అన్వేషించండి

Don't Trouble The Trouble Review - 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' రివ్యూ: నిర్మాతగా రాజమౌళి తనయుడు తీసిన సినిమా - హిట్టా? ఫట్టా?

Don't Trouble The Trouble Review In Telugu: ఫహాద్ ఫాజిల్ హీరోగా రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన సినిమా 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'. ఈ ఫాంటసీ ఫిల్మ్ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

Fahadh Faasil's Don't Trouble The Trouble Movie Review In Telugu: మలయాళ కథానాయకుడు ఫహాద్ ఫాజిల్‌కు తెలుగులోనూ అభిమానులు ఉన్నారు. ఆయన మలయాళ సినిమాలు చూసిన తెలుగు ప్రేక్షకులు ఉన్నారు. 'పుష్ప'లో యాంటీ హీరోగా భన్వర్ సింగ్ షెకావత్ పాత్రలో మెప్పించారు. ఇప్పుడు 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్'తో తెలుగు చిత్రసీమకు హీరోగా పరిచయం అయ్యారు. 'బాహుబలి'తో పాటు పలు సినిమాలు నిర్మించిన ఆర్కా మీడియా వర్క్స్ అధినేతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనితో కలిసి రాజమౌళి తనయుడు ఎస్ఎస్ కార్తికేయ నిర్మించిన చిత్రమిది. శశాంక్ యేలేటి దర్శకుడు. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకోండి.

కథ (Don't Trouble The Trouble Story): సూరి (ఫహాద్ ఫాజిల్) అంబులెన్స్ డ్రైవర్. అతనో అనాథ. డబ్బు సంపాదన తప్ప మరొక ధ్యాస, ఆశ ఉండదు. లోకల్ డాన్ అస్లాం భాయ్ (మహేష్ మంజ్రేకర్)ను బోల్తా కొట్టిస్తాడు. దాంతో సూరికి రెండు రోజుల్లో పాతిక లక్షలు కట్టకపోతే చంపేస్తానని అల్టిమేటమ్ జారీ చేస్తాడు అస్లాం భాయ్.

డబ్బుల కోసం శ్రీమంతుల పిల్లల్ని కిడ్నాప్ చేయాలని సూరి ప్లాన్ చేస్తాడు. దివ్య (సారా పాలేకర్)తో పాటు ఆమె వెంట తిరిగే కుక్కను కూడా తనతో పాటు ఇంటికి తీసుకు వస్తాడు. దివ్య మావయ్య (సౌరభ్ సచ్‌దేవ్)కు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది? పోలీసుల ఎంట్రీతో సూరికి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సూరికి తప్ప ఇతరులకు దివ్య ఎందుకు కనిపించలేదు? దివ్య తల్లిదండ్రులు ఏమయ్యారు? చివరకు ఏమైంది? అనేది సినిమా.

Also Read: Anumana Pakshi Review - 'అనుమాన పక్షి' రివ్యూ: ప్రతిదీ అనుమానించే కుర్రాడు... DJ Tillu దర్శకుడి కొత్త సినిమా ఎలా ఉందంటే?

విశ్లేషణ (Don't Trouble The Trouble Review Telugu): 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' అంటూ బాలకృష్ణ వైరల్ డైలాగును టైటిల్‌గా అనౌన్స్ చేయడంతో సినిమాపై క్రేజ్ నెలకొంది. ప్రచార చిత్రాల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ రావడం, ఆ తర్వాత ఆయనతో పాటు మహేష్ బాబు ట్వీట్లు చేయడం ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్స్. ఓపెనింగ్స్ రావడంలో హెల్ప్ చేశాయి. మరి సినిమా ఎలా ఉంది? అనేది చూస్తే...

'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ట్రైలర్ చూసి థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు 'వావ్' ఫ్యాక్టర్, 'సర్‌ప్రైజింగ్' మూమెంట్ రావడం కోసం రెండు గంటలు వెయిట్ చేయాలి. అప్పటి వరకు సినిమాలో చూపించే సన్నివేశాలు ఏవీ అంతగా ఆకట్టుకోవు. దానికి ప్రధాన కారణం... ట్రైలర్ కట్. సినిమాలో 'హై' పాయింట్స్ కొన్నిటిని తీసుకొచ్చి ట్రైలర్‌లో చూపించారు. వాటిని పక్కన పెట్టినా... డబ్బు కోసం సూరి చేసే పనులు గానీ, పాప ఎంట్రీ నుంచి ప్రీ క్లైమాక్స్ వరకు సీన్స్ గానీ ఎంగేజ్ చేయలేదు. అలాగే ఎంటర్‌టైన్ కూడా చేయలేదు. ముఖ్యంగా ఆ సన్నివేశాలు చూస్తుంటే... రామ్, తమన్నా జంటగా నటించిన 'ఎందుకంటే ప్రేమంట' గుర్తుకు వస్తుంది. కాస్త రోల్ చేంజెస్ చేశారంతే. అక్కడ హీరోయిన్ కనిపిస్తే, ఇక్కడ చిన్నారి కనిపిస్తుంది. ఆ మార్పు తప్పిస్తే మిగతా సన్నివేశాల్లో చాలా సిమిలారిటీస్ కనిపిస్తాయి. అటు సూరి, ఇటు దివ్య... రెండు క్యారెక్టర్లతో ట్రావెల్ చేసేలా సన్నివేశాలు లేవు.

చివరి అర గంటలో శశాంక్ యేలేటి ప్రతిభ కనిపిస్తుంది. వికారాబాద్ సీన్స్ అన్నీ బాగా డీల్ చేశారు. చివరిలో ఓ కౌగిలింత అయితే కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ఆ సన్నివేశాల్లో కాలభైరవ నేపథ్య సంగీతం అద్భుతంగా ఉంది. 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' ప్రారంభం నుంచి కాలభైరవ పాటలు, నేపథ్య సంగీతం బావున్నాయి. అలాగే, కెమెరా వర్క్ కూడా! హైదరాబాద్ రోడ్స్, లొకేషన్లను బాగా క్యాప్చర్ చేశారు. చిత్ర నిర్మాతలు ఎస్ఎస్ కార్తికేయ, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఖర్చుకు వెనుకాడలేదు.

హీరోగా ఫహాద్ ఫాజిల్ తొలి తెలుగు చిత్రమిది. సూరి పాత్రకు ఆయన న్యాయం చేశారు. అయితే తెలుగు డబ్బింగ్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. బేబీ సారా పాలేకర్ నటన సినిమాకు ప్లస్ అయ్యింది. ఆమె కొత్తదనం తీసుకొచ్చింది. సౌరభ్ సచ్‌దేవ్, మహేష్ మంజ్రేకర్ తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. పోలీస్ అధికారిగా సుబ్బరాజ్ పాత్ర పరిమితమే. ఉన్నంతలో ఆయన బాగా చేశారు. హీరో స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను కాస్త నవ్వించారు. కొన్ని చోట్ల ఎమోషనల్ సీన్స్ కూడా బాగా చేశారు. వెంకటేష్ కాకుమాను తల్లిగా సురభి ప్రభావతి కనిపించారు.

Also Read: Nani The Paradise Review - 'ది ప్యారడైజ్' రివ్యూ: నాని మాస్ మసాలా బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? సినిమా హిట్టా? ఫట్టా?

Don't Trouble The Trouble Verdict: ఫాంటసీ కామెడీ సినిమాగా తెరకెక్కిన 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' స్టార్టింగ్ టు ఎండింగ్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తూ ఎంటర్‌టైన్ చేయడంలో ఫెయిలైంది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ మాత్రం బావుంది. ప్రేక్షకులు చూపు తిప్పుకోవ్వని విధంగా చేశారు. కాలభైరవ సంగీతం బావుంది. అందువల్ల... అంచనాలు పెట్టుకోకుండా థియేటర్లకు వెళ్ళడం మంచిది. ఫహాద్ ఫాజిల్ కొంత వరకు ఎంటర్‌టైన్ చేస్తారు. చివరిలో కాస్త కంటతడి పెట్టిస్తారు.

Also Read: Karthi Sardar 2 Review In Telugu - సర్దార్ 2 రివ్యూ: కార్తీ కెరీర్‌లో భారతీయుడు 2 అవుతుందా? పీఎస్ మిత్రన్ సినిమా హిట్టా? ఫట్టా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
Vijay Deverakonda : నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
నా మూవీస్‌కు టికెట్ రేట్స్ పెరగవు - సత్యసాయి బయోపిక్‌ చేయాలనుకున్నా... విజయ్ దేవరకొండ రియాక్షన్
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 10th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: మహా నువ్వే కనకం అని నాకు తెలుసు.. మహాకి షాక్ ఇచ్చిన విహారి! క్రిష్‌ కోసం మళ్లీ గొడవ!
Sunday OTT Movies : ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
ఆదివారం ఓటీటీల్లో సినిమాల సందడి - వీకెండ్ టాప్ 10 ట్రెండింగ్ మూవీస్... 150 కోట్ల మూవీ డోంట్ మిస్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ -  ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ  ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Dasara Special Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. అక్టోబర్ 25 వరకు దసరా స్పెషల్‌ రైళ్లు
Talliki Vandanam Phase 2: తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
తల్లికి వందనం రెండో విడత లబ్ధిదారులు ఖరారు.. నిధుల విడుదలకు ఉత్తర్వులు జారీ
Srikakulam Crime News: హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
హిమశ్రీతో ఉన్న ఆ యువకుడు ఎవరు? రైలు నుంచి దూకేసిందా? చంపేశారా? అన్ని కోణాల్లో దర్యాప్తు
Bloody Romeo: బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
బ్లడీ రోమియో కోసం క్లాసీ లుక్‌లోకి నాని... స్టైలిష్‌గా సుజీత్ సినిమా
CM Chandrababu: స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
స్థానిక సంస్థల ఎన్నికలకు రెడీ, ఈ 14, 15 తేదీల్లో నోటిఫికేషన్.. నవంబర్ 30 లోపు ప్రక్రియ పూర్తి
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
11-10-2026 ఆదివారం నవరాత్రుల మొదటి రోజు మకర, కుంభ, మీన రాశుల భవిష్యత్తు ఎలా ఉందంటే!
YS Sharmila: మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
మోదీ ప్లాన్ ప్రకారం పేదలు, దళితులు, ముస్లిం, క్రిస్టియన్ల ఓట్లు తొలగిస్తున్నారు: వైఎస్ షర్మిల
Abhijit Dipke Grandmother Passes Away: అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం.. పోలీసుల అదుపులో ఉండగానే నానమ్మ కన్నుమూత
Embed widget