అన్వేషించండి

Parasakthi Review Telugu - పరాశక్తి రివ్యూ: జీ5 ఓటీటీలో శివకార్తికేయన్ సినిమా... తెలుగు ప్రేక్షకులకు ఈ తమిళ సినిమా నచ్చుతుందా?

OTT Review - Parasakthi Streaming On Zee5: శివకార్తికేయన్, శ్రీలీల జంటగా నటించిన తమిళ్ సినిమా 'పరాశక్తి'. జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

Sivakarthikeyan Parasakthi Review In Telugu: శివకార్తికేయన్ కథానాయకుడిగా సుధా కొంగర దర్శకత్వం వహించిన సినిమా 'పరాశక్తి'. సంక్రాంతికి తమిళంలో విడుదలైంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదల చేయాలనుకున్నా... చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు', ప్రభాస్ 'ది రాజా సాబ్', రవితేజ 'భర్త మహాశయులకు విజ్ఞప్తి', శర్వానంద్ 'నారి నారి నడుమ మురారి', నవీన్ పోలిశెట్టి 'అనగనగా ఒక రాజు' ఉండటం కుదరలేదు. తెలుగునాట థియేటర్లలో విడుదల చేయకుండా డైరెక్టుగా ఓటీటీలో విడుదల చేశారు. జీ5లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోందీ సినిమా. హిందీని అధికార భాష చేయాలనుకున్న నిర్ణయానికి దక్షిణాదిలో, మరీ ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఉద్యోగం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది?

కథ: జవహర్ లాల్ నెహ్రూ ప్రధానిగా ఉన్న రోజులు... రైల్వే ఉద్యోగ ప్రకటనను ప్రాంతీయ భాషా పత్రికల్లో ఇవ్వకుండా హిందీ ప్రతికల్లో ఇవ్వడంతో దక్షిణాదిలో అగహ్రావేశాలు వ్యక్తం అవుతాయి. చెల్లయన్ (శివకార్తికేయన్) నేతృత్వంలోని పురాణాపూర్ గ్యాంగ్ ఓ రైలుకు నిప్పు అంటించి తగలబెడుతుంది. కట్ చేస్తే... కొన్ని రోజులకు రైల్వే ఇంజన్‌లో బొగ్గు వేసే ఉద్యోగంలో చేరతాడు చెల్లయన్.

ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్న రోజులు... మళ్ళీ హిందీ వ్యతిరేక ఉద్యమం మొదలవుతుంది. కాలేజీలో చదువుతున్న చెల్లయన్ తమ్ముడు చిన్న దురై (అథర్వ మురళీ) ఉద్యమంలో చురుగ్గా ఉంటాడు. అది తెలిసి వద్దని అన్నయ్య మందలిస్తాడు.

మాతృభాష కోసం ఉద్యమం చేసిన చెల్లయన్... తమ్ముడిని ఎందుకు కట్టడి చేశాడు? అతని జీవితంలో విషాదం ఏమిటి? మళ్ళీ ఉద్యమంలోకి రావడానికి కారణం ఏమిటి? రత్నమాల (శ్రీ లీల)తో అతని ప్రేమ కథ ఏమిటి? ఉద్యమంలో ఆమె పాత్ర ఏమిటి? తీరు (రవి మోహన్)తో వైరం ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు సినిమా చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ: వాస్తవ ఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. హిందీని అధికార భాష చేయడం పట్ల ఉద్యమాలు జరిగాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వీరుల త్యాగాన్ని తక్కువ చేయలేం. అయితే... త్యాగవీరుల స్ఫూర్తిని తెరపై ఆవిష్కరించే క్రమంలో జరిగిన తప్పులను క్షమించలేం. తమిళనాడులో జరిగిన ఉద్యమాన్ని కథగా తీసుకున్నారు సుధా కొంగర. తెలుగు, కన్నడ, మలయాళ ప్రజలతో పాటు ఉత్తరాది నుంచి మద్దతు లభించినట్టు చూపించారు. ఉద్యమం మొదలైంది తమిళనాడులోనా? తెలుగులోనా? అనేది ఇక్కడ సమస్య కాదు. సినిమా చూసే ప్రేక్షకుల్లో ఆ ఉద్యమ కాంక్షను రగిలించేలా సన్నివేశాలు తీయకపోవడం సమస్య. 

'పరాశక్తి' సినిమాకు ప్రధాన సమస్య... హిందీని ఎందుకు వ్యతిరేకించారు? అనేది బలంగా చెప్పలేకపోవడం. కథ ప్రారంభించిన తీరు... ఉద్యమానికి పునాది... ప్రతి ఒక్కరిలో రిజిస్టర్ అయ్యేలా చెప్పలేదు. తమిళ నేటివిటీ తెరపై అడుగడుగునా కనిపిస్తుంది. దాంతో శివకార్తికేయన్ చేసే పోరాటం మనకు సంబంధం లేని అంశంగా ప్రేక్షకులకు కనిపిస్తుంది. అందువల్ల, ఏ దశలోనూ అసలు కథ కొంచెం కూడా ఆకట్టుకోదు. కొసరులా మధ్య మధ్యలో వచ్చే శివకార్తికేయన్ - శ్రీ లీల ప్రేమ సన్నివేశాలు బెటర్. 'గురు', 'ఆకాశమే నీ హద్దురా' సినిమాల్లో భావోద్వేగాలను బలంగా ఆవిష్కరించిన సుధా కొంగర... 'పరాశక్తి'కి వచ్చేసరికి ఆ మేజిక్ రిపీట్ చేయలేకపోయారు.

Also ReadWith Love Movie Review - 'విత్ లవ్' రివ్యూ: పెళ్లి చూపులు నుంచి మాజీ ప్రేమికుల దగ్గరకు... సౌందర్య రజనీకాంత్ నిర్మించిన సినిమా ఎలా ఉందంటే?

ఉద్యమ స్ఫూర్తిని తెరపైకి తీసుకు రావడంలో సుధా కొంగర తడబడ్డారు కానీ... ఆ కాలాన్ని తెరపై ఆవిష్కరించడంలో సినిమాటోగ్రాఫర్ రవి కె చంద్రన్, ప్రొడక్షన్ ఎంఆర్ కార్తీక్ రాజ్ కుమార్ మాత్రం సక్సెస్ అయ్యారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ కూడా బావుంది. టెక్నికల్ పరంగా సినిమా హై స్టాండర్డ్స్ మైంటైన్ చేసింది. నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయి. 

చెల్లయన్ పాత్రకు శివకార్తికేయన్ న్యాయం చేశారు. అయితే... 'పరాశక్తి'లో సర్‌ప్రైజ్ రవి మోహన్ విలనిజం. స్టైలిష్ విలనీ పాత్రలకు ఆయన సూటవుతారని చెప్పేలా ఉందీ సినిమా. శ్రీ లీల పాత్రకు ఎక్కువ స్కోప్ లేదు. కానీ, ఉన్నంతలో తన ప్రతిభ చూపించే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో నత్తితో ఎమోషనల్ సీన్ అద్భుతంగా చేశారు. హీరో తమ్ముడిగా అథర్వ మురళీ కనిపించారు. అతిథి పాత్రలో రానా దగ్గుబాటి తళుక్కున మెరిశారు. మలయాళం నుంచి బసిల్ జోసెఫ్, కన్నడ నుంచి ధనుంజయ కనిపించారు.

ఉద్యమ నేపథ్యంలో సినిమాలు ఉత్తేజం కలిగించాలి. కానీ, ప్రేక్షకులకు 'పరాశక్తి' నీరసం తెప్పిస్తుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా నటించిన సినిమా 'మదరాసి'. ఈ 'పరాశక్తి'కి ఆ టైటిల్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమాను ఓటీటీలో అయినా కష్టంగా చూడాలి.

Also ReadGovinda: దివాలా తీసిన గోవిందా... డబ్బుల కోసమే ప్రైవేట్ ఈవెంట్స్‌లో డాన్స్ చేస్తున్నారా? నోరు విప్పిన మేనేజర్

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Funky OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ 'ఫంకీ' - అఫీషియల్ డేట్ ఫిక్స్... స్ట్రీమింగ్ ఎన్ని భాషల్లో అంటే?
Allu Arjun : మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
మొన్న భార్యకు... ఇప్పుడు అమ్మకు - కాస్ట్‌లీ కారు గిఫ్ట్ ఇచ్చిన బన్నీ... ధర ఎంతో తెలుసా?
Dhurandhar 2 Collections : రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
రిలీజ్‌కు ముందే ధురంధర్ 2 రికార్డులు - అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Allu Cinemas Dolby Screen : ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
ఆసియాలోనే బిగ్గెస్ట్ డాల్బీ థియేటర్ అల్లు సినిమాస్ - స్పెషాలిటీస్ ఇవే... ప్రారంభం ఎప్పుడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Santosh Nagar Steel Bridge | హైదరాబాద్ లో వివాదాస్పద స్టీల్ బ్రిడ్జి వద్ద పనులు ఎందుకు నిలిచిపోయాయి?
Sanju Samson on Recent Performance | అదృష్టం తన జీవితంలోనూ ఉందన్న సంజూ శాంసన్ | ABP Desam
Fans worrying Ahmedabad Pitch | పీడకల మిగిల్చిన అహ్మదాబాద్ పిచ్ పైనే మళ్లీ ఫైనల్ | ABP Desam
Axar patel on Golden Catches vs Eng | T20 World cup 2026 లో జడ్డూ లేని లోటును తీరుస్తున్న అక్షర్ | ABP Desam
Abhishek Sharma Poor Form | T20 World Cup 2026 ఫైనల్లో అభిషేక్ ప్లేస్ పై డౌట్స్ | ABP Desam

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Velugumatla Issue:  వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
వెలుగుమట్ల బాధితుల కోసం రోడ్డెక్కిన కవిత పోరాటం - ఖమ్మంలో ఉద్రిక్తత
Nara Lokesh: మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
మంగళగిరిలో మరో ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి నారా లోకేష్, రూ.294.20 కోట్లతో పనులు
Budget Session 2026: ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
ఇరాన్ యుద్ధంపై రాజ్యసభలో జైశంకర్ కీలక ప్రకటన.. గల్ఫ్‌లో భారత పౌరుల భద్రతకు హామీ!
Telangana Voter List: తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR ! వారి ఓట్లు గల్లంతే
తెలంగాణలో 50 లక్షల ఓట్లు తొలగింపు..! ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో ఏప్రిల్‌లో ఈసీ SIR !
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
గూగుల్‌ నోట్ బుక్‌ ఎల్‌ఎమ్‌లో అద్భుతమైన ఫీచర‌-గంటల పని నిమిషాల్లోనే పూర్తి!
Pawan Kalyan CM:  ఏపీ రాజకీయాల్లో  ఢిల్లీ  మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
ఏపీ రాజకీయాల్లో ఢిల్లీ మలుపు - చంద్రబాబు వ్యూహం..లోకేష్ vs పవన్ రేస్?
Jana Nayagan : జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
జన నాయగన్‌కు మళ్లీ షాక్ - విజయ్ లాస్ట్ మూవీ రిలీజ్ అయ్యేది ఎప్పుడు?
Stock Market 9 March: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతలతో భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
భారత స్టాక్ మార్కెట్లో బ్లడ్ బాత్.. సెన్సెక్స్ 2400, నిఫ్టీ సైతం 650 పాయింట్లు పతనం
Embed widget