World Bicycle Day 2025 : ఈ మధ్యకాలంలో చాలామంది తమ లైఫ్‌స్టైల్‌ని చాలా లేజీగా మార్చేసుకుంటున్నారు. గతంలో బైక్‌లు, కార్లకు బదులుగా సైకిల్‌పై తమ అవసరాలకోసం వెళ్లేవారు. ఇప్పుడు ఇంటి దగ్గర్లో షాప్ ఉన్నా బైక్‌పైనే వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికే కాదు పర్యావరణానికి కూడా అంత మంచిది కాదు. ఈ విషయాన్ని గుర్తిస్తూ.. సైకిల్‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని తెరపైకి తెచ్చారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవం చరిత్ర
ప్రతి సంవత్సరం జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ స్పెషల్ డేని తుర్కమెనిస్తాన్ దేశం ముందుకు తీసుకురాగా.. సైకిల్‌తో ప్రయాణం సులభమైన, చౌకైనా, పర్యావరణానికి, ఆరోగ్యానికి అనుకూలమైన ప్రయాణ మార్గంగా ఐక్యరాజ్య సమితి గుర్తించింది. 2018లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆ సమయంలో 193కు పైగా దేశాలు ప్రపంచ సైకిల్ దినోత్సవానికి మద్ధతునిచ్చాయి.
సైకిల్ దినోత్సవం ప్రాముఖ్యత..
సైకిళ్ల వాడకంతో కాలుష్యం, ట్రాఫిక్ తగ్గుతుంది. సురక్షితమైన పర్యావరణానికి తోడ్పాటు అందిస్తుంది. చౌక ధరలో అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. శారీరకంగా కూడా ఆరోగ్యంగా ఉండేందుకు సైక్లింగ్ హెల్ప్ చేస్తుంది. కాబట్టి రోజులో కనీసం కాసేపు సైక్లింగ్ చేస్తే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చనే ప్రాముఖ్యతలను ఇది తెలియజేస్తుంది.
సైక్లింగ్‌తో ఆరోగ్యానికి కలిగే లాభాలు
సైక్లింగ్ చేస్తే ఆరోగ్యానికి ఎన్నో లాభాలు అందుతాయి. అందుకే జిమ్‌లో కూడా సైకిల్ని ఉంచుతారు. కార్డియోలో భాగంగా చాలామంది సైక్లింగ్ చేస్తారు. బయటకు వెళ్లి తొక్కలేనివారు ఇంట్లోనే ఈ సైక్లింగ్‌ను చేయవచ్చు. ఇది రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. స్ట్రోక్ సమస్యలను దూరం చేస్తుంది. కండరాలకు బలం చేకూర్చి.. ఫ్లెకీబిలిటీ పెంచుతుంది. కాళ్లకు, హిప్స్‌కు, తొడలకు బలాన్ని అందిస్తుంది.
కీళ్ల పనితీరు మెరుగవడంతో పాటు బరువు తగ్గడంలో కూడా హెల్ప్ చేస్తుంది. శరీరంలోని కేలరీలు బర్న్ చేయడానికి సైక్లింగ్ మంచి ఆప్షన్. మెటబాలీజం పెంచుతుంది. చెడుకొవ్వుని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఒత్తిడి, డిప్రెషన్, యాంగ్జైటీ సమస్యలు దూరమవుతాయి. ఎండార్ఫిన్స్ విడుదల చేసి మూఢ్ని మెరుగుపరుస్తుంది. నిద్ర సమస్యలు కూడా తగ్గుతాయి. మెరుగైన నిద్ర అందుతుంది. ఏ వయసు వారైనా దీనిని తమ డైలీ రొటీన్లో చేర్చుకోవచ్చు.
మీరు ఫిట్నెస్ కోసం.. పర్యావరణం కోసం మీ లైఫ్స్టైల్లో సైకిల్ని చేర్చుకోవాలనుకుంటే మంచిదే. అయితే మీరు దీనిని వాడేముందు వైద్యుల సలహాలు తీసుకోండి. మీ ఆరోగ్యం, జీవనశైలిని బట్టి వారు మీరు సైకిల్ని వాడవచ్చో లేదో చెప్తారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు అనుకునేవారు సైకిల్ని ప్రశాంతంగా వాడుకోవచ్చు.