Winter Home Protection Hacks : వర్షాలు ఆగిపోయాయి. చలి మొదలైపోయింది. తెలుగు రాష్ట్రాల్లో చల్లగాలుల ప్రభావం బాగానే ఉంది. అయితే చలి ఆరోగ్యంపై వివిధ రకాలుగా ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి చలికాలంలో ఇంట్లో కొన్ని మార్పులు చేయాలి అంటున్నారు నిపుణులు. చలి లోపలకి రాకుండా.. చల్లని గాలుల నుంచి భద్రతనిస్తూ.. ఇంట్లో గాలి స్వచ్ఛంగా ఉండేలాగా తీసుకోవాల్సిన చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిని ఫాలో అయితే శీతాకాలంలో కూడా ఇంట్లో సురక్షితమైన, వెచ్చని, పొడి వాతావరణాన్ని ఆస్వాదించవచ్చు. మరి చలికాలంలో ఇంట్లో చేయాల్సిన మార్పులు ఏంటో చూసేద్దాం. 

Continues below advertisement

ఖాళీలు ఉండకూడదు..

కిటికీలు, తలుపులు, గోడలకు ఖాళీలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే ఈ చిన్న చిన్న ఖాళీలు రూమ్​లో వేడిని తగ్గించేస్తాయి. కాబట్టి వాటిని క్లోజ్ చేయాలి. వెదర్ స్ట్రిప్పింగ్, సీలెంట్లు, ఫోమ్ ఇన్సులేషన్ చలి లోపలికి రాకుండా కాపాడతాయి. 

సర్వీసింగ్

ఇంట్లో ఉపయోగించే హీటర్, ఇతర విద్యుత్ వ్యవస్థలకు వార్షిక సర్వీసింగ్ చేయించి చలికాలానికి రెడీ చేసి పెట్టుకోవాలి. ఫిల్టర్‌లను శుభ్రపరచడం, థర్మోస్టాట్‌లను తనిఖీ చేయడం, వైరింగ్‌ను పరీక్షించడం వంటివి చేసుకోవాలి. మీరు స్పేస్ హీటర్లను ఉపయోగిస్తే.. సర్క్యూట్‌లు సురక్షితంగా లోడ్‌ను నిర్వహించగలవో లేదో చెక్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల వస్తువుల లైఫ్​స్పామ్ పెరుగుతుంది. దీర్ఘకాలిక మరమ్మత్తు ఖర్చులు తగ్గుతాయి.

Continues below advertisement

రూఫ్, డ్రైనేజీ ఆడిట్

చాలామంది లీక్ కనిపిస్తే తప్పా.. రూఫ్, డ్రైనేజీలను పట్టించుకోరు. ఆ సమయంలో డ్యామేజ్ వస్తే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి పగుళ్లు ఉన్న టైల్స్, బ్లాక్ చేస్తోన్న వస్తువులు, ఫ్లషింగ్‌కు నష్టం జరిగిందో లేదో చెక్ చేయండి. ఇవన్నీ నీరు ఇంకిపోవడానికి, తేమకు కారణం అవుతాయి. కాబట్టి వెంటనే రీసెట్ చేయించేయండి. మరమ్మతులు ఇంటిని పాడవకుండా కాపాడుతాయి. 

ఇన్సులేషన్‌కై..

ఇన్సులేషన్ ఇకపై లగ్జరీ కాదు. ఇది ఒక పెట్టుబడి. అటకలు, గోడ ప్యానెల్‌లను ఇన్సులేట్ చేయడం, థర్మల్ విండో ఫిల్మ్‌లను పెట్టడం వల్ల వేడి నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చు. అందుకే 2025 నాటికి స్థిరమైన గృహనిర్మాణంపై అవగాహన పెరిగి.. చాలామంది ఇన్సులేట్ యూనిట్లు కొనుగోలు చేస్తున్నారు. అద్దెకు ఉండేవారికి కూడా ఇవి ప్రధాన డిమాండ్‌గా మారుతున్నాయి.

ప్లంబింగ్ 

ఉష్ణోగ్రతలు చల్లగా ఉన్నప్పుడు పైపులు కుంచించుకుపోతాయి. లేదా పగిలిపోవచ్చు. కాబట్టి పైపులను.. ముఖ్యంగా బయటి గోడలపై లేదా బహిరంగ బాల్కనీలలో ఉన్న వాటిని ఇన్సులేట్ చేయించడం చాలా ముఖ్యం. నీటి నష్టం జరగకుండా నిరోధించడానికి ప్లంబింగ్ పనులు చేయించుకోవాలి. 

కార్బన్ మోనాక్సైడ్ డిటెక్టర్లు 

శీతాకాలంలో హీటర్, ఎయిర్ ప్యూరీఫైయర్స్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొన్ని చెకింగ్స్ చేసుకోవాలి. కార్బన్ మోనాక్సైడ్, పొగను గుర్తించే డిటెక్టర్లు ఉపయోగిస్తే మంచిది. ఇవి మీకు భద్రత ఇస్తాయి. ప్రమాదాల బారిన పడకుండా ఉండడంలో హెల్ప్ చేస్తాయి. 

పెయింట్స్ 

బయటి గోడలకు పెయింట్ వేయించడం వల్ల సీజన్‌ వల్ల వచ్చే మార్పులు తగ్గుతాయి. ఎక్కువ మార్పును తట్టుకుంటాయి. పీలింగ్, పగుళ్లు లేదా సాధారణంగా రంగు వెలిసిపోవడం చూసినట్లయితే.. శీతాకాలపు తేమ ఏర్పడటానికి ముందు రీపెయింటింగ్ లేదా రీసీలింగ్‌ను షెడ్యూల్ చేస్తే మంచిది.

లైటింగ్

శీతాకాలంలో పగలు తక్కువగా, రాత్రి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సీజన్​కి తగ్గట్లు ఇంట్లో లైటింగ్‌ను మెరుగుపరచుకోవాలి. పాత ఫిక్చర్‌లను కొత్త ఎనర్జీ స్టార్ రేటెడ్ LED లైటింగ్‌తో భర్తీ చేయాలి. తగినంత వెంటిలేషన్ ఏర్పాటు చేయాలి. తేమ, గాలి ప్రవాహం సమతుల్య కాంతి వచ్చేలా చూసుకోవాలి. 

ఇలా చలికాలంలో ఇంట్లో ఈ మార్పులు చేస్తే.. ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా ఉండొచ్చు. ఇప్పటికే ఇంట్లో ఉన్న వస్తువులతో.. లేదా వింటర్ స్పెషల్ వస్తువులతో ఇంటిని డెవలెప్ చేసుకుంటే.. చలికాలంలో కూడా వెచ్చగా ఉండగలుగుతారు.