మనం పనీర్ అంటాం, కొన్ని పాశ్చాత్యదేశాల్లో కాటేజ్ చీజ్ అంటారు. రెండూ ఒక్కటే. వెజిటేరియన్లు చాలా ఇష్టంగా తినే పదార్థాలలో పనీర్ ముందుంటుంది. సాధారణ పనీర్ కిలో అయిదు వందల రూపాయల వరకు ఉంటుంది. ఇంకా లేదంటే ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఉండొచ్చు. కానీ ప్రపంచంలోనే ఖరీదైన పనీర్ ఎంతో తెలుసా కిలో డబ్బై వేల రూపాయలు. దీని పేరు సెర్బియన్ చీజ్.పేరులో చీజ్ ఉన్న ఇది పనీర్ కిందకే వస్తుంది.
ఎందుకంత ఖరీదు?
మనం కొనుక్కునే పనీర్‌ను ఆవు పాలతోనో, గేదె పాలతోనే తయారుచేస్తారు.కానీ సెర్బియన్ చీజ్ ను మాత్రం గాడిద పాలతొ తయారు చేస్తారు. గాడిద పాలు ఎంత ఖరీదో తెలుసు కదా. కిలో పనీర్ తయారు కావాలంటే బోలెడన్ని పాలు కావాలి. ఒక అంచనా ప్రకారం 25 లీటర్ల గాడిద పాలను విరక్కొడితే కానీ కిలో పనీర్ తయారవదు. ఈ పనీర్ ను సెర్బియాలోని ప్రసిద్ధ సహజ నిల్వ ప్రాంతమైన జసావికాలో ఉత్పత్తి చేస్తారు. ఈ పనీర్ ను ‘పూలే’ అని కూడా పిలుస్తారు.
గాడిద పాలతో ఎన్నో లాభాలు...
గేదె పాలతో పోలిస్తే గాడిద పాలు ఖరీదైనవి. అంతేకాదు అందులో పోషక విలువలు కూడా అధికం. అధ్యయనాల ప్రకారం గాడిద పాలు ప్రొటన్ తో నిండి ఉంటాయి. దీనిలో యాంటీ మైక్రోబయల్ ప్రభావాలను కలిగి ఉంటాయి. గాడిద పాలను, ఆ పాల ఉత్పత్తులను తాగడం వల్ల వైరస్‌లు, బ్యాక్టిరియా వల్ల వచ్చే పొట్ట సమస్యలు తగ్గిపోతాయి. గాడిద పాలు ఎముకలకు చాలా మేలు చేస్తాయి. పొట్టలోని మంచి బ్యాక్టిరియాను పెంచడంలో సహాయపడుతుంది. పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గాడిద పాలు పడకపోవడమనేది ఉండదట. ఎలాంటి వారికైనా ఇవి పడతాయి. అందుకే వీటి ఖరీదు ఎక్కువని చెబుతారు.
పాలు దొరకవా?
గేదు, ఆవుల సంఖ్యతో పోలిస్తే ప్రపంచంలోని గాడిదల సంఖ్య చాలా తక్కువ. అలాగే ఇవి లీటర్ల కొద్దీ పాలను ఇవ్వవు. ఒక్కో గాడిద రోజుకు ఒక లీటరు పాలను మాత్రమే ఇస్తుంది. అంటే పాతిక గాడిదలు పెంచితే రోజుకు పాతిక లీటర్లు పాలు వస్తాయి. ఆ పాతిక లీటర్ల పాలతో కిలో పనీర్ తయారవుతుంది. అందుకే గాడిద పాలు, పనీర్ అంత ఖరీదు. గాడిద పాలలో అందాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. కొన్ని కాస్మోటిక్స్ తయారీలో గాడిద పాలను వినియోగిస్తారు.
Also read: మనదేశంలో అబార్షన్ చట్టాలు ఏం చెబుతున్నాయి? ఎన్ని వారాల వరకు గర్భస్రావానికి చట్టం అనుమతిస్తుంది?
Also read: బిర్యానీ మసాలా కొంటున్నారా? ఇంట్లో ఇలా చేసుకుంటే ఏడాదైనా నిల్వ ఉంటుంది