అన్వేషించండి

GaayaPadda Simham Review - 'గాయపడ్డ సింహం' రివ్యూ: ట్రంప్ మీద తరుణ్ యుద్ధం నవ్వించిందా? జేడీతో కామెడీ, సినిమా సంగతేంటి?

GaayaPadda Simham Review In Telugu: తరుణ్ భాస్కర్, జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో... శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించిన సినిమా 'గాయపడ్డ సింహం'. పవన్ సాధినేని సమర్పణలో తెరకెక్కిన సినిమా ఎలా ఉందంటే?

Tharun Bhascker's GaayaPadda Simham Movie Review In Telugu : తరుణ్ భాస్కర్ కథానాయకుడిగా నటించిన సినిమా 'గాయపడ్డ సింహం'. జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో, శ్రీవిష్ణు ప్రత్యేక పాత్రలో నటించారు. మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా హీరోయిన్లు. పవన్ సాదినేని సమర్పణలో కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ నిర్మించారు. కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. మే డే సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే?

కథ (GaayaPadda Simham Movie Story): సాయి గాయత్రి (మానసా చౌదరి)ని దరహాస్ (తరుణ్ భాస్కర్) ప్రేమిస్తాడు. కాబోయే అల్లుడు అమెరికాలో సెటిలై ఉండాలని అమ్మాయి తండ్రి చెప్పడంతో... కష్టపడి అమెరికా వెళతాడు దరహాస్. అయితే... ట్రంప్ తీసుకొచ్చిన రూల్స్ వల్ల అతణ్ణి వెనక్కి పంపిస్తారు. 

అమెరికా నుంచి తనను పంపించి వేయడానికి కారణం ట్రంప్ అని ఆయనపై దరహాస్ కోపం పెంచుకుంటాడు. అమెరికా అధ్యక్షుడిపై కోపంతో దరహాస్ ఏం చేశాడు? అతను చేసిన పని వల్ల బ్రూటల్ ధర్మ (జేడీ చక్రవర్తి) సిటీ వదిలి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? దరహాస్ ఫ్రెండ్ విశ్వాస్ (కశ్యప్ శ్రీనివాస్)కు ఒకప్పటి రూమ్మేట్, ఐఏఎస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న భైరవ దాస్ (శ్రీవిష్ణు) ఏం చేశాడు? దరహాస్ గురించి తెలిసీ తన కుమార్తె శాలిని (ఫరియా అబ్దుల్లా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఐజీ విజయకాంత్ (శుభలేఖ సుధాకర్) ఎందుకు ముందుకు వచ్చారు? ట్రంప్ మీద దరహాస్ ప్రతీకారం తీరిందా? లేదా? చివరకు ఏమైంది? అనేది సినిమా.

విశ్లేషణ (GaayaPadda Simham Review Telugu): స్పూఫ్ లేదా పేరడీ ప్రధాన ఉద్దేశం ప్రేక్షకులను నవ్వించడం. స్పూఫ్ సీన్ వచ్చినప్పుడు థియేటర్లలో విజిల్స్‌, క్లాప్స్, నవ్వులు వినిపించ లేదంటే రైటింగ్ పరంగా మేజిక్ మిస్ అయినట్టే. 'గాయపడ్డ సింహం' విషయంలో జరిగింది అదే. 'జల్సా' నుంచి మొదలు పెడితే... 'కేజీఎఫ్', 'అర్జున్ రెడ్డి', 'బొమ్మరిల్లు' వంటి పలు సినిమాలను స్పూఫ్ చేశాడు. ఒక్క స్పూఫ్ కూడా వర్కవుట్ అవ్వలేదు.

కథగా చూస్తే... 'గాయపడ్డ సింహం' పాయింట్‌లో మంచి పొటెన్షియల్ ఉంది. ట్రంప్ మీద రివేంజ్ తీర్చుకోవాలని అనుకోవడం, అదీ చేతబడి చేయాలని హీరో ట్రై చేయడంలో తెలియని అమాయకత్వం ఉంది. ఆ అమాయకత్వం నుంచి మంచి సిట్యువేషనల్ హ్యూమర్ జనరేట్ చేసే అవకాశం ఉంది. అందులో ఓ ఫ్రెష్‌నెస్ ఉంటుంది. అయితే కశ్యప్ శ్రీనివాస్ రచనలో ఫ్రెష్‌నెస్ మిస్ అయ్యింది. స్పూఫ్ మీద ఎక్కువ డిపెండ్ అయ్యారు. కానీ, వర్కవుట్ అవ్వలేదు.

Also Read : కర రివ్యూ: బ్యాంక్ రాబరీలో పోలీసులకు సవాల్ విసిరిన పల్లెటూరి దొంగ… ధనుష్ సినిమా ఎలా ఉందంటే?

శుభలేఖ సుధాకర్, హర్షవర్ధన్, జేడీ చక్రవర్తి, శ్రీ విష్ణు వంటి ట్యాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నారు. అందరూ టైమింగ్ ఉన్నోళ్ళే. ఒక్కరికీ సరైన డైలాగులు పడలేదు. కశ్యప్ శ్రీనివాస్ సిట్యువేషనల్ హ్యూమర్ మాత్రమే కాదు... పంచ్ డైలాగ్ కామెడీని కూడా మిస్ చేశారు. రైటింగ్ పరంగా ఫెయిల్ అయినా... స్టయిలిష్ ఫిల్మ్‌ మేకింగ్ కొంత బావుంది. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ కొంత మేరకు ఆకట్టుకున్నాయి. స్వీకార్ అగస్తి సంగీతంలో ఫ్రెష్‌నెస్ ఉంది. సినిమాలో సౌండింగ్ బావుంది.          

హైదరాబాదీ యువకుడిగా తరుణ్ భాస్కర్ కనిపించారు. ఆ పాత్రకు తగ్గట్టు నటించారు. పెర్ఫార్మన్స్ స్కోప్ ఉన్న రోల్ కాదు. పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే రోల్ కూడా కాదు. బయట ఎలా ఉంటారో సినిమాలోనూ అలాగే ఉన్నారు. తరుణ్ భాస్కర్ స్నేహితులుగా విష్ణు ఓయ్, కశ్యప్ శ్రీనివాస్ కనిపించారు. ఫ్రెండ్షిప్ బేస్డ్ సీన్స్ ఏవీ నవ్వించలేదు. హీరోయిన్లు మానసా చౌదరి, ఫరియా అబ్దుల్లా... కథలో ఇద్దరి పాత్రలు పరిమితమే. థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులకు వాళ్ళ పాత్రలు గుర్తు ఉండవు. హీరో హీరోయిన్ మధ్య సీన్స్ సైతం రిజిస్టర్ అయ్యేలా లేవు.

Also Read : రొమాంటిక్ డ్రామా 'ఏక్ దిన్' తెలుగు రివ్యూ - బాలీవుడ్‌లో సాయి పల్లవి హిట్ కొట్టారా?

బ్రూటల్ ధర్మగా జేడీ చక్రవర్తి పాత్రకు విపరీతమైన బిల్డప్ ఇచ్చారు. అయితే... ఓ ఈవెంట్‌లో ఆయన క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ చేశారు 'దిల్' రాజు. ఫస్టాఫ్‌లో డాన్ లాంటోడిని సెకండాఫ్‌లో కామెడీ చేశారని. డాన్‌లా కనిపించే సీన్లు బావున్నాయి. కానీ కామెడీ వర్కవుట్ కాలేదు. ఆయన్ను సరిగ్గా వాడుకోలేదు. 'సత్య' తమ్ముడని చెప్పారు. కానీ, అదేమంత కిక్ ఇవ్వలేదు. శ్రీ విష్ణు కనిపించే సన్నివేశాలు తక్కువ. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశారు. శ్రీవిష్ణు స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ కాస్త ఇంట్రెస్ట్ కలుగుతుంది.

కథగా చూస్తే 'గాయపడ్డ సింహం'లో పాయింట్ బావుంది. కానీ, ఎగ్జిక్యూషన్ ఫెయిల్ అయ్యింది. కామెడీ వర్కవుట్ కాలేదు. డ్రామా పండలేదు. రెండున్నర గంటలు సరదాగా నవ్వుకోవచ్చని వినోదం ఆశించి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకుల ఆశలకు గాయం చేస్తుందీ సినిమా.

Also Read : 'జెట్లీ' ట్విట్టర్ రివ్యూ: సత్య సినిమాకు మిక్స్డ్ టాక్... కామెడీ కిక్ ఇవ్వలేదా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today May 15th: నిండు మనసులు: ఇందిర అరెస్ట్! రెచ్చిపోయిన గణకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సిద్ధూ!
నిండు మనసులు: ఇందిర అరెస్ట్! రెచ్చిపోయిన గణకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన సిద్ధూ!
Bad Boy Karthik OTT : ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
ఓటీటీలోకి నాగశౌర్య డిజాస్టర్ మూవీ - సడన్‌గా స్ట్రీమింగ్
Peddi Events : దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్
దేశవ్యాప్తంగా పెద్ది మేనియా - చరణ్ విత్ బుచ్చిబాబు డ్రైవ్... ఈ నగరాల్లో ఈవెంట్స్
Brahmamudi Serial Today May 15th: ‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు షాక్‌ ఇచ్చిన లాయరు – నిజం తెలుసుకున్న లక్కీ
‘బ్రహ్మముడి’ సీరియల్: రేఖకు షాక్‌ ఇచ్చిన లాయరు – నిజం తెలుసుకున్న లక్కీ
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

“నా లవర్ మెసేజ్‌లు చదివారు”.. యానాంలో యువకుడి హైడ్రామా!
Sachin Amuzed: కర్రల కారును చూసి సచిన్ ఫిదా.. రోడ్డు పక్కన పిల్లాడిని పలకరించిన క్రికెట్ లెజెండ్
Krunal Pandya Injury: గాయపడినా.. RCBని గెలిపించేవరకూ పోరాటం ఆపని కృణాల్ పాండ్యా
Telangana  Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్..  చోర్ అంటూ నినాదాలు|

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Petrol Diesel Price Hike: పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. భారత్‌లో చమురు సెగ మొదలైందా?
BRS Internal Crisis: కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న  దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
కేటీఆర్‌, హరీష్ రావుకు మధ్య పెరుగుతున్న దూరం - బీఆర్ఎస్‌లో ఏం జరుగుతోంది?
Agri Gold Victims:  అగ్రిగోల్డ్ బాధితులకు  గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్ న్యూస్ - ఆరు నెలల్లో ఖాతాల్లోకి నగదు.. క్లియరెన్స్‌కు హై లెవల్ కమిటీ!
AP University Posts: ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
ఏపీ యూనివ‌ర్సిటీల్లో 1523 పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌.. ముఖ్యమైన తేదీలు, వర్సిటీల వారీగా ఖాళీల వివరాలు
Prateek Yadav Last Rites:  అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
అల్లుడికి అంత్యక్రియలు నిర్వహించే హక్కు మామకు ఉంటుందా? గరుడ పురాణం ఏం చెబుతోంది!
Formula E Race Case:  కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న   హాజరు కావాలని ఆదేశం!
కేటీఆర్‌కు షాక్ - ఫార్ములా-ఈ కేసులో ఏసీబీ కోర్టు సమన్లు - జూలై 31న హాజరు కావాలని ఆదేశం!
IPL 2026 MI VS PBKS Result Update: పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
పంజాబ్‌ను దెబ్బ తీసిన MI, అర్షదీప్‌ వల్గర్ కామెంట్స్‌కు బ్యాట్‌తో తిల‌క్ ఆన్సర్, పీబీకేఎస్‌కు వ‌రుస‌గా ఐదో ఓట‌మి
Arshdeep Singh Racist Comment on Tilak Varma: ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
ఓయ్‌ బ్లాకీ, సన్‌స్క్రీన్ రాసుకున్నావా? తిలక్‌ వర్మపై అర్ష్‌దీప్ సింగ్ బలుపు కామెంట్స్ వైరల్! 
Embed widget