By: ABP Desam | Updated at : 05 Nov 2021 03:18 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మార్వెల్ ఎటర్నల్స్ సినిమా రివ్యూ
ఎటర్నల్స్
యాక్షన్, డ్రామా
దర్శకుడు: క్లోయే జావ్
Artist: గెమ్మా చాన్, రిచర్డ్ మాడెన్, కుమయిల్ నాన్‌జానీ, లియా మెక్‌హ్యూగ్, బ్రియాన్ టైరీ హెన్రీ, లారెన్ రిడ్‌లాఫ్, బ్యారీ కియోగన్, డాన్ లీ, సల్మా హయెక్, ఏంజెలీనా జోలీ
మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్‌లో(ఎంసీయూ) కొత్త సినిమా ఎటర్నల్స్ ఈ శుక్రవారం ప్రజల ముందుకు వచ్చింది. అవెంజర్స్ సినిమాలో అప్పటివరకు ఉన్న సూపర్ హీరోల్లో కొందరు చనిపోవడం, కొందరు రిటైర్ అవ్వడంతో కొత్త సూపర్ హీరోలను క్రియేట్ చేయడంపై మార్వెల్ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో వచ్చిన సినిమా కావడంతో దీనిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. మరి ఎటెర్నల్స్ గతంలో ఉన్న సూపర్ హీరోల స్థాయిలో మెప్పించారా?
కథ: ఏడు వేల సంవత్సరాల క్రితం డీవియంట్స్ అనే జీవుల నుంచి భూమిని కాపాడటానికి అరిషెమ్ ఆదేశాల మేరకు 10 మంది ఎటర్నల్స్ మన గ్రహానికి వస్తారు. వారే సెర్సి(గెమ్మా చాన్), ఇకారిస్(రిచర్డ్ మాడెన్), కింగో(కుమయిల్ నాన్‌జానీ), స్ప్రైట్(లియా మెక్‌హ్యూగ్), ఫాస్టోస్(బ్రియాన్ టైరీ హెన్రీ), మకారి(లారెన్ రిడ్‌లాఫ్), డ్రూయిగ్(బ్యారీ కియోగన్), గిల్‌గెమిష్(డాన్ లీ), అజాక్(సల్మా హయెక్), థెనా(ఏంజెలీనా జోలీ). డీవియంట్స్‌ను పూర్తిగా అంతం చేశాక వీరు విడిపోయి మనుషులతో కలిసి జీవిస్తూ ఉంటారు. సెర్సి.. డేన్ విట్‌మన్(కిట్ హారింగ్టన్) అనే మనిషిని ప్రేమిస్తూ ఉంటుంది. అయితే ఉన్నట్లుండి మళ్లీ డీవియంట్స్ తమ దాడులు మొదలు పెడతాయి. అసలు ఈ డీవియంట్స్‌ని ఎవరు పంపిస్తున్నారు? వీరు అవెంజర్స్‌తో కలిశారా? లాంటి విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ: సాధారణంగా ఎంసీయూ సినిమాలన్నీ ఒక సినిమాతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి. కానీ ఈ సినిమా కథ, పాత్రలు మాత్రం పూర్తిగా కొత్తగా ఉంటాయి. గత సినిమాలతో కనెక్షన్, కంటిన్యూషన్ చాలా తక్కువగా ఉంటాయి. అదే ఈ సినిమాకు ప్లస్, మైనస్ కూడా. ఎందుకంటే మార్వెల్ సినిమాలను విపరీతంగా ఇష్టపడేవారు కొనసాగింపు కథ, రిఫరెన్స్‌ల కోసం వస్తారు. వారికి ఎటర్నల్స్ కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. అలా కాని సాధారణ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాకు కనెక్ట్ అవుతారు. ఎందుకంటే ఈ సినిమా అర్థం కావాలంటే గత సినిమాలు చూడాల్సిన అవసరం ఉండదు కాబట్టి. యాక్షన్ లవర్స్ ఈ సినిమాను కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే యాక్షన్ సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించారు. కథ, కథనాల పరంగా చూసుకుంటే.. గత యాక్షన్ సినిమాల అంత రేసీగా కాకుండా కాస్త స్లోగా ఈ సినిమా ఉంటుంది.
గతేడాది నోమ్యాడ్ లాండ్ సినిమాతో ఉత్తమ దర్శకురాలిగా ఆస్కార్ అవార్డు అందుకున్న క్లోయే జావ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆవిడ తీసిన కొన్ని సన్నివేశాలు బాగానే ఉన్నప్పటికీ.. కొన్ని సన్నివేశాలు మాత్రం మరీ బోరింగ్‌గా ఉన్నాయి. అయితే యాక్షన్ సన్నివేశాలు మాత్రం అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ అయితే ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌కు తీసుకు వచ్చేస్తుంది. పోస్ట్ క్రెడిట్ సీన్లు(రోలింగ్ టైటిల్స్ తర్వాత వచ్చే సన్నివేశాలు) తర్వాత సినిమాలపై ఆసక్తిని పెంచుతాయి. ఇందులో మొదటిసారిగా గే సూపర్ హీరోను కూాడా పరిచయం చేశారు.
ఈ సినిమాలో భారతదేశానికి సంబంధించిన రిఫరెన్సులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎటర్నల్స్ బృందంలో ఒక జంట భారతీయ సంప్రదాయంలో పెళ్లి చేసుకుంటారు. ఒకరు బాలీవుడ్‌లో సూపర్ స్టార్ అయినట్లు చూపించడంతో మార్వెల్ ఇండియన్ మార్కెట్‌ను టార్గెట్ చేసుకుందని తెలుస్తోంది. త్వరలో భారతదేశానికి సంబంధించిన సూపర్ హీరో సినిమా తీసినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. అవెంజర్స్ సినిమాల్లో తప్ప మిగతా మార్వెల్ సూపర్ హీరోల సినిమాల్లో లేనంత స్టార్ కాస్టింగ్ ఇందులో ఉంది. ఇందులో ఉన్న 10 మంది పేరున్న నటీనటులే. వీరందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే స్టార్ కాస్ట్ ఎక్కువ కావడంతో వీరికి స్క్రీన్ టైం తక్కువ ఉంటుంది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ తర్వాత రిచర్డ్ మాడెన్, కిట్ హారింగ్టన్ కలిసి నటించిన సినిమా కావడంతో ఆ సిరీస్ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎంతో వెయిట్ చేశారు. రిచర్డ్ మాడెన్‌కు మంచి స్క్రీన్ టైం రోల్ లభించినా.. కిట్ హారింగ్టన్ పాత్ర మాత్రం పూర్తిగా నిరాశ పరుస్తుంది. అయితే పోస్ట్ క్రెడిట్ సీన్స్ ద్వారా తనకి తర్వాత సినిమాల్లో మంచి ప్రాముఖ్యత దొరుకుతుందని అర్థం చేసుకోవచ్చు.
ఓవరాల్‌గా చూసుకుంటే.. మార్వెల్ సినిమాలు ఎక్కువగా ఇష్టపడేవారిని ఈ సినిమా నిరాశ పరుస్తుంది. అంచనాలు లేకుండా చూస్తే మాత్రం పర్వాలేదనిపిస్తుంది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Calling Sahasra Review - కాలింగ్ సహస్ర రివ్యూ: కంఫర్ట్ జోన్ బయటకు 'సుడిగాలి' సుధీర్ - సినిమా ఎలా ఉందంటే?
Atharva Movie Review - అథర్వ సినిమా రివ్యూ: హీరోయిన్‌ను మర్డర్ చేసిందెవరు? క్లూస్ టీమ్‌లో హీరో ఏం చేశాడు?
Animal Movie Review - యానిమల్ రివ్యూ: ఇంటర్వెల్‌కే క్లైమాక్స్ 'హై' ఇచ్చిన రణబీర్, సందీప్ రెడ్డి వంగా - మరి, ఆ తర్వాత?
Animal Review - ‘యానిమల్’ ఆడియన్స్ రివ్యూ: ఓపెనింగ్ సీన్ నుంచి అటెన్షన్ షురూ - బ్లాక్ బస్టర్ టాక్
Dhootha Web Series Review - దూత రివ్యూ: అమెజాన్‌లో నాగ చైతన్య ఫస్ట్ వెబ్ సిరీస్ - బావుందా? బాలేదా?
TDP News: యువగళం ముగింపు సభ భారీగా ప్లాన్ - చంద్రబాబు, పవన్ హాజరు
First Time MLAs In Telangana: ఈ ఎమ్మెల్యేలు స్పెషల్ వేరే లెవల్- ఒకరిద్దరు కాదు ఏకంగా 50 మంది
Revanth Reddy Astrology 2023 : ఇదీ రేవంత్ రెడ్డి జాతకం - అందుకే అఖండ విజయం- రాజయోగం!
Syed Modi International 2023 badminton: టైటిల్ లేకుండానే ముగిసిన భారత్ పోరాటం , రన్నరప్ గా తనీష-అశ్విని జోడి
/body>