అన్వేషించండి

Kattalan Review - 'కాటాలన్' రివ్యూ: పుష్ప లాంటి కథ... ఏనుగు దంతాల స్మగ్లింగ్... మలయాళీ యాక్షన్ ఫిల్మ్ హిట్టా? ఫట్టా?

Kattalan Review Telugu: సునీల్ విలన్ రోల్ చేసిన మలయాళ సినిమా 'కాటాలన్'. ఆంటోనీ వర్గీస్ హీరో. 'మార్కో' ప్రొడ్యూసర్ షరీఫ్ ముహమ్మద్ నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Kattalan Review In Telugu: వెండితెరపై మలయాళ హీరో ఉన్ని ముకుందన్ బ్లడ్ బాత్ సృష్టించిన సినిమా 'మార్కో'. ఆ చిత్రానికి షరీఫ్ ముహమ్మద్ నిర్మాత. ఆయన నిర్మించిన తాజా సినిమా 'కాటాలన్'. ఆంటోనీ వర్గీస్ హీరో. సునీల్, కబీర్ దుహాన్ సింగ్ విలన్ రోల్స్ చేయడం... 'మార్కో' ప్రొడ్యూసర్ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. 'కేజీఎఫ్', 'సలార్', 'డ్రాగన్' ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందించారు. పాల్ జార్జ్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ (Kattalan Story Explained In Telugu): ఏనుగు దంతాల స్మగ్లింగ్ వ్యాపారి మారి (సునీల్). అతని కనుసన్నల్లో కార్టెల్ నడుచుకుంటుంది. అడవిలో ప్రజలు అతని పేరు చెబితే భయపడతారు. మారి కింద 30 ఏళ్లుగా బానిసలుగా బతుకుతున్నారు. కార్టెల్ మీద పట్టు కోసం ఎడ్డీ (కబీర్ దుహాన్ సింగ్) చేయని ప్రయత్నం లేదు. ఈ సారి మంత్రి అండ ఉండటంతో పోలీసులతో మారికి చెక్ పెడతాడు. మారి సరుకు దోచేస్తాడు. కొత్త సరుకు చెక్ పోస్టులు దాటకుండా పహారా పెట్టిస్తాడు. 

ఎడ్డీ నుంచి తన సరుకు రాబట్టుకోవడంతో పాటు... పోలీసులు, ప్రత్యర్థుల కళ్ళుగప్పి ఏనుగు దంతాలను ఎలాగైనా సరే చెక్ పోస్ట్ దాటించాలని ఆంటోనీ (ఆంటోనీ వర్గీస్)ను రంగంలోకి దించుతాడు మారి. ఆ తర్వాత ఏమైంది? ఆంటోనీ ఎవరు? మధ్యలో మారికి ఎందుకు ఎదురు తిరిగాడు? శ్రీలంక ఎందుకు వెళ్ళాడు? అతనికి లూసీ (దుషారా విజయన్) ఎటువంటి సాయం చేసింది? చివరకు ఏమైంది? అనేది సినిమా. 

విశ్లేషణ (Kattalan Review In Telugu): మలయాళంలో యాక్షన్ ఫిలిమ్స్ ఉన్నాయి. అయితే... 'మార్కో'తో బ్లడ్ బాత్ బాట పట్టించారు నిర్మాత షరీఫ్ ముహమ్మద్. ఆ రేంజ్ వయలెన్స్, రక్తపాతం అంతకు ముందు ఎప్పుడూ మలయాళ సినిమాల్లో కనిపించలేదు. సేమ్ బ్యానర్, సేమ్ జానర్ ఫిల్మ్ కావడంతో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేసింది 'కాటాలన్'. అయితే... ఇందులో 'మార్కో' రేంజ్ వయలెన్స్ లేదు. కానీ, యాక్షన్ సన్నివేశాలకు లోటు లేదు. సినిమాలో ఆ యాక్షన్ ఎలా ఉంది? అనేది చెప్పడానికి ముందు కథ గురించి చెప్పాలి.

'పుష్ప' చూసి తనను 'కాటాలన్'కు తీసుకున్నారని సునీల్ చెప్పారు. అల్లు అర్జున్ సినిమాలో నటుడిని మాత్రమే దర్శక నిర్మాతలు పాల్ జార్జ్, షరీఫ్ ముహమ్మద్ తీసుకోలేదు. కథను కూడా తీసుకున్నారని సినిమా చూశాక అనిపిస్తుంది. పాల్ జార్జ్ కథ, సినిమాపై 'పుష్ప'తో పాటు సూపర్ హిట్ తెలుగు సినిమాల ప్రభావం బలంగా ఉంది. 'పుష్ప'లో ఎర్ర చందనం, 'కాటాలన్'లో ఏనుగు దంతాలు... రెండిటిలో స్మగ్లింగ్ కామన్. 'పుష్ప'లో సాధారణ కూలీగా మొదలైన పుష్పరాజ్ ప్రయాణం... చివరకు కార్టెల్‌ను శాసించే స్థాయికి చేరుతుంది. 'కాటాలన్'లో ఏనుగు దంతాలు స్మగ్లింగ్ చేయడానికి ట్రాన్స్‌పోర్టర్‌గా వెళ్లిన ఆంటోనీ... చివరకు కార్టెల్‌ను తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. మారి బానిసలుగా బతికే ఊరి జనాలు, వాళ్ళ కోసం హీరో చేసే ఫైట్ చూస్తే ప్రభాస్ 'ఛత్రపతి' గుర్తుకు వస్తుంది. కథ పరంగా 'కాటాలన్'లో ఎగ్జైట్ చేసే ఎలిమెంట్ గానీ, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ లేదు. రెగ్యులర్ రొటీన్ కమర్షియల్ బిజినెస్ ఫార్ములా స్టోరీ... 'పుష్ప', 'కేజీఎఫ్' తరహాలో!

కథలో ఇన్‌స్పిరేషన్స్‌ ఉండటం తప్పు లేదు. కానీ, కథనం - సన్నివేశాలు ఎంగేజ్ చేయాలి. యాక్షన్ సీన్స్ సినిమాను ముందుకు తీసుకు వెళతాయని వదిలేశారు 'కాటలాన్' దర్శకుడు. ఆ యాక్షన్ సీన్స్ డిజైనింగ్ బావుంది. తెలుగు ప్రేక్షకులకు అవి కొత్త కాదు. అటువంటివి చేసేశారు. అందువల్ల, సినిమా పైకి కిందకు పడుతూ లేస్తూ వెళుతుంది. యాక్షన్‌ను ముందుకు డ్రైవ్ చేసే బలమైన ఎమోషనల్ హుక్ పాయింట్ సినిమాలో లేదు. 

Also Read: Blast Zone Review Telugu - 'బ్లాస్ట్ జోన్' రివ్యూ: యాక్షన్ కింగ్ అర్జున్ లేటెస్ట్ థ్రిల్లర్ - సినిమా ఎలా ఉందంటే?

దర్శక రచయితలు పాల్ జార్జ్, జోబీ వర్గీస్, జీరో జాకబ్ కథకు పెద్దగా కష్టపడలేదు. కానీ, యాక్షన్ సీన్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయ్యారు. కథ, కథనం కంటే క్యాస్ట్ ఎంపికలో తమ ట్యాలెంట్ చూపించారు. విలన్ బ్యాగ్రౌండ్ చెప్పాల్సిన అవసరం లేకుండా... ఎవరి మీద అయితే తాము రాసిన సీన్స్ వర్కవుట్ అవుతాయో? అటువంటి యాక్టర్లను తీసుకున్నారు. ఉదాహరణకు... సునీల్, కబీర్ దుహాన్ సింగ్. దర్శకుడు తీసుకున్న మరో తెలివైన నిర్ణయం... సంగీత దర్శకుడిగా రవి బస్రూర్ సెలక్షన్. యాక్షన్ సీన్స్‌కు ఆర్ఆర్ చేసే విషయంలో మరోసారి తన కమాండ్ చూపించారు రవి బస్రూర్. హీరోయిజం ఎలివేట్ చేయడంతో పాటు యాక్షన్ మూడ్ చేసేలా ఆయన నేపథ్య సంగీతం సాగింది. ప్రొడక్షన్ డిజైన్, కెమెరా వర్క్ బావున్నాయి. సినిమా జానర్‌కు తగ్గట్టు చేశారు. సినిమా నిర్మాణంలో షరీఫ్ ముహమ్మద్ రాజీ పడలేదు.

ప్లస్ పాయింట్స్:
యాక్షన్ సీన్స్
రవి బస్రూర్ ఆర్ఆర్ 

మైనస్ పాయింట్స్:
కథ, స్క్రీన్ ప్లే
దర్శకత్వం 

Also ReadDragon Glimpse Decoded - ఎన్టీఆర్ 'డ్రాగన్' గ్లింప్స్‌లో హిడెన్ డీటెయిల్స్... ప్రశాంత్ నీల్ సీక్రెట్ క్లూస్ గమనించారా?

తెలుగు ప్రేక్షకులకు 'కాటాలన్' హీరో ఆంటోనీ వర్గీస్ కొత్త. మలయాళంలో మంచి సినిమాలు చేశారు. విశ్వక్ సేన్ 'ఫలక్‌నుమా దాస్' ఒరిజినల్ - మలయాళ సినిమా 'అంగమలై డైరీస్'లో హీరో అతనే. 'జల్లికట్టు', 'ఆర్‌డిఎక్స్' చేశారు. యాక్షన్ హీరోకి కావాల్సిన కటౌట్, లుక్స్ అతనిలో ఉన్నాయి. ఆంటోనీగా చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. సునీల్ క్యారెక్టర్, ఆయన నటన 'పుష్ప'ను గుర్తు చేస్తాయి. మంగళం శీను పాత్రను మరోసారి గుర్తు చేశారు. ఐటమ్ సాంగ్‌లో ఆయన డ్యాన్స్ మాత్రం సూపర్. కబీర్ దుహాన్ సింగ్ స్టైలిష్‌గా కనిపించారు. మలయాళ నటుడు జగదీష్ కీలకమైన పాత్ర చేశారు. దుషారా విజయన్ స్క్రీన్ స్పేస్ తక్కువైనా... యాక్షన్ రోల్‌లో అదరగొట్టారు. యంగ్ మారి పాత్రలో తెలుగు నటుడు రాజ్ తిరందాసు కనిపించారు. 

'మార్కో'లో కథేమీ కనిపించదు. కానీ, బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ - బ్లడ్ బాత్ కాస్త ఎంగేజ్ చేశాయి. 'కాటాలన్'లో కథ ఉంది. కానీ, ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే & డైరెక్షన్ మిస్ అయ్యాయి. తెలుగు ప్రేక్షకులకు 'పుష్ప'ను గుర్తు చేసే కథ, కథనం ఉండటం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. కథ, హీరోతో సంబంధం లేకుండా యాక్షన్ సీన్స్ ఉంటే చాలు అని కోరుకునే ప్రేక్షకులు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా వెళ్ళడం మంచిది. లేదంటే రెండు గంటలు భరించక తప్పదు. 

Also ReadRanveer Singh vs Farhan Akhtar Don 3 Controversy Full Details: రణవీర్‌ సింగ్‌ వర్సెస్ ఫర్హాన్ అక్తర్... 'డాన్ 3' కాంట్రవర్సీ ఫుల్ డీటెయిల్స్

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 5th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కూతురి కోరికను విహారి తీర్చుతాడా! బామ్మకి హరికృష్ణ ఇచ్చిన హామీ ఏంటి?
Yash Alibaug Property: షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
షారుఖ్, విరాట్ కోహ్లీ సరసన యశ్... ఖరీదైన ఎస్టేట్ కొన్న Toxic సినిమా హీరో
Karthika Deepam 2 Serial Today June 5th: కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!
కార్తీకదీపం సీరియల్: దీపకి అసిస్టెంట్‌గా ఆఫీస్‌లో ఎంట్రీ ఇచ్చిన సూరజ్! ఇక జ్యోత్స్న వర్సెస్ సూరజ్ షురూ!
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gaddar Daughter On Pawan Kalyan: పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
పవన్ మాటలకు గద్దర్ కుటుంబం ఎందుకు నొచ్చుకుంది? వివాదంలో వాస్తవాలేంటి.? గద్దర్ కుమార్తెతో ప్రత్యేక ఇంటర్వూ
Latha Rajinikanth Makkal Madai: తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
తమిళనాడు రాజకీయాల్లో రజనీకాంత్ సంచలనం - ప్రజావేదిక ఏర్పాటు - సతీమణే కీలకం !
Kakinada Senior Assistant Shiva Kumar ACB Raids: కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
కలెక్టర్‌లో సీనియర్ అసిస్టెంట్ - అవినీతిలోనూ సీనియరే - ఆస్తులు లెక్కేయడం కష్టమే!
Karnataka Congress Crisis: డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
డీకే శివకుమార్‌కు షాక్ ఇస్తున్న మంత్రులు! కర్ణాటక కాంగ్రెస్‌లో కలకలం!
Revanth Reddy target GHMC :తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
తెలంగాణ కాంగ్రెస్ టార్గెట్ పవన్ కళ్యాణ్? రేవంత్ రాజకీయ వ్యూహం ఇదేనా?
Nandus World Scam: నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
నందనకు పదేళ్ళ జైలు శిక్ష తప్పదా? యూకే వీసా స్కామ్‌లో చట్టాలు ఏం చెబుతున్నాయ్?
K. Annamalai:
"అందుకే బీజేపీలో చేరా, ఏడాదిన్నర నుంచి విభేదాలు"అన్నామలై సంచలన వ్యాఖ్యలు! కొత్త రాజకీయ వేదిక ప్రకటన!
Breaking News: భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అరెస్టు
Embed widget