అన్వేషించండి

Sigma Review - సిగ్మా రివ్యూ: సీఎం కొడుకు డైరెక్ట్ చేసిన సినిమా... సందీప్ కిషన్‌కు హిట్ వచ్చిందా?

Sigma Review In Telugu: సందీప్ కిషన్ హీరోగా తమిళనాడు సీఎం విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకత్వం వహించిన సినిమా 'సిగ్మా'. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందంటే?

Sundeep Kishan And Jason Sanjay Movie Sigma Review In Telugu: సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సిగ్మా'. ప్రస్తుత తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో సినిమా విడుదలైంది. ఫరియా అబ్దుల్లా కథానాయికగా, సంపత్ రాజ్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది? జేసన్ సంజయ్ దర్శకత్వం ఎలా ఉంది? అంటే...

కథ (Sigma Movie Story): విశాఖలో సొంత ఇంటిలో గురు (సందీప్ కిషన్) లైబ్రరీ రన్ చేస్తుంటాడు. ఆ ఇంటిలో అమ్మను చూసుకుంటాడు. అయితే, ఆ ఇంటిపై కోటి రూపాయల అప్పు ఉంది. అది తీర్చమని ఒత్తిడి వస్తుంది. పరిస్థితి పీకల మీదకు రావడంతో పాత థియేటర్‌లో విన్సెంట్ (శివ్ పండిట్) రన్ చేసే క్యాసినోకి వెళతాడు గురు. తనతో పాటు తన ఆడియో లైబ్రరీ పార్టనర్ ఆర్జే సామ్ (ఫరియా అబ్దుల్లా) డబ్బులు పోగొట్టి వస్తాడు. గొడవ అవుతుంది.

విన్సెంట్ చీకటి దందా (డ్రగ్స్, గ్యాంబ్లింగ్)కు సంబంధించిన వీడియో గురుకు దొరుకుతుంది. దాన్ని అడ్డం పెట్టుకుని అప్పు తీర్చడానికి సరిపడా డబ్బులు వసూలు చేయాలని గురు ప్లాన్ చేస్తాడు. కానీ, ఫెయిల్ అవుతాడు. గురు దగ్గరున్న వీడియో కోసం విన్సెంట్, ఓ తాళం చెవి కోసం కోట్లపాడి వెంకట రెడ్డి (సంపత్ రాజ్) ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఆ తాళం చెవిలో ఏముంది? వాళ్ళ నుంచి గురు ఎలా బయట పడ్డాడు? తనకు ఎదురైన ఆపదలను ఎలా తప్పించుకున్నాడు? అనేది సినిమా.

విశ్లేషణ (Sigma Review In Telugu): లోకేష్ కనగరాజ్, నెల్సన్ దిలీప్ కుమార్, కార్తీక్ సుబ్బరాజ్ వంటి తమిళ దర్శకులు యాక్షన్ ఫిలిమ్స్ తీయడంలో కొత్త ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు. స్క్రీన్ ప్లే, హీరోయిజం, సబ్జెక్టుల ఎంపికలో అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేస్తున్నారు. దాంతో ప్రస్తుత ముఖ్యమంత్రి, సీఎం అయ్యే ముందు వరకు తమిళ చిత్రసీమలో స్టార్ హీరోగా కోట్లాది మంది అభిమానం సొంతం చేసుకున్న విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా కాకుండా దర్శకుడిగా సినిమా చేయడంతో ఎటువంటి సినిమా చేశారోనని అందరిలో ఆసక్తి నెలకొంది.

'సిగ్మా' మొదలైన పది పదిహేను నిమిషాలకు ప్రేక్షకులలో ఆసక్తి సన్నగిల్లుతుంది. కొత్త కథతో కాకుండా అవుట్ డేటెడ్ కమర్షియల్ స్టైల్‌లో జేసన్ సంజయ్ సినిమా తీశారని అర్థం అవుతోంది. హీరో ఇంట్రడక్షన్ నుంచి ఆ తర్వాత వచ్చే కామెడీ సీన్ వరకు ఏదీ ఆకట్టుకునేలా లేదు. లైబ్రరీ ఓల్డ్ అంటే, ఆడియో లైబ్రరీ అంటూ ఈ జనరేషన్ కథలను ఆడియో రూపంలో వింటున్న తీరును కూడా చూపించారు. కానీ ఎక్కడా కనెక్టివిటీ ఉండదు. సినిమా మొదలైన గంట వరకు హీరో సమస్యలను మాత్రమే చూపించారు. ఆ తర్వాత విలన్ పాత్రను పూర్తిగా పరిచయం చేశారు. అప్పుడైనా కథలో వేగం పెరుగుతుందని ఆశిస్తే అదీ జరగలేదు. హీరో అండ్ విలన్ మధ్య ఫైట్ అయితే క్యాట్ అండ్ మౌస్ గేమ్ (పిల్లి ఎలుక మధ్య ఆట)ను తలపించింది. చివరకు క్లైమాక్స్ ఎప్పుడు వస్తుంది? అని ఎదురు చూసేలా చేశారు. కథ, కథనాల్లో హాలీవుడ్ సినిమాల ప్రభావం కనిపించింది. కానీ, ఆ స్థాయిలో చేయలేదు.

Also Read: Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

కథకుడిగా, దర్శకుడిగా జేసన్ సంజయ్ కొంచెం కూడా కొత్తదనం చూపించలేదు. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫార్మట్‌లో పది పదిహేనేళ్ల క్రితం తీయాల్సిన కథతో సినిమా చేశారు. తమన్ సైతం ఆ స్థాయిలో ఆర్ఆర్ ఇచ్చారు. పాటల్లో ఒక్కటి కూడా గుర్తు పెట్టుకునేలా లేదు. నేపథ్య సంగీతంలో కొన్ని చోట్ల 'అతడు' బీజీఎమ్, మరికొన్ని చోట్ల హాలీవుడ్ స్టైల్ ఆర్ఆర్ వినిపించింది. కెమెరా వర్క్ నుంచి మిగతా టెక్నికల్ టీమ్ పనితీరులో ప్రశంసించేవి ఏవీ లేవు. పాపం... లైకా ప్రొడక్షన్స్ - బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు అందుకుంటోంది.

హీరోగా సందీప్ కిషన్ నటనలో కొత్తదనం లేదు. ఆయన ఎప్పటిలా నటించారు. ఆ పాత్రకు తగ్గట్టు చేశారంతే. ఇటువంటి విలన్ రోల్స్ సంపత్ రాజ్ చాలా చేశారు. ఫరియా అబ్దుల్లా పాత్రకు కథలో కాస్త ప్రాముఖ్యత ఉంది. నటిగా ఆ పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. రాజు సుందరంతో కాస్త కామెడీ చేయించాలని చూశారు. కానీ కుదరలేదు. శివ్ పండిట్ సహా మిగతా ఆర్టిస్టుల్లో తెలుగు ప్రేక్షకులకు తెలిసిన ముఖాలు తక్కువ.

Also Read: Nani The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

విజయ్ తనయుడు జేసన్ సంజయ్, సందీప్ కిషన్ కలిసి కొత్త తరహా సినిమా తీసి ఉంటారని ఆశిస్తే... బాగా డిజప్పాయింట్ చేశారు. ఇంతకు ముందు సందీప్ కిషన్ పరిచయం చేసిన దర్శకులు తమ మార్క్ చూపించారు. కానీ జేసన్ సంజయ్ ఓల్డ్ స్టైల్ సినిమా చేశారు. 'సిగ్మా' టైటిల్ జస్టిఫికేషన్ అన్నట్టు సినిమా చివరిలో ఓ మాట చెప్పారు ఫరియా అబ్దుల్లా. ఆ డైలాగ్ ఎందుకు రాయించారో అర్థం కాదు. అప్పటి వరకు చూసిన సినిమా కూడా అర్థం కాదు. కమర్షియల్ ఫార్మాట్‌లో తీసిన అవుట్ డేటెడ్ సినిమా 'సిగ్మా'.

Also Read: Karthi Sardar 2 Review In Telugu - సర్దార్ 2 రివ్యూ: కార్తీ కెరీర్‌లో భారతీయుడు 2 అవుతుందా? పీఎస్ మిత్రన్ సినిమా హిట్టా? ఫట్టా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Niti Taylor: నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
నాతో పడుకుంటే ఛాన్స్ ఇస్తా... త్రినాథరావు నక్కిన మీద హీరోయిన్ క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు?
SS Rajamouli: వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
వారణాసి పనులకు బ్రేక్... అమెరికా వెళ్లిన రాజమౌళి - ఎందుకంటే?
Nindu Manasulu Serial Today October 13th: నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
నిండు మనసులు: జడ్జి ముందు సిద్ధూ, ప్రేరణల విడాకుల టాపిక్! 2 రోజుల్లో తుది నిర్ణయం!
Nani - Rukmini Vasanth: తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
తమిళ దర్శకుడితో నాని సినిమా... హీరోయిన్‌గా రుక్మిణి వసంత్?
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Singareni Bonus: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ .. ఒక్కొక్కరికి రూ.1. 51 లక్షల దసరా బోనస్: భట్టి విక్రమార్క
Vijayasai Reddy: దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
దసరా పండుగకు పార్టీ జెండా, ఎజెండా సిద్ధం.. విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
Viral News: స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
స్వీట్ బాక్స్ అడిగితే ఇల్లు ఖాళీ చేసే వరకు వదల్లేదు.. ఇన్‌ఫ్లుయెన్సర్‌కు చేదు అనుభవం!
RoKo World Cup Roadmap:  రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
రోహిత్, కోహ్లీ .. వ‌న్డే ప్రపంచకప్ ఎంట్రీపై బీసీసీఐ ప్రెసిడెంట్ గ్రీన్ సిగ్నల్, వారి ఆట‌కు వ‌య‌సు అడ్డంకి కాద‌ట
Papikondalu Tour: పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
పాపికొండలు అందాలు చూసే వేళాయె.. నేటి నుంచి బోట్ల విహారయాత్ర తిరిగి ప్రారంభం
Babies Cry After Feeds : పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
పిల్లలు పాలు తాగిన వెంటనే ఏడుస్తున్నారా? అది కడుపునొప్పి? లేక మరేదైనా సమస్యనా?
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
శ్రీశైలంలో శరన్నవరాత్రి 2026 Day 5: స్కందమాతగా భ్రమరాంబిక!
EV Tyres: ఎలక్ట్రిక్‌ కార్లకు సాధారణ కారు టైర్లు వాడుతున్నారా? ఈ తప్పులతో రేంజ్‌ తగ్గడమే కాదు.. ప్రమాదం కూడా!
సాధారణ కారు టైర్లు vs ఎలక్ట్రిక్‌ కార్‌ టైర్లు... రెండూ ఒకటి కాదా? తేడా ఏంటి?
Embed widget