అన్వేషించండి

Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

Balan The Boy Review Telugu: 'మంజుమ్మేల్ బాయ్స్'తో దర్శకుడు చిదంబరం ఎస్ పోదువల్ పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆయన తెరకెక్కించిన తాజా సినిమా 'బాలన్: ది బాయ్'. ఎలా ఉందంటే?

Chidambaram S Poduval New Movie Balan The Boy Review In Telugu: మలయాళ చిత్రసీమలో 200 కోట్లు కలెక్ట్ చేసిన మొదటి సినిమాగా 'మంజుమ్మేల్ బాయ్స్' రికార్డు క్రియేట్ చేసింది. మలయాళంతో పాటు ఇతర భాషల ప్రేక్షకులను సైతం ఆకట్టుకుంది. 'మంజుమ్మేల్ బాయ్స్' తర్వాత దర్శకుడు చిదంబరం ఎస్ పోదువల్ తెరకెక్కించిన సినిమా 'బాలన్ ది బాయ్'. మలయాళంతో పాటు ఇతర భాషల్లోనూ జూన్ 19న విడుదల చేశారు. ఈ సినిమా ఎలా ఉంది? ఇందులో ఏం చూపించారు? అనేది రివ్యూలో తెలుసుకోండి.

కథ (Balan The Boy Story Explained In Telugu): హత్య కేసులో ఓ మహిళ (ఫర్జానా పాలతింగళ్) జైలుకు వెళ్ళుతుంది. అక్కడ ఆమెకు ఓ అబ్బాయి జన్మిస్తాడు. శిక్ష పూర్తైన తర్వాత కేరళలోని కన్నూర్ జైలు నుంచి బాబు (అధిశీషన్ కేఆర్)తో కలిసి బయటకు వస్తుంది. ఎటువంటి బంధాలు వద్దనుకుంటుంది ఆ తల్లి. మారు పేర్లతో వివిధ ప్రాంతాల్లో పనులు చేయడం ప్రారంభిస్తుంది. ఎవరైనా ఏమైనా చేస్తారని సందేహం వస్తే మకాం మారుస్తుంది. ఓ 70 ఏళ్ళ ముసలావిడ దగ్గర కేర్ టేకర్ ఉద్యోగానికి చేరుతుంది. కొడుకును స్కూల్‌లో చేర్పిస్తుంది. ఇక నుంచి అంతా మంచే జరుగుతుందనుకున్న తరుణంలో జీవితం తల్లకిందులు అవుతుంది. 

ఇద్దర్ని హత్య చేసిన నేరంపై తల్లిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లాడు తల్లి కోసం ఎటువంటి అన్వేషణ సాగించాడు? అబ్బాస్ (టోవినో థామస్) ఎవరు? పిల్లాడిపై పోలీస్ అధికారి పవిత్రన్ (జీన్ పాల్ లాల్) ఎందుకు కక్ష కట్టాడు? నిజంగా బాలుడి తల్లి హత్యలు చేసిందా? చివరకు తల్లీ కొడుకులు ఎలా ఒక్కటి అయ్యారు? అనేది సినిమా.

విశ్లేషణ (Balan The Boy Review In Telugu): 'మంజుమ్మేల్ బాయ్స్' పాన్ ఇండియా హిట్. భాషలకు అతీతంగా ప్రేక్షకులు సినిమాకు కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం... లోయ అడుగున ప్రాణం కోసం అడుగడుగునా 'బాయ్స్' చేసే పోరాటమే. కథలోని క్యారెక్టర్లు, సన్నివేశాల్లో అయితే థ్రిల్ లేదంటే ఇన్‌స్టంట్ ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటుంది. సర్వైవల్ థ్రిల్లర్ కావడంతో 'వాట్ నెక్స్ట్?', 'తర్వాత ఏమవుతుంది? అనే ఓ ఉత్కంఠతో చూశారంతా. 'బాలన్ ది బాయ్' విషయానికి వస్తే... ఇదీ జీవితం కోసం ప్రతి అడుగులో ఓ మహిళ చేసే పోరాటమే. అయితే... ఇందులో ఉన్నది సైకలాజికల్ సర్వైవల్ డ్రామా.

'బాలన్ ది బాయ్' ప్రారంభంలోనే తల్లీ కొడుకుల తాలూకా మనస్తత్వాలను దర్శక రచయితలు చిదంబరం, జితూ మాధవన్ చక్కగా ఆవిష్కరించారు. జైలు నుంచి బయలుదేరేటప్పుడు, జైలులో పని చేసినందుకు కొన్ని డబ్బులతో పాటు ఓ స్వచ్ఛంద సంస్థ కార్డు ఇస్తుంది జైలర్. బయటకు రాగానే కార్డును చెత్త బుట్టలో పడేస్తారు తల్లీ కొడుకులు. అప్పటి వరకు తెలిసిన మనుషులకు దూరంగా ఉండాలన్న ఆలోచన ఆ సన్నివేశంలో కనబడుతుంది. అక్కడ నుంచి బస్ ఎక్కి మరో ఊరు వెళతారు. ముసలాయన నడిపే హోటల్‌లో తింటారు. డబ్బులు లేవని పని ఇవ్వమని అడుగుతారు. తల్లీ కొడుకుల ప్రవర్తన నచ్చి కూతురు, మనవడిలా చూసుకుంటానని చెబితే... అక్కడ నుంచి మరో చోటుకు మకాం మారుస్తారు. ఏ బంధాలూ వద్దనుకున్న తల్లి మనస్తత్వం మరోసారి కనబడుతుంది.

ఓ ఊరి నుంచి మరో ఊరికి... మారిన ప్రతిసారీ కొత్త పేరు, కొత్త ఐడెంటిటీతో తల్లీ కొడుకులు తిరుగుతారు. కొడుక్కి ఏ రేంజ్‌లో తల్లి శిక్షణ ఇచ్చిందనేది చెప్పడానికి మధ్యలో కొన్ని సన్నివేశాలూ ఉన్నాయి. పిల్లి పిల్లల్ని పది ప్లేసులు మార్చినట్టు ఎందుకిలా తిరుగుతోందీ తల్లి? ఇప్పుడు ఎందుకీ సన్నివేశం? వంటి సందేశాలు ప్రేక్షకుల మదిలో వచ్చే అవకాశం లేకపోలేదు. అయితే... ప్రతి సన్నివేశానికి మరొక సన్నివేశంతో కనెక్షన్ ఉంటుంది. పోలీసుల ఎంక్వైరీ చేసినా ఎటువంటి చిక్కులు రాకుండా తల్లి వేసిన స్కెచ్ చివరకు తెలుస్తుంది. సినిమా పతాక సన్నివేశాలకు వచ్చేకొలదీ ప్రేక్షకులు మెచ్చుకునేలా సన్నివేశాలు రాసుకున్నారు. జీతూ మాధవన్ రచన, చిదంబరం ఎస్ పోదువల్ దర్శకత్వంలో బ్రిలియన్స్ కనబడుతుంది. అదే సమయంలో మరీ నిదానంగా కథను ముందుకు తీసుకు వెళ్లిన తీరు ఉంది.

Also Read: Deewana Review - 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

ప్రేక్షకులకు 'వావ్' ఫ్యాక్టర్ అందించాలని చిదంబరం ప్రయత్నించలేదు. ట్విస్ట్స్ వచ్చినప్పుడు షాక్ లేదా సర్‌ప్రైజ్ అవ్వడానికి బదులు... 'ఓహ్, ఫస్టాఫ్‌లో అలా చేయడం వెనుక కారణం ఇదా?' అనుకునేంత నిదానంగా సాగిందీ సినిమా. ఓ దశలో త్వరగా ముందుకు వెళితే బావుంటుందని అనిపిస్తుంది. ఎందుకంటే... పదే పదే తల్లీ కొడుకులు ఊర్లు తిరగడం రిపీట్ చేసినట్టు అనిపిస్తుంది. అలాగే, ఓ దశ తర్వాత ఇంతేనా? అనిపిస్తుంది. సినిమా లెంగ్త్ ఎక్కువైంది. సెకండాఫ్‌లో క్లుప్తంగా చెప్పాల్సిన సన్నివేశాలను, అబ్బాస్ ట్రాక్‌ను ఎక్కువసేపు చూపించారు. 'బాలన్ ది బాయ్'లో ఇన్‌స్టంట్ థ్రిల్, హై ఇచ్చే సన్నివేశాల కంటే నిదానంగా మనస్సులో ముద్రపడే సన్నివేశాలు ఎక్కువ. జైలు జీవితం కుర్రాడిపై ఎటువంటి ప్రభావం చూపించింది? తల్లీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా ఆవిష్కరించారు. అయితే ఆ జైలు జీవితం ఇచ్చిన సైకలాజికల్ ట్రామా నుంచి ఎలా బయటకు వచ్చారు? అనేది సరిగా చెప్పలేదు. ఇంటర్వెల్ తర్వాత ఆ పాయింట్ డిస్కస్ చేసి ఉంటే బావుండేది. కెమెరా వర్క్, ప్రొడక్షన్ డిజైన్, మ్యూజిక్ కథలో సహజత్వాన్ని ఆవిష్కరించేలా ఉన్నాయ్. తెలుగు ట్రైలర్ రిలీజ్ తర్వాత వచ్చిన విమర్శలు దృష్టిలో పెట్టుకుని, డబ్బింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, ఓ పాటలో మలయాళ సాహిత్యం అలాగే వినిపించింది. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ కథకు తగ్గట్టు ఖర్చు చేసింది. రాజీ పడలేదు.

'బాలన్ ది బాయ్'లో టైటిల్ రోల్ చేసిన అధిశీషన్ కేఆర్ అద్భుతంగా నటించాడు. స్కూల్ బెల్ వినిగానే జైలు జీవితం గుర్తుకు వచ్చే సన్నివేశంలో ఆ ట్రామాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఎక్స్‌ప్రెషన్స్‌లో చక్కగా చూపించాడు. ఇంటరాగేషన్‌లో పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి కాస్త నవ్వించారు. ఫర్జానా పాలతింగళ్ కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి. సన్నివేశంలో భావాన్ని కళ్ళతో పలికించారు. బాలన్ కాస్త పెద్దయిన పాత్రలు జినన్ చేశారు. అతను కూడా బాగా చేశాడు. అందరిలో హైలైట్ బామ్మ. ఆవిడ గన్ పట్టుకున్న ప్రతి సన్నివేశంలోనూ స్క్రీన్ మీద ఒక ఎనర్జీ పాస్ అయ్యింది. పోలీస్ పవిత్రన్ పాత్రలో జీన్ పాల్ లాల్ నటన ఓకే. టోవినో థామస్ అతిథి పాత్ర చేశారు. ఆయన చేయడం వల్ల పాత్రకు స్పెషాలిటీ వచ్చింది. లేదంటే ఎవరు చేసినా ఓకే.

Also ReadVanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?

కమర్షియల్ సినిమాల మధ్య 'బాలన్ ది బాయ్' ప్రత్యేకంగా నిలుస్తుంది. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా నిజాయతీగా చెప్పిన కథ కనిపిస్తుంది. చిదంబరం ఎస్ పోదువల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా చాలా అంటే చాలా నిదానంగా ముందుకు వెళుతుంది. అయితే... ప్రతి సన్నివేశం ప్రేక్షకుడి మెదడుకు పని చేస్తుంది. సాధారణ సన్నివేశాల్లోనూ దర్శకుడు కొన్ని హింట్స్ ఇచ్చారు. స్కూల్ బస్ ఆగిన చోటు నుంచి కదలొద్దని పిల్లాడితో తల్లి ఎందుకు చెప్పింది? వంటి ప్రశ్నలకు క్లైమాక్స్‌లో (సినిమా చూసిన వాళ్ళకు అర్థం అవుతుంది) సమాధానం లభిస్తుంది. అందరికీ నచ్చే సినిమా కాదిది... అన్ని సినిమాల మధ్యలో క్యారెక్టర్ బేస్డ్ డ్రివెన్ సినిమా కోసం, సైకలాజికల్ సర్వైవల్ డ్రామా కోసం ఎదురు చూసే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.

Also ReadMaa Inti Bangaram Review - 'మా ఇంటి బంగారం' రివ్యూ: సమంత యాక్షన్ సూపర్... మరి సినిమా హిట్టా? ఫట్టా?

View More
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pallaburusu First Look: 'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
'లెనిన్' సక్సెస్ తర్వాత చిన్న సినిమాతో... అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి 'పళ్ళబురుసు'
Anil Ravipudi: అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
అనిల్ రావిపూడి మంచి మనసు... 'డ్రామా జూనియర్స్ 9' చిన్నారికి సాయం... అమ్మకు యాక్సిడెంట్ అయితే?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today July 17th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: శకుంతల వర్సెస్ విహారి! లక్ష్మీ జాడ విహారికి తెలుస్తుందా!
Namitha New Look : అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
అప్పుడు అలా... ఇప్పుడు ఇలా - స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్‌లో టాలీవుడ్ హీరోయిన్
Advertisement
Advertisement
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG |  15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Shabad Mass Murder Case: షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం..  రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
షాబాద్‌ ఆరు హత్యల కేసులో కీలక పరిణామం.. రాజ్‌కుమార్ మృతిపై కేసు నమోదు
1st Hydrogen Train: భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
భారత్‌లో తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించిన ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలు ఇవే
RBI Plastic Currency: ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
ప్లాస్టిక్ కరెన్సీపై ఆర్బీఐ కీలక ప్రకటన! 10, 20 రూపాయల నోట్లతోనే మొదలెడుతున్నట్టు వెల్లడి!
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పొత్తులు వర్తించవు, జనసేన సత్తా చాటుతాం: నాదెండ్ల మనోహర్
US Airstrikes On Iran: ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
ఇరాన్‌పై అమెరికా భీకర దాడులు.. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులపై మిస్సైల్ దాడులు.. నిలిచిన విద్యుత్ సరఫరా
AP Corona Deaths: ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
ఏపీలో 12 మందికి కరోనా పాజిటివ్.. నలుగురు మృతితో కలకలం, మళ్లీ టెన్షన్ టెన్షన్
Telangana Congress Crisis:  తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా  వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
తెలంగాణ కాంగ్రెస్‌లో ముదురుతున్న సమన్వయ లోపం - వరుసగా వివాదాలు.. పీసీసీ మార్పు తప్పదా?
Breaking News: కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
కేదార్‌నాథ్‌లో విరిగిపడ్డ కొండచరియలు.. రాకపోకలకు అంతరాయం
Embed widget