Youth Telugu Review - 'యూత్' రివ్యూ: ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ... కెన్ కామెడీ సినిమా ఎలా ఉందంటే?
Youth Movie Review In Telugu: కెన్ కరునాస్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'యూత్'. శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న తెలుగులో విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కెన్ కరునాస్
కెన్ కరునాస్, మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్, దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు తదితరులు
Ken Karunas Youth Review In Telugu: 'అసురన్' (తెలుగులో 'నారప్ప'గా వెంకటేష్ రీమేక్ చేశారు)లో ధనుష్ కుమారుడిగా నటించిన యువకుడు కెన్ కరునాస్. 'సార్' సినిమాలోనూ ఓ క్యారెక్టర్ చేశారు. ఇప్పుడు ఆ యువకుడు హీరోగా నటించడంతో పాటు 'యూత్' సినిమాకు దర్శకత్వం వహించారు. తమిళంలో 'ధురంధర్ 2'తో పాటు విడుదలైంది. తెలుగులో శ్రీరామనవమి సందర్భంగా మార్చి 27న విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉందంటే?
కథ (Youth 2026 Movie Story): ప్రవీణ్ (కెన్ కరునాస్) ఓ సాధారణ మధ్య తరగతి కుటుంబంలో కుర్రాడు. తండ్రి (సూరజ్ వెంజరమూడు)ది బేకరీ. తల్లి (దేవదర్శిని) హౌస్ వైఫ్. వాళ్ళది ప్రేమ వివాహం. ప్రవీణ్ ఐఎస్ఎస్ అవ్వాలనేది తల్లి కోరిక. కొడుకు ఏమో అత్తెసరు మార్కులతో పాస్ అవుతాడు. పైగా ఇంటర్ కాలేజీలో ముగ్గురు అమ్మాయిలతో ప్రేమ కథలు ఉన్నాయి.
ప్రేషిక (మీనాక్షి దినేష్)తో ప్రవీణ్ ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి కొన్ని రోజులు ఊరు వెళ్లి వచ్చేసరికి సోనాల్ (ప్రియాన్షి యాదవ్) మీద ఫీలింగ్స్ పెంచుకుంటాడు. ఆ తర్వాత గంగవల్లి (అనీష్మా అనిల్ కుమార్)తో ప్రేమలో పడతాడు. అసలు ఆ ముగ్గురిలో ప్రవీణ్ ఎవర్ని పేమించాడు? అతడిని ప్రేమించింది ఎవరు? ఇంట్లో ఏం జరిగింది? అనేది సినిమా.
విశ్లేషణ (Youth 2026 Review In Telugu): న్యూ ఏజ్ స్కూల్, కాలేజ్ కథలకు మంచి ఆదరణ లభిస్తోంది. తెలుగులో 'లిటిల్ హార్ట్స్', తమిళంలో 'విత్ లవ్' ప్రశంసలతో పాటు వసూళ్లు సైతం సాధించాయి. 'యూత్' కూడా ఆ లిస్టులో సినిమాయే. ప్రతి ఒక్కరికీ స్కూల్ / కాలేజ్ లైఫ్, క్రష్ కామన్. ఆ పాయింట్ మీద 'యూత్' సినిమా తీశారు కెన్ కరునాస్.
కెన్ నటనలో, దర్శకత్వంలో మంచి కామెడీ టైమింగ్ ఉంది. అది 'యూత్'కు బాగా ప్లస్ అయ్యింది. కథలో కొత్తదనం లేదు. కానీ, కామెడీ సన్నివేశాల్లో తన మార్క్ బాగా చూపించారు కెన్. అతని నటన వల్ల కొన్ని సన్నివేశాలకు యూత్ బాగా కనెక్ట్ అవుతారు. ఇంటర్వెల్ వరకు సినిమా సరదాగా సాగింది. క్లాస్ రూమ్ బయటకు హీరో రావడం, అక్కడ అమ్మాయి పరిచయం కావడం, వాళ్ళను విడగొట్టడానికి మరొకరు వేసే ప్లాన్స్... సరదా సరదాగా సాగింది. అయితే... ఇంటర్వెల్ తర్వాత కథలో కామెడీ తగ్గింది. ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషన్స్ పెరిగాయి. ఇంతకు ముందు మనం కొన్ని సినిమాల్లో ఆ సన్నివేశాలను చూసినట్టు ఉండటంతో పాటు స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్‌గా ఉండటం వల్ల నిదానంగా ముందుకు వెళ్ళిందీ సినిమా. అయితే క్లైమాక్స్ వచ్చేసరికి ఎమోషన్స్ వర్కవుట్ అయ్యేలా దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు, కెన్ కరునాస్ నటన సాగింది.
Also Read: Oscar: ఆస్కార్స్‌లో షాకింగ్ మూమెంట్స్... చిరిగిన డ్రస్ నుంచి తగిలిన చెంపదెబ్బల వరకూ - వివాదాల వేడుక
'యూత్'కు ఆన్ స్క్రీన్ హీరో కెన్ కరునాస్ అయితే... ఆఫ్ స్క్రీన్ హీరో మాత్రం జీవీ ప్రకాష్ కుమార్ అని చెప్పాలి. కథకు తగ్గట్టు మాంచి 'యూత్'ఫుల్ సాంగ్స్ ఇచ్చారు. ఆర్ఆర్ కూడా బావుంది. ప్రొడక్షన్ డిజైన్ ఓకే. మెజారిటీ సన్నివేశాలు కాలేజీలో, హీరో ఇంట్లో ఉన్నాయి. ఒక్క ఎపిసోడ్ కోసం కేరళ వెళ్లారు. కథకు తగ్గట్టు ఖర్చు చేశారు.
హీరోగా కాకుండా పక్కింటి కుర్రాడి తరహాలో, 'యూత్' కథకు తగ్గట్టు కెన్ కరునాస్ నటించారు. హీరోగా పర్ఫెక్ట్ డెబ్యూ. కాలేజీ కథలకు బాగా సూట్ అవుతారు. మీనాక్షి దీక్షిత్, ప్రియాన్షి యాదవ్, అనీష్మా అనిల్ కుమార్... ముగ్గురు అమ్మాయిలు క్యూట్ గా ఉన్నారు. పాత్రలకు తగ్గట్టు నటించారు. దేవదర్శిని, సూరజ్ వెంజరమూడు అనుభవం వాళ్ళ నటనలో కనిపించింది. తెలుగు డబ్బింగ్ ఓకే. హీరో ఫ్రెండ్ గ్యాంగులో ఒక అబ్బాయికి సుమన్ శెట్టిని గుర్తు చేసేలా డబ్బింగ్ చెప్పించడం బావుంది.
స్కూల్, కాలేజ్ స్టూడెంట్స్ మాత్రమే కాదు... 'యూత్' అందరూ తమ స్నేహితులతో కలిసి వెళ్లి సరదాగా కాసేపు నవ్వుకునే సినిమా 'యూత్ 2026'. కెన్ కరునాస్ నటన, జీవీ ప్రకాష్ సంగీతం, కామెడీ బావున్నాయి. కథలో కాస్త రొటీన్ సీన్స్ ఉన్నాయంతే! అదొక్కటీ పక్కన పెడితే... కామెడీని ఎంజాయ్ చేయవచ్చు.
Also Read: Allu Cinemas: అల్లు సినిమాస్ స్పెషాలిటీ ఏమిటి? 'డాల్బీ సినిమా' స్క్రీన్‌లో పిక్చర్ ఎందుకు చూడాలంటే?
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















