World Let’s Stop Shouting Day 2025 : రోజువారీ జీవితంలో ఒత్తిడి, కోపం, ప్రెజర్ వంటివి అందరిలో చాలా కామన్‌గా ఉంటున్నాయి. కొన్నిసార్లు బాధతో నిండి ఉంటే.. మరికొన్నిసార్లు కోపంతో ర్యాష్‌గా మాట్లాడేస్తూ ఉంటాము. ఆ సమయంలో ఎవరికైనా ఏదైనా విషయం చెప్పాలనుకున్నా తెలియకుండానే అరిచేస్తూ ఉంటాము. టోన్ మారిపోతుంది. అగ్రెసివ్‌గా మాట్లాడేస్తూ ఉంటాము. ఇలా మాట్లాడడం సరికాదని చెప్తూ.. ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ లెట్స్ స్టాప్ షౌటింగ్ డే (World Let’s Stop Shouting Day) నిర్వహిస్తున్నారు.
మీకు ఎవరైనా చెప్పారా? ఎందుకు అరుస్తున్నావు.. నార్మల్‌గా చెప్పు అని. కచ్చితంగా చెప్పే ఉంటారు. అలాంటి సమస్య గురించే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము. ఎంత ప్రెజర్ ఉన్నా.. కోపం ఉన్నా ఎవరితోనూ అరుస్తూ మాట్లాడకూడదని.. అలా చేయడం వల్ల కమ్యూనికేషన్ దెబ్బతింటుందని చెప్పడమే ఈ స్టాప్ షౌటింగ్ డే ఉద్దేశం. దీనిని ప్రతి ఏడాది నవంబర్ 6వ తేదీన ప్రపంచం వ్యాప్తంగా నిర్వహిస్తునారు. అరవడం వల్ల వచ్చే సమస్యలు ఏంటి? కమ్యూనికేషన్ ఎందుకు చెడిపోతుంది? రిలేషన్స్‌లో జరిగే నష్టాలు వివరిస్తూ అవగాహన కల్పిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో ఆఫీస్‌లో ఒత్తిడి, ఇంట్లో సమస్యలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలామంది ఊరికే ఇరిటేట్ అవుతున్నారు. చిన్న విషయాలకే కోపం తెచ్చేసుకుంటున్నారు. దీనివల్ల అరవడం, కోపం చూపించడం అనేది నార్మలైజ్ అయిపోతుంది. అలా జరగకూడదని చెప్పతూ.. కోపాన్ని, చిరాకును తగ్గించుకోవాలని గుర్తు చేస్తూ ఈ స్పెషల్ డే నిర్వహిస్తున్నారు. ఓ వ్యక్తితో ఎలా కమ్యూనికేట్ చేయాలి? మైండ్‌లో పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి? కోపాన్ని ఎలా తగ్గించుకోవాలనే అంశాలపై ప్రజలు దృష్టి పెట్టేలా చేయడమే దీని లక్ష్యం.
అరిస్తే వచ్చే నష్టాలివే.. (Stress Anger Shouting Problem)
ఇంట్లో అరిస్తే రిలేషన్ షిప్స్ పాడవుతాయి. ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది. పిల్లలపై నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. వర్క్ ప్లేస్‌లో అరిస్తే మీ సహోద్యోగుల్లో మీపై ఇంప్రెషన్ మారుతుంది. అంతేకాకుండా మీకు సపోర్ట్ చేసేవాళ్లు తగ్గుతారు. మీకన్నా తక్కువ వాళ్ల మీద అరిచే అధికారం మీకు ఉన్నా.. చూసేవాళ్లకి అధికారంగా కాదు.. మీరు వాళ్లని ఇబ్బంది పెడుతున్నట్లు కనిపిస్తుంది.
అరవకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Calm Communication Tips)
మీరు మాట్లాడేప్పుడు టోన్ తగ్గించి మాట్లాడండి. కోపంతో చెప్పే బదులు నిధానంగా కమ్యూనికేట్ చేయండి. ఫ్యామిలీతో మాట్లాడేప్పుడు కూడా మంచిగా కూర్చోబెట్టి మీ మైండ్‌లో ఉన్న విషయాలు చెప్పండి. ఆఫీస్‌లో టాక్సిక్‌గా మాట్లాడకండి. ఒత్తిడిని తగ్గించే చిట్కాలు ఫాలో అవ్వండి. ఆర్గ్యూమెంట్స్ సమయంలో కూడా అరుస్తూ కాకుండా లాజిక్, క్లారిటీతో పరిస్థితిని హ్యాండిల్ చేయండి.
మన మాటలు, మన టోన్ ఇతరులపై ప్రభావం చూపిస్తుందని గుర్తించుకోవాలి. అది తెలియకపోతే మీరు తెలియకుండానే ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. మీ టోన్ అంతే అని చెప్పే బదులు.. దానిని తగ్గించడానికి, శాంతపరచడానికి ప్రయత్నించాలి. ఆర్గ్యూమెంట్స్ సమయంలో 5 సెకన్లు ఆగి.. కోపాన్ని దిగమింగి.. మాట్లాడాలి. అలాగే పిల్లలకు కూడా అరుస్తూ కాకుండా నిదానంగా చెప్పాలి. అలాగే సోషల్ మీడియాలో కూడా కోపంగా కామెంట్లు పెట్టకూడదు. అలా ఎవరైనా పెడితే వాటిని డిలీట్ చేయడం లేదా అవాయిడ్ చేయడం చేయాలి.