Silence 2 Review In Telugu: క్రైమ్ డ్రామా సినిమాలు ఎప్పటికీ ఔట్‌డేటెడ్ కాదు. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే ప్రతీ క్రైమ్ డ్రామా మూవీ మినిమమ్ గ్యారెంటీ హిట్‌గా నిలుస్తుంది. అయితే ఈరోజుల్లో ఇలాంటి జోనర్‌లో వచ్చే సినిమాలు.. ఎక్కువగా స్క్రీన్ ప్లే పైనే దృష్టిపెడుతున్నాయి. ఒక క్రైమ్ జరగడం, అది పోలీసులు ఛేదించాలని చూడడం.. ఇదంతా ప్రతీ క్రైమ్ డ్రామాలో కామన్. కానీ అందులో ఎక్కువ ట్విస్టులు చేయడం వల్ల ప్రేక్షకులు కూడా ఈ జోనర్‌లో వచ్చే సినిమాల నుండి కొత్తదనం కోరుకుంటున్నారు. అలాంటి వారికోసమే తాజాగా ఓటీటీలో ‘సైలెన్స్ 2’ విడుదలయ్యింది. 2021లో విడుదలయిన ‘సైలెన్స్’కు ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది.


కథ..


కథ విషయానికొస్తే.. నైట్ ఓవెల్ అనే బార్‌లో షూటౌట్ జరగడంతో సినిమా ప్రారంభమవుతుంది. అది ఎవరు చేశారు? ఎందుకు చేశారు తెలుసుకోవడానికి ఏసీపీ అవినాష్ వర్మ (మనోజ్ బాజ్‌పేయి) తన టీమ్‌తో రంగంలోకి దిగుతాడు. తన టీమ్‌లో పనిచేసే ఇన్‌స్పెక్టర్ సంజనా భాటియా (ప్రాచీ దేశాయ్).. అవినాష్ వర్మకు కేసు విషయంలో సాయంగా ఉంటుంది. మెల్లగా ఆ షూటౌట్ గురించి విచారణ ముందుకు వెళ్లుండగా.. వారికి దాని వెనుక కారణాలు తెలుస్తూ ఉంటాయి. వాళ్లు డీల్ చేస్తున్న విషయం చిన్నది కాదని అర్థమవుతోంది. మెల్లగా ఆ షూటౌట్‌లో భాగమయిన వారిని పోలీసులు ఎలా పట్టుకుంటారు? మెయిల్ విలన్ వరకు వాళ్లు ఎలా చేరుకుంటారు? అనేది తెరపై చూడాల్సిన అసలు కథ.


విశ్లేషణ..


ఎన్నో ఇతర క్రైమ్ డ్రామా సినిమాలలాగానే ‘సైలెన్స్ 2’ కూడా ట్విస్టుల మీద ట్విస్టులతోనే ముందుకెళ్తుంది. కానీ స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం ఇతరులలాగా కాకుండా తనకంటూ ఒక సొంత స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు దర్శకురాలు అబాన్ భారుచా డియోహాన్స్. అయితే ఒక క్రైమ్ థ్రిల్లర్‌లో వెంటవెంటనే అనవసరమైన ట్విస్టులను చేర్చాల్సిన అవసరం లేదని అబాన్ నిరూపించారు. అందుకే ‘సైలెన్స్ 2’లో ఒక లీడ్ నుండి మరో లీడ్‌కు వెళ్లే సమయంలో కాస్త బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కానీ బోర్ కొడుతుందేమో అని ప్రేక్షకుడు ఫీలయ్యే సమయానికి అక్కడ ఏదో ఒక ట్విస్ట్‌ను యాడ్ చేశారు. అలా అప్పుడప్పుడు కాస్త బోర్ కొట్టినట్టు అనిపించినా.. హాలీడేకు మంచి క్రైమ్ థ్రిల్లర్‌ను చూడాలంటే ‘సైలెన్స్ 2’ను ట్రై చేయవచ్చు.


Also Read: ‘చమ్కీల’ మూవీ రివ్యూ - డబుల్ మీనింగ్ పాటలు పాడే ఆ సింగర్స్‌ను ఎందుకు చంపారు? మూవీ ఎలా ఉంది?


చివరి వరకు సస్పెన్స్..


ఇక ‘సెలెన్స్ 2’లో లీడ్ రోల్స్ చేసిన నటీనటుల విషయానికొస్తే.. మనోజ్ బాజ్‌పేయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పోలీస్ పాత్ర అయినా, లాయర్ పాత్ర అయినా.. ఆయన మెథడ్ యాక్టింగ్ ద్వారా ఆ పాత్రలో లీనమయిపోతాడు. ఇక ‘సైలెన్స్’లో కేవలం ఒక హత్య కేసుపైనే అవినాష్ వర్మ టీమ్ అంతా కష్టపడుతుంది. కానీ ‘సైలెన్స్ 2’లో అలా కాదు. ఒక బార్ షూటౌట్, అసలు అది ఎందుకు జరిగింది, ఎవరు చేయించారు అనే కథ.. సినిమా మొత్తాన్ని చాలావరకు ఇంట్రెస్టింగ్‌గా నడిపించింది. ఇందులో హంతకుడు ఎవరు అని చివరి వరకు సస్పెన్స్ మెయింటేయిన్ చేయడంలో డైరెక్టర్ అబాన్ భారూచా సక్సెస్ అయ్యారు. కొన్ని సీన్స్ సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెడతాయి. 


పోలీస్ క్యారెక్టర్స్‌లో పట్టు లేదు..


ఇతర క్రైమ్ థ్రిల్లర్స్‌లో చూసిన పోలీస్ టీమ్స్‌లాగా ‘సైలెన్స్ 2’లోని అవినాష్ వర్మ టీమ్ ఉండదు. అంటే ఇందులో అవినాష్ వర్మగా నటించిన మనోజ్ బాజ్‌పేయి పర్సనల్ లైఫ్ గురించి తప్పా.. ఇతర పోలీస్ ఆఫీసర్లకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఏమీ ఇవ్వలేదు. ఇన్వెస్టిగేషన్ విషయానికి వచ్చేసరికి అందరూ సమానంగా అన్నట్టుగానే చూపించినా.. ఎక్కువశాతం స్టోరీలో మనోజ్ బాజ్‌పేయి, ప్రాచీ దేశాయ్ పాత్రలే కీలకం. ప్రాచీ కూడా తన పాత్రకు న్యాయం చేసింది. మిగిలిన ఇద్దరు ఆఫీసర్ల పాత్రలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అక్కడక్కడా బోర్ కొట్టిన పర్వాలేదు.. ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ చూడాలి అనుకునే ప్రేక్షకులు.. జీ5లో అందుబాటులో ఉన్న ‘సైలెన్స్ 2’ను ట్రై చేయవచ్చు. 


Also Read: ఓర్నీ, చిన్న కారణానికే హత్య? ట్విస్టులతో పిచ్చెక్కిస్తున్న భావన లేటెస్ట్ థ్రిల్లర్