అన్వేషించండి

World Bicycle Day : రోజూ సైక్లింగ్ చేస్తే గుండెకు, ఆరోగ్యానికి ఎన్ని లాభాలో.. కానీ వీరు మాత్రం జాగ్రత్త అంటోన్న కార్డియాలజిస్ట్

Health Benefits of Cycling : ప్రపంచ సైకిలింగ్ డే సందర్భంగా వైద్యులు సైక్లింగ్ చేస్తే కలిగే ప్రయోజనాలు వివరిస్తూ.. అలాగే కొందరు సైక్లింగ్ చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవేంటో చూసేయండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సైక్లింగ్ గుండె ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి తోడ్పడుతుంది.
  • రోజువారీ వ్యాయామం ఒత్తిడి, ఆందోళన తగ్గిస్తుంది, మానసిక ప్రశాంతతనిస్తుంది.
  • వారానికి 5 రోజులు, 20-30 నిమిషాలు సైక్లింగ్ మేలు చేస్తుంది.
  • ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు వైద్యుల సలహాతో సైక్లింగ్ చేయాలి.

Cycling Benefits and Risks : ఫిట్‌నెస్‌పై అవగాహన పెరుగుతున్న ఈరోజుల్లో చాలా మంది సైక్లింగ్‌ను తమ రోజువారీ వ్యాయామంలో భాగం చేసుకుంటున్నారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారికి అనువైన వ్యాయామంగా సైక్లింగ్‌ను నిపుణులు సూచిస్తారు. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సైక్లింగ్ కీలక పాత్ర పోషిస్తుందని వైద్యులు చెప్తున్నారు. అందుకే దీని గురించి ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది జూన్ 3వ తేదీన ప్రపంచ బైస్కిల్ డే (World Bicycle Day Special) నిర్వహిస్తున్నారు.

సైక్లింగ్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అయితే ఇది ఎవరు చేస్తే మంచిది.. ఎవరు చేయకూడదు అనే అంశంపై హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి పలు ఆసక్తికర విషయాలు ఏబీపీ దేశంతో తెలిపారు. సైక్లింగ్ గుండెకు అత్యంత మేలు చేసే ఏరోబిక్ వ్యాయామాల్లో ఒకటని తెలిపారు. అయితే ఎవరు సైకిల్ తొక్కితే మంచిది.. ఎవరు దీనికి దూరంగా ఉండాల్లో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. 

గుండె ఆరోగ్యానికి సైక్లింగ్

సైక్లింగ్ తక్కువ ప్రభావం చూపే వ్యాయామాల్లో ఒకటి. అంటే రన్నింగ్ లేదా ఇతర తీవ్రమైన వ్యాయామాల మాదిరిగా కీళ్లపై ఎక్కువ ఒత్తిడి పడదు. కానీ గుండె, రక్తనాళాలకు మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. క్రమం తప్పకుండా సైక్లింగ్ చేయడం వల్ల బీపీ నియంత్రణలో ఉంటుంది. అలాగే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. దీనివల్ల గుండెపోటు, స్ట్రోక్, కరోనరీ ఆర్టరీ వ్యాధులు, గుండె వైఫల్యం వంటి సమస్యల ప్రమాదం తగ్గే అవకాశం ఉంటుందని తెలిపారు.

బరువు తగ్గడంలోనూ..

ప్రస్తుతం ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. అధిక బరువు కారణంగా రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతోంది. సైక్లింగ్ కేలరీలను ఖర్చు చేసి బరువు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడుతుంది. 

మానసిక ఆరోగ్యం కోసం..

శారీరక ప్రయోజనాలతో పాటు మానసిక ఆరోగ్యానికి కూడా సైక్లింగ్ ఉపయోగపడుతుంది. రోజువారీ ఒత్తిడి, ఆందోళనలను తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. సైక్లింగ్ చేసే సమయంలో శరీరంలో ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి మూడ్‌ను మెరుగుపరచి మానసిక ప్రశాంతతను అందిస్తాయి.

సైక్లింగ్ ఎంతసేపు చేయాలి?

డాక్టర్ జగదీశ్ మాదిరెడ్డి సూచనల ప్రకారం.. వారంలో కనీసం 5 రోజులు కనీసం 20 నుంచి 30 నిమిషాల పాటు మోస్తరు వేగంతో సైక్లింగ్ చేయడం వల్ల గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుందని తెలిపారు.

ఎవరు జాగ్రత్తగా ఉండాలి?

సైకిలింగ్ ప్రారంభించాలని అనుకుంటే ఒకేసారి ఎక్కువసేపు లేదా అధిక తీవ్రతతో సైక్లింగ్ ప్రారంభించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మధ్య వయసు వారు, వృద్ధులు, ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహాతోనే వ్యాయామం ప్రారంభించాలి.

అలాగే ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో, వాతావరణంలో తేమ అధికంగా ఉన్నప్పుడు లేదా శరీరంలో నీటి కొరత ఉన్నప్పుడు సైక్లింగ్ చేయకపోవడం మంచిది. అలాంటి పరిస్థితుల్లో గుండెపై అదనపు ఒత్తిడి పడే అవకాశం ఉంటుంది.

ఈ లక్షణాలు కనిపిస్తే ఆపాల్సిందే..

సైక్లింగ్ చేస్తున్న సమయంలో ఛాతినొప్పి, అసాధారణ శ్వాస ఇబ్బంది, తల తిరగడం, గుండె దడ, తీవ్రమైన అలసట వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వ్యాయామం ఆపి వైద్యులను సంప్రదించాలి. అలాగే ఇప్పటికే గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ నియంత్రణలో లేనివారు, ఇటీవల గుండె శస్త్రచికిత్స లేదా ఇతర కార్డియాక్ ప్రక్రియలు చేయించుకున్నవారు సైక్లింగ్ ప్రారంభించే ముందు కార్డియాలజిస్ట్‌ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

సరైన జాగ్రత్తలు తీసుకుంటూ క్రమం తప్పకుండా సైక్లింగ్ చేస్తే గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. తక్కువ ఖర్చుతో, పర్యావరణానికి మేలు చేస్తూ, శారీరక-మానసిక ఆరోగ్యాన్ని కాపాడే ఉత్తమ వ్యాయామాల్లో సైక్లింగ్ ఒకటిగా వైద్యులు పేర్కొంటున్నారు.

మరిన్ని హెల్త్ ఆర్టికల్స్ కోసం దీనిని క్లిక్ చేయండి. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Cricketer Bharti Fulmali : మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
Desk Job Risks : ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకతో పాటు ఈ అవయవాలకూ ప్రమాదమే, నిపుణుల సూచనలివే
ఆఫీస్‌లో గంటల తరబడి కూర్చుంటున్నారా? వెన్నెముకతో పాటు ఈ అవయవాలకూ ప్రమాదమే, నిపుణుల సూచనలివే
English Speaking Skills : ఇంగ్లీష్ అర్థమవుతున్నా మాట్లాడలేకపోతున్నారా? రోజూ ఈ అలవాట్లు ఫాలో అయితే ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు!
ఇంగ్లీష్ అర్థమవుతున్నా మాట్లాడలేకపోతున్నారా? రోజూ ఈ అలవాట్లు ఫాలో అయితే ఫ్లూయెంట్‌గా మాట్లాడొచ్చు!
Monsoon Diet Tips : వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు
వర్షాల వల్ల జలుబు, దగ్గు వస్తున్నాయా? రోగనిరోధక శక్తి కోసం వీటిని తినమంటోన్న వైద్యులు
Advertisement

వీడియోలు

Manav's Father Left Stadium Out Of Nervousness | కొడుకు మ్యాచ్ చూడకుండానే వెళ్లిన తండ్రి
Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NBK111 Glimpse : NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
NBK111 గ్లింప్స్ వచ్చేసింది - బాలయ్య బర్త్ డేకు మాస్ ట్రీట్
The Fall of Mamata Banerjee: మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
మమతా బెనర్జీ- ఒక విఫల ప్రయాణం 
Bigg Boss 10 Telugu Contestants : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కంటెస్టెంట్స్ వీళ్లేనా... నందూస్ వరల్డ్ నందుకు ఛాన్స్!
Cricketer Bharti Fulmali : మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
మహిళల T20 వరల్డ్ కప్​లో అబ్బాయిని ఆడిస్తున్నారా? ఎవరీ భారతి ఫుల్మాలి?
Congress vs BJP South India: రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
రాహుల్ గాంధీ ప్రధాని కల నిజమవ్వాలంటే.. ఆ ‘ముగ్గురు’ మ్యాజిక్ చేయాల్సిందే! రేవంత్, డీకే, కనుగోలు ముందున్న బిగ్ టాస్క్!
YS Jagan Mohan Reddy Vizag Visit : వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
వైఎస్ జగన్ విశాఖ పర్యటన - స్టీల్ ప్లాంట్ బాధితులకు రూ. కోటి ఇవ్వాల్సిందే.. కూటమి ప్రభుత్వంపై జగన్ ఫైర్!
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Vizag Steel Plant ప్రమాదంలో షాకింగ్ నిజాలు.. మృత్యుంజయులం అంటూ పోస్ట్, అంతలోనే తీవ్ర విషాదం
Chandrababu Wishes Balakrishna On His Birthday: నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
బాలకృష్ణకు బర్త్‌డే విషెస్ చెప్పిన ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
Embed widget