Winter Fashion for Men : ఈ మధ్యకాలంలో ఆడవారిలోనే కాదు మగవారిలోనూ ఫ్యాషన్ సెన్స్ పెరిగింది. రొటీన్ లుక్స్‌కి భిన్నంగా ఉండాలనుకుంటున్నారు. కొత్త కొత్త కలర్స్, కొత్త డిజైన్స్ ట్రై చేస్తున్నారు. కంఫర్ట్‌బుల్‌గా, స్టైలిష్‌గా ఉండే డ్రెస్‌లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే వింటర్లో ఎలాంటి డ్రెస్‌లు వేసుకోవాలి? ఎలాంటివి వేసుకుంటే స్టైలిష్‌గా, కంఫర్ట్‌బుల్‌గా ఉంటుందని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే.
గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. సమ్మర్లో వేసుకోగలిగే దుస్తులు వింటర్లో వేసుకోలేము. కానీ కొత్తగా ట్రై చేయాలనుకుంటే.. కొన్ని అంశాలు మైండ్‌లో పెట్టుకోవాలి. చలికాలంలో వెచ్చదనాన్ని ఇచ్చే డ్రెస్‌లు ఎంచుకోవాలి. అలాగే అవి మీకు స్టైల్‌ని ఇచ్చేవిగా ఉండాలి. అలాంటి లుక్ ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
లేయర్ చేయండి
చలికాలంలో లేయరింగ్ మంచి లుక్‌తో పాటు కంఫర్ట్ ఇస్తుంది. లేయరింగ్ అంటే అనేక దుస్తులు ఒకేసారి ధరించడం కాదు. లేయర్ చేయడం కూడా ఒక ఆర్టే. దీనిలో తప్పు చేస్తే స్టైల్ చెడిపోతుంది. కరెక్ట్ చేస్తే క్లాసీ లుక్ వస్తుంది. తేలికపాటి ఉన్ని టీ షర్ట్లు, దానిపైన ఏదైనా కోట్, షర్ట్ వేసుకుంటే.. చూసేందుకు హెవీగా కాకుండా.. లైట్‌గా ఉంటుంది. కానీ మంచిగా ఆకర్షిస్తుంది. మీరు లేయరింగ్ కరెక్ట్‌గా చేస్తే.. చలికాలంలో కూడా స్టైలిష్‌గా, సౌకర్యవంతంగా ఉండగలుగుతారు.
అల్లికల డ్రెస్‌లు
రిచ్, అల్లికలు కలిగిన డ్రెస్‌లు ఉపయోగించడానికి శీతాకాలం అనువైనది. గోధుమ, ఆలివ్, నేవీ వంటి వెచ్చని షేడ్స్‌లో పెద్ద షర్ట్స్, స్వెట్ షర్ట్స్ వేసుకోవచ్చు. లేదా షర్ట్ వేసి.. దానిపైన స్లీవ్ లెస్ లేదా స్లీవ్స్‌తో కూడిన స్వెటర్ వేసుకోవచ్చు. కాలర్స్ బయటకి పెడితే లుక్ చాలా బాగుంటుంది. ఆఫీస్‌కి వెళ్లేవారికి ఇది బెస్ట్ ఆప్షన్.
సౌకర్యవంతమైనవి
చలికాలంలో అయనా బిగుతుగా ఉండే దుస్తులు వేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీరు పనిలో ఉన్నా లేదా సాయంత్రం బయటకు వెళ్లినా, చలి ఎక్కువైనా మీకు ప్రశాంతంగా, సౌకర్యవంతంగా ఉండేవి వేసుకోవాలి. అప్పుడే మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు.
మరిన్ని ఫ్యాషన్ టిప్స్
కేవలం డ్రెస్‌లు మాత్రమే కాదు.. టోపీలు, హ్యాండ్ గ్లౌవ్స్‌లు, స్కార్ఫ్‌లు వంటివి కూడా మీ లుక్‌ని పెంచుతాయి. అయితే మీరు వేటిమీద ఎలాంటివి వేసుకుంటున్నారన్నదే మెయిన్. అలాగే ఎప్పుడు డ్రెస్‌లు తీసుకున్నా.. అధిక-నాణ్యత ఉండేవి ఎంచుకుమంటే ఎక్కువకాలం మన్నికతో ఉంటాయి. కాబట్టి ఫ్యాషన్‌తో పాటు.. మంచి, శాశ్వతమైన వాటిపై ఖర్చు చేయడం అనేది మంచి ఎంపిక అవుతుంది. పురుషుల కోసం వింటర్ స్పెషల్ డ్రెస్‌లు ఎన్నో మార్కెట్లోకి వచ్చాయి. వాటిలో మీకు నచ్చేవి.. మీ రంగుకు తగ్గ డ్రెస్‌లు ఎంచుకోండి.