అన్వేషించండి

Toxic Movie Review - 'టాక్సిక్' రివ్యూ: రెండు క్యారెక్టర్లు, మూడు లుక్కులు... యష్ ఎలా చేశాడు? సినిమా హిట్టా? ఫట్టా?

Toxic Review In Telugu: యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన యాక్షన్ థ్రిల్లర్ 'టాక్సిక్'. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు విడుదలైంది. సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Yash Toxic Movie Review Telugu: రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించిన సినిమా 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్'. 'కేజీఎఫ్ 2' విడుదలైన నాలుగేళ్ళు దాటింది. ఆ తర్వాత యష్ నుంచి వస్తున్న చిత్రమిది. ఈ సినిమాలో కియారా అడ్వాణీ, రుక్మిణీ వసంత్, తారా సుతారియా, హ్యూమా ఖురేషి హీరోయిన్లు. యష్ సిస్టర్‌గా నయనతార నటించారు. టీజర్, ట్రైలర్, పాటలతో సంచలనం సృష్టించిందీ సినిమా. మరి సినిమా ఎలా ఉంది? రివ్యూలో తెలుసుకోండి.

కథ (Toxic Movie Story Telugu): ఇండియాకు ఇండిపెండెన్స్ వచ్చింది. కానీ, గోవాకు రాలేదు. అది పోర్చుగీస్ అధీనంలో ఉంది. అయితే... రాజ్యం మాత్రం సాల్వదార్ చేతిలో ఉంది. అతడికి కుడి భుజం లాంటోడు రాయా (యష్). అక్క గంగ (నయనతార) సలహాలు, సూచనలతో గోవాను తన చెప్పు చేతల్లో ఉంచుకుంటాడు. రాయ ధీరత్వం చూసి తన కుమార్తె రెబక్కా (తార సుతారియా)ను ఇచ్చి పెళ్లి చేయడానికి సాల్వదార్ సిద్ధమవుతాడు. అయితే సర్కస్ ఆర్టిస్ట్ నాడియా (కియారా అడ్వాణీ)తో ప్రేమలో పడతాడు రాయా.

నాడియాతో రాయా ప్రేమ వ్యవహారం సాల్వదార్, రెబక్కాలకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? తమ్ముడి ప్రేమ గురించి తెలిశాక గంగ ఏం చేసింది? రెబక్కా, నాడియా తర్వాత రాయా జీవితంలోకి వచ్చిన మెలిశా (రుక్మిణీ వసంత్) ఎవరు? రాయాకు కన్న కొడుకు టికెట్ (యష్) ఎందుకు ఎదురు తిరిగాడు? తండ్రి కొడుకుల యుద్ధం చివరకు ఏ తీరానికి చేరింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి.

Also Read: Ravi Teja Irumudi Review In Telugu - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?

విశ్లేషణ (Toxic Review Telugu): టాక్సిక్ టీజర్ చూశాక ఇదొక యాక్షన్ ఫిల్మ్ అనిపించింది. అయితే బోల్డ్ సీన్స్ ఉంటాయని అర్థమైంది. ట్రైలర్ వచ్చాక రొమాంటిక్ యాక్షన్ ఫిల్మ్ అనిపించింది. క్లైమాక్స్ చూశాక ఇదొక సైకలాజికల్ సబ్జెక్ట్ అని అర్థం అవుతుంది. చివరి అరగంట సైకాలజీ కథకు రెండున్నర గంటల పాటు రొమాన్స్, యాక్షన్ దట్టించి తీసిన మసాలా సినిమా టాక్సిక్.

రిలేషన్షిప్స్ గురించి చెప్పేటప్పుడు టాక్సిక్ అనే పదం ఎక్కువ వినబడుతుంది. ఈ సినిమాలోనూ టాక్సిక్ రిలేషన్షిప్ ఉంది. అయితే అది హీరో హీరోయిన్స్ మధ్య కాదు. సినిమా అంతా చూశాక... రాయాతో రాయా రిలేషన్షిప్ టాక్సిక్ అనిపిస్తుంది. తల్లి కోరిక, ఆశపడినట్టు రాజులా జీవించడం కోసం అడ్డొచ్చిన వాళ్ళను తెగ నరుకుతాడు రాకీ భాయ్... అది కేజీఎఫ్. ఈ సిటీని నువ్వు ఎలాలని నా కోరిక - అని అక్క కోరడంతో రాజులా ఎదిగిన మనిషి రాయా... ఇది టాక్సిక్ కథ. క్లైమాక్స్ ముందు వరకు రెండు కథల మధ్య కొంత సారూప్యత కనపడుతుంది. అయితే టాక్సిక్ క్లైమాక్స్ ఈ సినిమాను కేజీఎఫ్ నుంచి వేరు చేసింది. మహేష్ బాబు వన్ నేనొక్కడినే సినిమాను గుర్తు చేస్తుంది.

కేజీఎఫ్ 2 తర్వాత యష్ చేసిన సినిమా కావడంతో టాక్సిక్ మీద ముందు నుంచి అంచనాలు ఉన్నాయి. టీజర్, ట్రైలర్లలో రొమాంటిక్ సీన్స్ సినిమాకు కావాల్సిన బజ్ క్రియేట్ చేసింది. కేజీఎఫ్ విజయానికి కారణం అందులో యాక్షన్ సీన్స్ కాదు... యాక్షన్ ఉన్నా మదర్ సెంటిమెంట్, ఆ ఎమోషన్ ప్రారంభం నుంచి చివరి వరకు కంటిన్యూ అవుతుంది, టాక్సిక్ ప్రారంభం నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు ఒక్కటంటే ఒక్క సన్నివేశంలో కూడా ఎమోషన్ వర్కవుట్ కాలేదు. అయితే యాక్షన్ లేదంటే రొమాన్స్... బ్యాక్ టు బ్యాక్ రెండిటిలో ఏదో ఒకటి తెరపై వస్తున్నా కొంచెం కూడా ఇంపాక్ట్ ఉండదు.

దర్శకురాలు గీతూ మోహన్ దాస్, హీరో యష్ కలిసి రాసిన కథ, క్యారెక్టరైజేషన్లలో లాజిక్ లేదు. క్లుప్తంగా చెప్పాలంటే... కళ్ళ ముందు తండ్రిని కోల్పోయిన ఓ అమ్మాయి, తమ్ముడిని రాజుగా చూడాలని కలలు కంటుంది. అక్క కోసం తమ్ముడు అడ్డొచ్చిన వాళ్ళను చంపి ఎదగడం కమర్షియల్ ఫార్ములా. ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ ఆప్స్ అని చెప్పినా... వేశ్య గృహానికి అక్కని అమ్మేసిందని తల్లిని చంపినోడు, తన ఆకలి తీర్చడానికి వేశ్య వృత్తిలోకి అక్క వెళ్లడం చూడలేనోడు... దగ్గరకు వచ్చిన అమ్మాయిలతో కామ వాంఛలు తీర్చుకోవడం ఏమిటో?? అక్కడే సినిమాలో ఎమోషన్ బోల్తా కొట్టింది. రొమాన్స్, యాక్షన్ ఉంటే ఆడియన్స్ సినిమా చూస్తారని అనుకోవడం పొరపాటు. ఆ రెండిటినీ కలిపే థ్రెడ్, కోర్ ఎమోషన్ కూడా కరెక్టుగా ఉండాలి కదా! ఈ సినిమాలో అది మిస్ అయ్యింది. దానికి తోడు లెంగ్త్ ఎక్కువైంది. వెరసి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వక ముందు నుంచి బోర్ కొడుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక పరిస్థితి మారుతుందని అనుకుంటే అదీ లేదు. చివరకు వన్ నేనొక్కడినే గుర్తు చేసి మరింత కంగాళీ చేశారు. జోకర్ ఛాయలు సైతం గుర్తుకు వచ్చాయి. 

టెక్నికల్ పరంగా చూస్తే... టాక్సిక్ నిర్మాత వెంకట్ కే నారాయణ ఖర్చుకు అసలు వెనుకాడలేదు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఫ్రేమ్ రిచ్ గా ఉంది. ఈ కథ అంతా 1947 నుంచి 1967 వరకు, అదీ గోవా నేపథ్యంలో కావడంతో ప్రతి సన్నివేశంలో ప్రొడక్షన్ వర్క్ అవసరం అయ్యింది. కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకు వెళ్ళడం కోసం ప్రొడక్షన్ డిజైన్ టీమ్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి చాలా కష్టపడ్డారు. తమ 100 పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారు. విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగున్నాయి, అయితే... తెలుగులో డైలాగ్స్ రాసిన రాధాకృష్ణ బత్తర్ మనం ఈ కాలం తెలుగు సినిమా చూస్తున్నామా? లేదంటే ఇండిపెండెన్స్ రోజులకు వెళ్లామా? అనే సందేహాన్ని కలిగించారు. ప్రామాణికం, క్రౌర్యం, అపరాధం వంటి పదాలు విని షాక్ అవ్వాల్సిన పరిస్థితి. కథ 1947 లో జరిగితే అప్పటి పదాలు రాయాలని లేదు కదా! టూ మచ్ రైటింగ్!

రాయా పాత్రలో యష్ నటన ఓకే. కేజీఎఫ్ ఇమేజ్ కంటిన్యూ చేశారు. ఆయన స్టైలింగ్ చాలా బాగుంది. అయితే టికెట్ పాత్రలో యష్ నటన మాత్రం తెలుగు ప్రేక్షకులకు నచ్చడం కష్టం. ఆయన రెండు క్యారెక్టర్లు చేశారు. మూడు లుక్కుల్లో కనిపించారు.

హీరోయిన్లుగా కియారా అడ్వాణీ, తారా సుతారియా రొమాంటిక్ సీన్స్ చేయడానికి ఏమాత్రం వెనుకాడలేదు. అయితే ఇద్దరి కియార కొంచెం ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటనతో మెప్పించచారు. రుక్మిణీ వసంత్ మాత్రం రొమాంటిక్ సీన్లకి దూరంగా ఉన్నారు. కానీ ఆమె హెయిర్ స్టైలింగ్ బాలేదు. అక్కగా నయనతార నటన ఓకే. సుదేవ్ నాయర్ సహా మిగతా నటీనటుల పేర్లు, వాళ్ల నటన గుర్తు ఉండటం కష్టం. 

Also ReadVishwanath And Sons Review - విశ్వనాథ్ అండ్ సన్స్ రివ్యూ: సూర్య సినిమా హిట్టా? ఫట్టా? వెంకీ అట్లూరి ఎలా తీశారంటే?

Toxic Verdict: టాక్సిక్... యష్ స్క్రీన్ ప్రజెన్స్, ఆయన స్టైలింగ్ బావున్నాయి. ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ సూపర్బ్. అయితే... కథ మనల్ని మెప్పించేలా ఉండాలి కదా! సినిమాలో రొమాన్స్ ఉంది. యాక్షన్ ఉంది. స్టార్ కాస్ట్ ఉంది. కానీ... ఎంగేజ్ చేసే స్క్రీన్ ప్లే గానీ, ఆకట్టుకునే సన్నివేశాలు గానీ లేవు. సాగదీశారు సార్... మూడు గంటలు పాటు ఆ వయలెన్స్ భరించడం, థియేటర్లలో చివరి వరకు ఆడియన్స్ ఉండటం కష్టమే. టెక్నికల్ అవుట్ పుట్ కోసం లేదంటే యష్ కోసం అయితే వెళ్ళండి.

Also ReadDC Movie Review - డీసీ రివ్యూ: హీరోగా లోకేష్ కనగరాజ్ డెబ్యూలో ఏముంది? అనిరుధ్ మ్యూజిక్‌తో చేసిన మేజిక్ సినిమా రాతను ఎలా మార్చింది?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pithapuram Lo Release Date: పిఠాపురంలో ఏం జరిగింది? సెప్టెంబర్ 18న తెలుసుకోండి!
పిఠాపురంలో ఏం జరిగింది? సెప్టెంబర్ 18న తెలుసుకోండి!
Nuvvu leka Neanu Lenu Serial Today September 8th:నువ్వులేక నేను లేను సీరియల్: పూర్తిగా మారిపోయిన రామచంద్ర! రాధని లవ్ చేస్తున్న విక్రమ్!
నువ్వులేక నేను లేను సీరియల్: పూర్తిగా మారిపోయిన రామచంద్ర! రాధని లవ్ చేస్తున్న విక్రమ్!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today September 8th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కేక్‌లో విషం కలిపిన సుభాష్! చివరి నిమిషంలో కనిపెట్టిన లక్ష్మీ.. పాపని కాపాడుతుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: కేక్‌లో విషం కలిపిన సుభాష్! చివరి నిమిషంలో కనిపెట్టిన లక్ష్మీ.. పాపని కాపాడుతుందా!
Why Rajesh Sharma Hospitalised: ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఏం కాలేదు... క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ యాక్టర్
ప్రభాస్ ‘ఫౌజీ’ సెట్స్‌లో ఏం కాలేదు... క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ యాక్టర్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Fatima Sana Women's Asia Cup 2026 | పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు ఐసీసీ షాక్
Telangana Politics | BRS MLC Arrest | తెల్లవారుజామున BRS ఎమ్మెల్సీల అరెస్ట్.. తాతా మధు, నవీన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
KTR challenges Congress | ఎమ్మెల్సీల అరెస్ట్‌పై కేటీఆర్ ఫైర్.. “మేమంతా అరెస్ట్‌కు సిద్ధం.. మీరు సిద్ధమా?”
Mohsin Naqvi Women's Asia Cup 2026 | టీమిండియా గెలిస్తే ట్రోఫీ ఇస్తారా? నఖ్వీ రాకతో మళ్లీ వివాదం

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu: డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
డేటా సెంటర్లకు నీళ్లు అసలు సమస్యే కాదు, లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది: చంద్రబాబు
Historic IND VS JPN Clash: వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
వ‌ర‌ల్డ్ ఛాంపియన్ ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్  సిద్ధం.. జ‌ట్టును ప్ర‌క‌టించిన ఆ దేశ క్రికెట్ బోర్డు
Telangana Assembly Sessions: నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
నీ తల్లిని కాదు నా తల్లిని అవమానించారు.. దీనికేం చెబుతావు? హరీష్ రావుపై స్పీకర్ మండిపాటు
KTR Challenge: 420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
420 హామీలు నెరవేర్చుతామంటే మేమే అరెస్ట్ అవుతాం! అందుకు సిద్ధమా? కేటీఆర్ ఛాలెంజ్
Anaswara Rajan: కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
కాకా కూతురు అమ్ములు పాప... చిరంజీవి సినిమాలో అనస్వర రాజన్ ఫస్ట్ లుక్ రిలీజ్... బర్త్‌డే స్పెషల్
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ vs పాత మోడల్‌.. మైలేజ్, పవర్‌లో వచ్చిన మార్పులేంటి?
2026 మారుతి బలెనో ఫేస్‌లిఫ్ట్‌ ఎంత మైలేజ్ ఇస్తుంది? కంపెనీ లెక్కలు చూస్తే షాకే!
Dates Benefits : ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తింటే కలిగే ప్రయోజనాలు ఇవే.. రోజుకు ఎన్ని తింటే మంచిది
KL Rahul Future Clarity: ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
ట్రేడింగ్ రూమర్లకు చెక్ పెట్టిన రాహుల్..తన ట్వీట్ తో క్లారిటీ , ఇక హార్దిక్ పాండ్యా ఇష్యూలో మ‌రో ట్విస్ట్
Embed widget