K Ramp Review Telugu - 'కే ర్యాంప్' రివ్యూ: కిరణ్ అబ్బవరం డబుల్ డోస్ కామెడీ... సినిమా హిట్టా? ఫట్టా?
K Ramp Movie Telugu Review: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'కే ర్యాంప్' ఈ రోజు థియేటర్లలో విడుదలైంది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన చిత్రమిది. రాజేష్ దండా నిర్మాత. సినిమా ఎలా ఉందంటే?
జైన్స్ నాని
కిరణ్ అబ్బవరం, యుక్తి తరేజా, సాయికుమార్, నరేష్ వీకే, 'వెన్నెల' కిశోర్ తదితరులు
Kiran Abbavaram and Yukti Thareja's K Ramp Review In Telugu: కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'కే ర్యాంప్'. గతేడాది దీపావళికి 'క'తో ఆయన విజయం అందుకున్నారు. ఈసారి 'కే ర్యాంప్'తో వచ్చారు. యుక్తి తరేజా కథానాయికగా... సాయి కుమార్, నరేష్ వీకే, 'వెన్నెల' కిశోర్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.
కథ (K Ramp Story): కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) రిచ్చెస్ట్ చిల్లర్ గయ్. తండ్రి (సాయి కుమార్) కాస్ట్లీ కారు కొని ఇచ్చినా బస్తీల్లో తిరుగుతాడు. మాస్ బార్లలో మందు తాగుతాడు. కేరళ పంపిస్తే సెట్ అవుతాడని పూజారి చెప్పడంలో డొనేషన్ ఇచ్చి మరీ అక్కడ కాలేజీలో చేర్పిస్తాడు.
కేరళ వెళ్లిన కుమార్... అక్కడ మెర్సీ జాయ్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత గానీ తెలియదు... ఆ అమ్మాయికి పీటీఎస్డీ (పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్) ఉందని! సింపుల్‌గా చెప్పాలంటే... ఎవరైనా ప్రామిస్ చేసి బ్రేక్ చేస్తే, సూసైడ్ అటెంప్ట్ చేస్తుంది. అటువంటి అమ్మాయితో కుమార్ ఎన్ని కష్టాలు పడ్డాడు? ఆమెను ఎలా మార్చాడు? అనేది సినిమా.
విశ్లేషణ (K Ramp Telugu Review): అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ 'కే ర్యాంప్'. అందులో మరో డౌట్ లేదు. అయితే ఇది కామెడీ కథ కాదు... దర్శకుడు జైన్స్ నాని చాలా సీరియస్ సబ్జెక్ట్ డిస్కస్ చేశారు. పీటీఎస్డీ నేపథ్యంలో సీన్స్ చూస్తే ఆయన క్లాస్ పీకలేదు. ఆ డిజార్డర్ చుట్టూ రాసిన ప్రతి సన్నివేశం నవ్విస్తుంది. కానీ ఆ పాయింట్ వరకు రావడానికి టైమ్ తీసుకున్నారు. అందుకని కమర్షియల్ వేలో కనిపిస్తుందీ సినిమా.
రిచ్చెస్ట్ చిల్లర్ గయ్... అంటూ హీరోని పరిచయం చేసిన దర్శకుడు జైన్స్ నాని తన రచన, దర్శకత్వంలో ఎటువంటి మొహమాటాలు పెట్టుకోలేదు. ఆ బోల్డ్ అప్రోచ్ 'బి సి' సెంటర్ ఆడియన్స్ వరకు మెప్పిస్తుంది. యూత్ వరకు ఓకే. కానీ, ఫ్యామిలీ ఆడియన్స్‌ను బోల్డ్ కామెడీ మెప్పించడం కష్టం. ఫస్టాఫ్ చివరి వరకు దర్శకుడు జైన్స్ నాని అసలు కథలోకి వెళ్ళలేదు. ఇంటర్వెల్ తర్వాత కథలోకి వెళ్లినా ఎక్కువ ఇంపార్టెన్స్ కామెడీకి ఇచ్చారు.
కాలేజీ నేపథ్యంలో హీరో హీరోయిన్లు పరిచయం కావడం, ప్రేమలో పడటం వరకు పరిమితం అయ్యారు. ఇంటర్వెల్ వరకు జరిగినది రెగ్యులర్ కథే అయినప్పటికీ... 'రిచ్చెస్ట్ చిల్లర్ గయ్'గా హీరో క్యారెక్టరైజేషన్ మాస్ జనాలను మెప్పించే విధంగా డిజైన్ చేయడంలో జైన్స్ నాని సక్సెస్ అయ్యారు. ఇంటర్వెల్ తర్వాత నరేష్ చేత చెప్పించిన డైలాగులు, ఆ సన్నివేశాలు ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మెచ్చే విధంగా మాత్రమే ఉన్నాయి. అందరూ అప్రిషియేట్ చేయడం చాలా కష్టం.
'కే ర్యాంప్'లో టెక్నికల్ అంశాలకు వస్తే... సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ తన వరకు 200% పర్సెంట్ న్యాయం చేశారు. మాస్ మూవీకి అవసరమైన ఎనర్జిటిక్ సాంగ్స్ ఇచ్చారు. నేపథ్య సంగీతంలోనూ హుషారు ఉండేలా చూసుకున్నారు. కానీ సీన్స్ ఆయనకు సహకరించలేదు. కెమెరా వర్క్ ఓకే. మాస్ మెచ్చే ఫైట్స్ డిజైన్ చేయడంలో యాక్షన్ కొరియోగ్రాఫర్లు సక్సెస్ అయ్యారు. ప్రొడక్షన్ వేల్యూస్ సోసోగా ఉన్నాయ్.
మాస్ జనాల్లోకి వెళ్లడమే టార్గెట్ పెట్టుకుని కిరణ్ అబ్బవరం ఈ సినిమా చేసినట్టు అర్థం అవుతోంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎనర్జీతో చేశారు. లుంగీ కట్టి డ్యాన్స్ చేయడం నుంచి ఫైట్స్ చేయడం, హీరోయిన్ యుక్తి తరేజాతో లిప్ లాక్స్ & సీన్స్ వరకు చాలా వరకు ఓపెన్ అయ్యారు. పీటీఎస్డీతో బాధపడే అమ్మాయిగా యుక్తి తరేజా పాత్రకు తగ్గట్టు నటించింది. అయితే నటన కంటే గ్లామర్ హైలైట్ అయ్యింది. సాయి కుమార్ హుందాగా కనిపించారు. నరేష్, వెన్నెల కిశోర్ కామెడీ అందరినీ మెప్పించడం కష్టం. మిగతా ఆర్టిస్టులు ఓకే. విమలా రామన్, కామ్నా జెఠ్మలానీ అతిథి పాత్రల్లో తళుక్కున మెరిశారు.
'కే ర్యాంప్' కామెడీ సినిమా. పక్కా కమర్షియల్ మూవీ. అయితే ఆ కామెడీ, కిరణ్ అబ్బవరం కమర్షియాలిటీ అందరినీ మెప్పించడం కష్టం. 'ఏ' రేటెడ్ కామెడీ ఎంజాయ్ చేసే ఆడియన్స్ కోసమే 'కే ర్యాంప్'. అసలు కథ కంటే కామెడీ మీద డిపెండ్ అయ్యి చేసిన చిత్రమిది.
Also Read: 'తెలుసు కదా' రివ్యూ: సిద్ధూ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విలన్ ఎవరు? సినిమా హిట్టా? ఫట్టా?





















