛానల్ మార్చమని చెబుతాడు. అటువంటి తండ్రికి తెలియకుండా మాకీపూర్ వెళతాడు సుబ్బు. 

దివ్య (మానసా చౌదరి)తో పెళ్లికి, పర్మినెంట్ ఉద్యోగానికి లింక్ పెడతాడు సుబ్బు తండ్రి. దాంతో ఇష్టం లేకపోయినా మాకీపూర్ వెళతాడు. అక్కడ పరిచయమైన స్వాతి (మిథిలా పాల్కర్)కు, సుబ్బుకు మధ్య ఏం జరిగింది? సెక్స్ ఎడ్యుకేషన్ మీద కనీస అవగాహన లేని, శృంగారం పేరెత్తితే భగ్గున లేచే మాకీపూర్ ప్రజల్లో సుబ్బు మార్పు తీసుకు రాగలిగాడా? లేదా? పట్టణానికి తీసుకువెళ్లి అబార్షన్ చేయించిన మాకీపూర్ అమ్మాయి ఎవరు? దివ్యతో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో వచ్చిన సమస్య ఏమిటి? చివరకు ఎవర్ని ప్రేమించాడు? సుబ్బు విషయం ఇంట్లో తెలిశాక ఏమైంది? చివరకు ఏం చేశాడు? అనేది సిరీస్ చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Super Subbu Web Series Review Telugu): ఇప్పటికీ సెక్స్ ఎడ్యుకేషన్ పట్ల విముఖత చూపించే పల్లెలు ఎన్నో ఉన్నాయి. పలు గ్రామాల్లో 'సెక్స్' గురించి ఓపెన్‌గా మాట్లాడలేని పరిస్థితి. సినిమాల్లోనూ ఆ సబ్జెక్టు టచ్ చేయడం లేదు. వై? ఎందుకు? అంటే... 'కత్తి మీద సాము లాంటి వ్యవహారం'. ఏమాత్రం గీత దాటినా విమర్శలు వస్తాయి. 'రానా నాయుడు'లో వెంకటేష్ డైలాగులపై తెలుగు ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అందువల్ల, పల్లెటూరిలో సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కాన్సెప్ట్ తీసుకుని 'సూపర్ సుబ్బు' సిరీస్ చేశారనే సరికి... ఏం చెప్పారో? ఎలా తీసి ఉంటారో? అని అందరిలో ఓ క్యూరియాసిటీ అయితే ఉంది.

హిందీ హిట్ 'విక్కీ డోనర్'ను తెలుగులో 'నరుడా డోనరుడా'గా రీమేక్ చేసిన మల్లిక్ రామ్... 'సూపర్ సుబ్బు'కు దర్శకుడు. తెలుగులో వీరద్యానంపై సినిమా చేసిన అనుభవం ఆయనకు ఉంది. 'నరుడా డోనరుడా' రిజల్ట్ పక్కన పెడితే... తెలుగు ప్రేక్షకుల సెన్సిబిలిటీస్ మల్లిక్ రామ్ (Director Mallik Ram)కు తెలుసు. సిరీస్‌లో ఆయన ఎక్కడా గీత దాటలేదు. డైరెక్టుగా సబ్జెక్టులోకి వెళ్ళలేదు మల్లిక్ రామ్.

'సూపర్ సుబ్బు' ఫస్ట్ ఎపిసోడ్‌లో సందీప్ కిషన్, మురళీ శర్మ పాత్రలను పరిచయం చేసిన విధానం చూస్తే... మన సమాజం కళ్ళ ముందు కనిపిస్తుంది. స్కూల్స్‌లోనూ కొన్నేళ్ళ ముందు ఫిమేల్ రీప్రొడుక్టివ్ సిస్టమ్ (female reproductive system) వంటి సెక్స్ ఎడ్యుకేషన్ టాపిక్స్ స్కిప్ చేసేవాళ్ళు. చదువుకున్న, భావితరాలు తీర్చి దిద్దే - పిల్లలకు చదువు చెప్పే టీచర్లు సైతం 'సెక్స్' అంటే అంటరాని పదంగా భావించి పిల్లలతో డిస్కస్ చేసేవారు కాదు. మురళీ శర్మతో అటువంటి టీచర్ / తండ్రి కనిపిస్తారు. అందువల్ల, 'సూపర్ సుబ్బు' మన కథగా కనిపిస్తుంది. అక్కడ నుంచి మాకీపూర్ ఊరికి సందీప్ కిషన్ వెళ్లిన తర్వాత వచ్చే సన్నివేశాలు సైతం నవ్విస్తూ, తర్వాత ఏమవుతుందోనని కాస్త క్యూసియాసిటీ క్రియేట్ చేస్తూ ముందు వెళతాయి.

మల్లిక్ రామ్ తీసిన కొన్ని సన్నివేశాల్లో, మాటల్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. మగబిడ్డ పుట్టాలంటే ఏం చేయాలని ఊరిలో మహిళలు అడిగినప్పుడు గర్భాన్ని మట్టిగా, వీర్యాన్ని విత్తనంగా అందరికీ అర్థమయ్యేలా చెప్పిన తీరు బావుంది. ఇంకా ఆ సన్నివేశంలో శానిటరీ ప్యాడ్స్, శుభ్రత గురించి చెప్పేత్యప్పుడు 'అందరికీ జన్మ స్థానమైన ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి సిగ్గు ఎందుకమ్మా?' అని సందీప్ కిషన్ అడిగే ప్రశ్నలోనూ ఎక్కడా గీత దాటలేదు. సాధారణంగా సినిమాల్లో వేశ్య పాత్రలను గ్లామరస్‌గా చూపించడం జరుగుతుంది. కానీ, ఇందులో దివ్యా పిళ్ళైను ఎటువంటి గ్లామర్ షో లేకుండా చూపించారు. హీరోతో 'ఊరంతా నేను చేసే పని బూతు అన్నా... దాంట్లోనే నేను బతుకు వెతుక్కుంటున్నా. కానీ నువ్వు బతకనీకి చేసే పనిని బూతు అనుకుంటున్నావు' అని చెప్పే మాటలో డెప్త్ ఉంది.

Also Read: Gurthukosthunnayi Web Series Review - 'గుర్తుకొస్తున్నాయి' రివ్యూ: పెళ్ళికి ముందు కుర్రాడు గజనీ అయితే? ETV Winలో కొత్త వెబ్ సిరీస్ ఎలా ఉందంటే?

ప్రజలకు శృంగారంపై అవగాహన కల్పించే సందేశాత్మక కథతో తెరకెక్కిన సిరీస్ 'సూపర్ సుబ్బు'. అయితే... ఇందులో సందేశం ఒక్కటే లేదు. చక్కటి వినోదం కూడా ఉంది. సిట్యువేషనల్ ఫన్ జనరేట్ అయ్యింది. అయితే... సాదాసీదాగా, కాస్త నెమ్మదిగా మొదలై, తర్వాత కథలోకి తీసుకు వెళుతుంది. సందీప్ కిషన్ - మానసా చౌదరి మధ్య సన్నివేశాలు చూసినప్పుడు ఈ జంటకు పెళ్ళి కాదని ప్రేక్షకులకూ తెలుస్తుంది. ఊరిలో మిథిలా పాల్కర్‌ను పరిచయం చేసినప్పుడు ఆమెతో హీరో సెటిల్ అవుతాడని అర్థమవుతుంది. అందువల్ల, ఆ ట్రాక్స్ వచ్చినప్పుడు ఏమంత ఆసక్తి కలగదు. సందీప్ - మిథిలా మధ్య సన్నివేశాలు కొంత బెటర్. సీక్వెల్ లీడ్ కోసం మరో అమ్మాయి కణికా మాన్ (Kanika Mann) పాత్రను రాశారు. ఆమె సీన్స్, ఆ ఎపిసోడ్ లెంగ్త్ పెంచాయి తప్ప... ఇప్పటి వరకు చెప్పిన కథలు వేల్యూ యాడ్ చేయలేదు. ఎండింగ్ కూడా అప్రిషియేట్ చేసేలా లేదు. హడావిడిగా ముగించినట్టు ఉంటుంది.

టెక్నికల్‌గా 'సూపర్ సుబ్బు' సిరీస్‌లో హై స్టాండర్డ్స్ మైంటైన్ చేశారు. అనుదీప్ దేవ్ సంగీతం, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, చంద్రిక ప్రొడక్షన్ డిజైన్ కథకు నేటివిటీని యాడ్ చేశాయి. సందర్భానికి తగ్గట్టు పాటలు కుదిరాయి. మాకీపూర్ ఊరిలోకి కథ షిఫ్ట్ అయ్యాక పల్లెను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మాణ విలువలు బావున్నాయి.

Also ReadIsakapatnam Web Series Review And Rating - 'ఇసకపట్నం' రివ్యూ: ప్రైమ్ వీడియోలో సముద్రఖని, ఐశ్వర్య రాజేష్‌ల క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ - ఎలా ఉందంటే?

సందీప్ కిషన్‌ది బాయ్ నెక్స్ట్ డోర్ టైపు రోల్. తన తప్పు లేకుండా ఇరుక్కుపోయే సన్నివేశాల్లో ఆయన ముఖంలో కనిపించే అమాయకత్వం, నటన ఆ పాత్రపై జాలి కలిగేలా చేశాయి. ఎమోషనల్ సీన్స్‌లోనూ అనుభవం చూపించారు. సుబ్బుగా చాలా చక్కగా చేశారు. లంగా ఓణీలు కట్టినా... మిథిలా పాల్కర్‌ను పల్లెటూరి పిల్ల అంటే నమ్మడం కష్టంగా ఉంటుంది. తెలంగాణ యాసలో డైలాగులకు ఆమె పేస్ సెట్ కాలేదు. కానీ, నటనలో లోటు చేయలేదు. ఆడిషన్ సీన్‌లో అదరగొట్టారు. 

మురళీ శర్మ మెథడ్ యాక్టింగ్ చేశారు. మానసా చౌదరి తన పాత్రకు న్యాయం చేశారు. ఇక మాకీపూర్ ఊరి ప్రజలుగా గెటప్ శ్రీను, జీవన్ అండ్ గ్యాంగ్ నవ్వించారు. హీరో మావయ్యగా సునీల్ పాత్రలో సంపూర్ణేష్ బాబు, వేశ్యగా దివ్యా పిళ్ళై కనిపించారు. ఆమె ఇంటికి మురళీ శర్మ, సంపూర్ణేష్ బాబు పెళ్లి సంబంధం మాట్లాడటం కోసం వెళ్లే సన్నివేశం నవ్విస్తుంది. రఘుబాబు, బ్రహ్మానందం, హైపర్ ఆది తదితరుల పాత్రల పరిధి తక్కువ. ఉన్నంతలో బాగా చేశారు.

కత్తి మీద సాములాంటి సబ్జెక్టు తీసుకుని ఎక్కడా గీత దాటకుండా చక్కగా తీసిన సిరీస్ 'సూపర్ సుబ్బు'. సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ సహా ప్రతి ఆర్టిస్ట్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. కథలో సందేశం కంటే వినోదం ఎక్కువ ఉంది. సందేశాన్ని చెప్పిన తీరు బావుంది. అయితే... సీక్వెల్ కోసం కథను మధ్యలో ముగించడంతో చివరిలో కాస్త అసంతృప్తి ఉంటుంది. ఓవరాల్‌గా చూస్తే... స్టార్టింగ్ టు ఎండింగ్ - ఏడు ఎపిసోడ్స్ ఉన్న 'సూపర్ సుబ్బు' సిరీస్ ఎంగేజ్ చేస్తుంది. ఈ వీకెండ్ వీక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది.

Also ReadBalan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Lokesh Kanagaraj DC : హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
హీరోగా లోకేశ్ కనగరాజ్ - రొమాంటిక్ యాక్షన్ డ్రామా DC సెన్సార్ రివ్యూ... న్యూ రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
Poonam Pandey : హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
హీరోయిన్‌ను పబ్లిక్‌గా ముద్దు పెట్టుకోబోయిన ఫ్యాన్ - నెట్టేసిన బాలీవుడ్ బ్యూటీ
Ragini 3 : బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
బోల్డ్ హారర్ థ్రిల్లర్‌లో మిల్కీ బ్యూటీ - ఫస్ట్ డే షూటింగ్... 12 ఏళ్ల తర్వాత...
Fauzi Release Date: ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
ఫౌజీ రిలీజ్ డేట్... డిసెంబర్‌లో థియేటర్లలోకి ప్రభాస్ సినిమా
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్  రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget