అన్వేషించండి

Pratichaya Review Telugu - ప్రతిఛాయ రివ్యూ - Jiohotstar ఓటీటీలో నివిన్ పాలి సినిమా - రాజకీయ చిత్రమ్ ఎలా ఉందంటే?

OTT Review - Pratichaya On Jiohotstar: మలయాళ హీరో నివిన్ పాలి నటించిన 'ప్రతి ఛాయ' జియో హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది.

Pratichaya Movie Review Rating In Telugu: మలయాళ కథానాయకుడు నివిన్ పాలి నటించిన సినిమా 'ప్రతిఛాయ'. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మార్చి 26న మలయాళంలో థియేటర్లలో విడుదలైంది. ఏప్రిల్ 24వ తేదీ నుంచి మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ జియో హాట్‌స్టార్ ఓటీటీలో వీక్షకులకు అందుబాటులో ఉంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (Pratichaya Story): జాన్ వర్గీస్ (నివిన్ పాలీ)... కేరళ ముఖ్యమంత్రి రెండో కుమారుడు. అతనికి ఓ అన్నయ్య. అతను ఎంపీ. అయితే... జాన్ వర్గీస్ మాత్రం రాజకీయాల్లోకి రాకుండా స్టార్టప్ ప్రారంభించి విదేశాలు వెళ్లాలని రెడీ అవుతాడు. సరిగ్గా ఆ సమయంలో కేరళ ముఖ్యమంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తాయి. ఆ అవమానం తట్టుకోలేక గుండెపోటుతో మరణిస్తారు. అనూహ్య పరిణామాల మధ్య జాన్ వర్గీస్ ముఖ్యమంత్రి అవుతారు.

ముఖ్యమంత్రి అయ్యాక జాన్ వర్గీస్ ఏం చేశారు? అతని తండ్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు నిజామా? అబద్ధమా? రాజకీయాల్లో వర్గీస్ కుటుంబానికి శత్రువులు ఎవరు? తెరవెనుక ఎవరెవరు ఎటువంటి కుట్రలు చేశారు? చివరకు ఏమైంది? అనేది 'ప్రతిఛాయ' సినిమా.

విశ్లేషణ (Pratichaya Review Telugu): నివిన్ పాలీకి తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన 'ప్రేమమ్'ను తెలుగులో అదే పేరుతో నాగ చైతన్య రీమేక్ చేశారు. అయితే మలయాళ వెర్షన్ చూసిన జనాలు ఉన్నారు. మలయాళ సినిమా 'సర్వం మాయ' థియేటర్లలో విడుదలైనప్పుడు, ఓటీటీలో తెలుగు వెర్షన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. నివిన్ పౌలీ నటించడంతో ఓటీటీలో 'ప్రతి ఛాయ' మీద వీక్షకుల చూపు పడింది. ఈ సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...

Also Read: Vaazha 2 Review In Telugu - వాలా 2 రివ్యూ: మలయాళంలో 200 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా - ఎలా ఉందంటే?

'ప్రతిఛాయ' అంటే ప్రతిబింబం అని అర్థం. ప్రతిఛాయ అని కాకుండా ప్రతిచర్య అని టైటిల్ పెడితే బావుండేది ఏమో!? ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని ఈ సినిమా చివరకు అర్థం అవుతుంది. కథ గురించి క్లుప్తంగా చెప్పాలంటే... ఇదొక రివేంజ్ డ్రామా. రాజకీయం, వైట్ కాలర్ కార్పొరేట్ కరప్షన్ నేపథ్యంలో తీసిన సినిమా. ఫస్టాఫ్ అంతా రానా దగ్గుబాటి 'లీడర్'ను గుర్తు చేస్తుంది. కథ, పాత్రలు, సన్నివేశాలు వేరు కానీ... పాయింట్ అయితే 'లీడర్'కు దగ్గరగా ఉంటుంది. తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటికీ... రాజకీయాలపై ఆసక్తి లేని కొడుకు విదేశాలు వెళ్లేందుకు రెడీ అవుతాడు. తండ్రి అనూహ్య మరణంతో సీఎం కుర్చీలో కూర్చుని తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటాడు.

Also ReadBad Boy Karthik Movie Review - 'బ్యాడ్ బాయ్ కార్తీక్' రివ్యూ: బాబోయ్... మరీ అంత బ్యాడా? నాగశౌర్య సినిమాను చూడలేమా?

ఓటీటీలో 'ప్రతి ఛాయ' చూసే తెలుగు వీక్షకులు ఎదుర్కొనే మొదటి సమస్య... డబ్ క్వాలిటీ. డబ్బింగ్ బాలేదు. రెండో సమస్య... 'లీడర్' ఛాయలు కనిపించడం. మూడో సమస్య... చాలా నిదానంగా సినిమా సాగడం! సినిమా మొదలైన అరగంట వరకు కథ అసలు ముందుకు వెళ్ళదు. ఆ తర్వాత కూడా చాలా నిదానంగా ముందుకు సాగుతుంది. కథకు కీలకమైన న్యూస్ ఛానల్‌లో సీఎం లైవ్ ఇంటర్వ్యూ కూడా 'ఒకే ఒక్కడు' ఇంటర్వ్యూను గుర్తు చేస్తుంది. మీడియాపై కొన్ని సీన్లు మోహన్ లాల్ 'లూసిఫర్'ను గుర్తు చేస్తాయి. సినిమాలో రెండు మూడు సీన్లు మాత్రమే బావున్నాయి. పాటలు తెలుగు ప్రేక్షకులకు అర్థం కావడం కష్టం. డబ్బింగ్ లిరిక్స్, క్వాలిటీ ఆ స్థాయిలో ఉన్నాయి. నివిన్ పౌలీ మినహా తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ. అందువల్ల, సినిమాను చివరి వరకు చూడాలంటే ఓపిక చాలా అవసరం.

'ప్రతిఛాయ'... ప్రేక్షకులు అందరికీ నచ్చే సినిమా కాదు. ఓటీటీలో అయినా సరే మొదటి నుంచి చివరి వరకు చూడాలంటే ఓపిక చాలా అవసరం. కేరళలో ఈ సినిమా థియేటర్లలో విడుదలైనప్పుడు గొప్ప స్పందన ఏమీ రాలేదు. ఓటీటీలోనూ వీక్షకులను ఆకట్టుకోవడం కష్టం. సారీ నివిన్ పౌలీ!

Also ReadPapam Prathap Movie Review - పాపం ప్రతాప్ రివ్యూ: థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులు చూసి పాపం అనుకోవాలా?... తిరువీర్ సినిమా ఎలా ఉందంటే?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Jagadhatri Serial Today May 13th: అవినాష్‌ను త్రిశూలంతో పొడిచి చంపేసిన జేడీ..కేదార్‌ సుధాకర్‌ కొడుకేనన్న సాక్ష్యాలు కాపాడిన జగధాత్రి
జగద్ధాత్రి సీరియల్: అవినాష్‌ను త్రిశూలంతో పొడిచి చంపేసిన జేడీ..కేదార్‌ సుధాకర్‌ కొడుకేనన్న సాక్ష్యాలు కాపాడిన జగధాత్రి
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today May 13th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కలలో కనిపించిన బిడ్డ ఎవరు? విహారికి ప్రమాదం పొంచి ఉందా! కడుపులో బిడ్డకా!
Thalapathy Vijay : సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్
సెకండ్ ప్లేస్‌లో దళపతి సీఎం విజయ్ - IMDb లిస్ట్‌లో టాప్ ఇండియన్ సెలబ్రిటీగా రికార్డ్
Karuppu Collections: సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana  Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్..  చోర్ అంటూ నినాదాలు|

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Bhageerath POCSO Case: బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
బండి భగీరథ్ పోక్సో కేసులో ఊహించని ట్విస్ట్! సంచలన ఆధారాలతో సిట్ ముందుకు వస్తా, అధికారులకు కేంద్రమంత్రి కుమారుడి లేఖ
Pawan Kalyan: పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం  టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం - పిఠాపురం టెన్త్ టాపర్లకు ఉచితంగా కార్పొరేట్ చదువులు!
Shamshabad Tahsildar ACB: డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
డబ్బులు బయటకు విసిరేశారు.. టాయిలెట్‌లో ఫైళ్లు దాచి పెట్టారు - ఏసీబీ దాడితో శంషాబాద్ తహసీల్దార్ కష్టాలు
Government Approved EV Chargers: దేశవ్యాప్తంగా 4,874 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు - కేంద్ర ప్రభుత్వం భారీ నిధుల విడుదల
ఎలక్ట్రిక్ వెహికల్స్‌ను ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం! భారీ నిధుల విడుదల!
Delhi High Court: వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
వివాహేతర బంధంలో నైతికత వేరు..నేరం వేరు - నిందితుడికి ఢిల్లీ హైకోర్టు బెయిల్
Best Alternative To Gold: బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
బంగారంపై పెట్టడం కంటే నెలకు ఐదు వేలు ఇలా పొదుపు చేస్తే కోటీశ్వరులు కావచ్చు! పూర్తి వివరాలు ఇవే!
Kalyana Lakshmi Scheme In AP Online Apply: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
Karuppu Collections: సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
సూర్య బాక్సాఫీస్ సత్తాకు అసలైన పరీక్ష... 'వీరభద్రుడు' అడ్వాన్స్ బుకింగ్స్ అంతేనా?
Embed widget