Ramba Oorvasi Menaka Movie Review - 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ: 'అల్లరి' నరేష్ సినిమా హిట్టా? ఫట్టా? ఫాంటసీ కామెడీ ఎలా ఉందంటే?
Ramba Oorvasi Menaka Review In Telugu: 'అల్లరి' నరేష్ హీరోగా నటించిన ఫాంటసీ కామెడీ ఫిల్మ్ 'రంభ ఊర్వశి మేనక'. అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలు తెరకెక్కించిన ఈ సినిమా ఎలా ఉందంటే?
చంద్ర మోహన్ చింతాడ
అల్లరి నరేష్, వెన్నెల కిషోర్, నరేష్ వీకే, శ్రీనివాస్ రెడ్డి, సురభి, రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియా తదితరులు
Allari Naresh's Ramba Oorvasi Menaka Movie Review In Telugu: అల్లరి నరేష్ సరైన విజయం అందుకుని చాలా రోజులైంది. 'నాంది' తర్వాత ఆయన ఖాతాలో మంచి సినిమా పడలేదు. లాస్ట్ మూడు సినిమాలు 'ఆ ఒక్కటి అడక్కు', 'బచ్చలమల్లి', '12ఏ రైల్వే కాలనీ' సినిమాలకు దారుణమైన రిజల్ట్ వచ్చింది. ఈ తరుణంలో తనకు గతంలో విజయాలు అందించిన కామెడీని నమ్ముకున్నారు 'అల్లరి' నరేష్. ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్ 'రంభ ఊర్వశి మేనక' చేశారు. చంద్ర మోహన్ చింతాడ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ సంస్థలపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ నిర్మించారు. ఈ సినిమా ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకోండి.
కథ (Ramba Oorvasi Menaka Story): సూరి ('అల్లరి' నరేష్) కుటుంబం దగ్గర తరతరాలుగా ఓ పుస్తకం ఉంటుంది. దానిపై ఓ చక్రం ఉంటుంది. సరైన ప్యాటర్న్ గీస్తే 'రంభ ఊర్వశి మేనక' భూమి మీదకు వస్తారని చెబుతారు. ఇంద్రలోకం నుంచి ఆ ముగ్గురూ వస్తారని పుస్తకం చేతపట్టుకుని సమయాన్ని వృథా చేసినోళ్ళు ఎక్కువ. 'అల్లరి' నరేష్ కూడా అంతే. అయితే... అనుకోకుండా ఒక రోజు రంభ ఊర్వశి మేనక భూమి మీదకు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది? అనేది సినిమా.
సూరితో చిన్ని (సురభి) ప్రేమ కథ ఏమిటి? సూరిని ఎస్సై అప్పల నాయుడు (తారక్ పొన్నప్ప) ఎందుకు టార్గెట్ చేశాడు? సూరి తల్లి ఆస్పత్రిలో ఎందుకు చేరింది? రంభ ఊర్వశి మేనక భూమి మీదకు రావడం వల్ల సూరిలో ఎటువంటి మార్పు వచ్చింది? ఇంద్రుడు (వెన్నెల కిశోర్), సూరి బాబాయ్ రమణ (సీనియర్ నరేష్) పాత్రలు ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమాలో చూడాలి.
విశ్లేషణ (Ramba Oorvasi Menaka Review Telugu): 'అల్లరి' నరేష్ సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే పేరుండేది ఒకప్పుడు. తెరపై ఆయన కనిపిస్తే చాలు... ఆడియన్స్ కూడా నవ్వేవారు. అయితే... క్రమక్రమంగా ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వచ్చింది. 'జబర్దస్త్' వంటి కామెడీ షోలు వచ్చాక ఒకప్పటి అల్లరి నరేష్ సినిమాల్లో జోకులకు జనాలు నవ్వడం మానేశారు. ఇటువంటి తరుణంలో 'రంభ ఊర్వశి మేనక' అంటూ వచ్చారు.
'రంభ ఊర్వశి మేనక'లో కథ విషయానికి వస్తే... దర్శకుడు తాను రాసుకున్న కథ కొత్తది అని భావించి ఉండొచ్చు. అయితే... 'యమలీల' ఛాయలు కనిపించాయి. ఆ సినిమాలో హీరో చేతిలో పుస్తకం ఉన్నట్టు... ఇక్కడ కూడా ఓ పుస్తకం ఉంటుంది. ఆ బుక్ ద్వారా 'రంభ ఊర్వశి మేనక' భూమి మీదకు వస్తారు. రెండింటిలోనూ తల్లి ప్రాణం కీలకమైన అంశం. అయితే... 'యమలీల'లో ఉన్న సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ 'రంభ ఊర్వశి మేనక'లో మిస్ అయ్యింది. ఒక్కటంటే ఒక్క జోక్ కూడా సరిగా ల్యాండ్ కాలేదు. నవ్వించలేదు. సీనియర్ నరేష్ కాస్త నవ్వించడానికి ట్రై చేశారు గానీ వర్కవుట్ అవ్వలేదు. శ్రీనివాస రెడ్డి జోక్స్ అసలు పేలలేదు. పవన్ కళ్యాణ్ ఓజీ జపనీస్ డైలాగ్ స్పూఫ్ చేయడంతో పాటు రాజమౌళి నుంచి అనిల్ రావిపూడి వరకు దర్శకులు అందరిపై పంచ్ డైలాగ్స్ వేశారు. కానీ వర్కవుట్ కాలేదు. ఫన్ జనరేటర్ అవ్వలేదు. టెక్నికల్ పరంగా కూడా పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. చైతన్ భరద్వాజ్ పాటల్లో గుర్తుండే ట్యూన్ ఒక్కటీ లేదు. కెమెరా వర్క్, ఎడిటింగ్, ప్రొడక్షన్ డిజైన్ వంటివి కూడా సోసోగా ఉన్నాయి.
Also Read: Sahaa Movie Review - సహ రివ్యూ: హీరోయిన్ అమీర్‌పేట్‌లో గుండు గీసుకోవాలా? లేదంటే సినిమా బావుందా?
'అల్లరి' నరేష్ కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 'రంభం ఊర్వశి మేనక'లో ఆ టైమింగ్ కనిపించలేదు. ఆయనతో కామెడీ చేయించుకునే దర్శకుడు కూడా ఉండాలని ఈ సినిమా చూశాక అర్థం అవుతుంది. సురభి పాత్ర పరిధి పరిమితమే. ఉన్నంతలో తన పాత్రకు న్యాయం చేశారు. రంభ ఊర్వశి మేనక పాత్రల్లో రాశి సింగ్, ప్రిషా సింగ్, విష్ణుప్రియ అందంగా కనిపించారు. ఆ ముగ్గురికీ పెద్దగా నటించాల్సిన అవసరం లేదు. ఓ పాటలో హీరోతో కలిసి స్టెప్పులు వేశారు. సన్నివేశాలకు అనుగుణంగా సీనియర్ నరేష్ కొన్ని గెటప్పులు వేశారు. కానీ, ఆయనకు రాసిన సన్నివేశాలు - డైలాగులు బాలేదు. ఇంద్రుడిగా 'వెన్నెల' కిషోర్, హరితేజ, శ్రీనివాస రెడ్డి, అజయ్, తారక్ పొన్నప్ప తదితరులు కీలక పాత్రలు పోషించారు.
కష్టపడకుండా ఏదీ రాదని, యువత కలలు కంటే సరిపోదని, కలలను సాకారం చేసుకోవడానికి కష్టపడాలని సందేశంతో తెరకెక్కిన సినిమా 'రంభ ఊర్వశి మేనక'. చివరిలో మదర్ సెంటిమెంట్ ఉంది. ఆ రెండూ మంచి పాయింట్స్. అంతకు మించి సినిమాలో ఏమీ లేదు. అసలు నవ్వించలేదు. అల్లరి నరేష్ మరోసారి డిజప్పాయింట్ చేశారు. కొన్ని నవ్వులు మాత్రమే ఉన్నాయి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















