Dermatologist Tips to Prevent Winter Dandruff : చలికాలంలో చాలామందికి చుండ్రు ఓ రెగ్యులర్ సమస్యగా మారుతుంది. ఈ సమయంలో తలలో పొలుసులు రాలడం, దురద, చికాకు పెరుగుతాయి. దీనివల్ల జుట్టు రాలిపోతుంది. “ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, చాలా మందికి చుండ్రు అనేది వస్తుంది. దీర్ఘకాలిక స్కాల్ప్ సమస్యలు లేని వారు కూడా శీతాకాలంలో స్కాల్ప్ సమస్యలు ఎదుర్కొంటారు”అని డెర్మాప్యూరిటీస్ CEO శ్రీమతి లలిత ఆర్య అన్నారు. ఆమె ప్రకారం.. శీతాకాలంలో స్కాల్ప్ సమతుల్యత దెబ్బతింటుంది. చుండ్రును దూరం చేసి.. స్కాల్ప్ ఆరోగ్యాన్ని పెంచే చిట్కాలు ఆమె సూచిస్తున్నారు.

Continues below advertisement

శీతాకాలంలో చుండ్రు

(Image Source: ABPLIVE AI)

శీతాకాలంలో గాలి సహజంగా పొడిగా ఉంటుంది. దీనివల్ల స్కాల్ప్ నుంచి తేమ మరింతగా తొలగుతుంది. దీనివల్ల స్కాల్ప్​పై చికాకు ఏర్పడి పొలుసులకు గురవుతుంది. తేమ లేకపోవడం వల్ల స్కాల్ప్ దాని సహజ నూనెలను కోల్పోయి పొడిబారేలా చేసి చుండ్రుకు కారణమవుతుంది. సూర్యరశ్మి తగ్గడం, శరీరం విటమిన్ Dని ఉత్పత్తి చేయకపోవడం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ కాసేపు ఎండలో ఉండేందుకు లేదా విటమిన్ డి సప్లెమెంట్స్ తీసుకునేందుకు ప్రయత్నించాలి. 

పొడి స్కాల్ప్, చుండ్రు మధ్య తేడాలివే

స్కాల్ప్ పొడిగా మారడం వేరు. చుండ్రు వేరు. ఈ విషయం తెలియక చాలామంది.. దానికి రాంగ్ ట్రీట్​మెంట్ ఇస్తారు. దీనివల్ల సమస్య మరింత తీవ్రమవుతుంది. రెండింటినీ గుర్తించి.. వేరుగా సంరక్షణ తీసుకోవడం అవసరం. స్కాల్ప్ బిగుతుగా ఉండి చిన్న తెల్లటి పొలుసులు ఉంటే.. అది పొడిబారడం. కానీ పొలుసులు జిడ్డుగా, పసుపు రంగులో, దురదగా లేదా ఎరుపు రంగుతో వస్తే.. అది చుండ్రు. పొడి స్కాల్ప్ తేమతో తగ్గుతుంది. చుండ్రు యాంటీ ఫంగల్, వైద్యపరమైన సంరక్షణకు బాగా స్పందిస్తుంది.

Continues below advertisement

నూనె వాడొచ్చా?

 

(Image Source: ABPLIVE AI)

స్కాల్ప్ పొడిగా ఉందని.. చాలామంది నూనె ఎక్కువగా అప్లై చేస్తారు. అయితే నూనె జుట్టును తేమగా ఉంచినా.. చుండ్రును మరింత పెంచుతుంది. అధికంగా నూనె వాడడం వల్ల ఫోలికల్స్‌ మూసుకుపోయి.. పొలుసులను మరింత పెరుగుతాయి. తేలికపాటి నాన్-కామెడోజెనిక్ నూనెలను ఉపయోగించి వారానికి ఒకసారి మాత్రమే నూనె అప్లై చేస్తే చాలట.

స్కాల్ప్ సీరమ్‌లు 

నూనెకు బదులు స్కాల్ప్ సీరమ్‌ ఉపయోగించవచ్చు. నూనెల వలె కాకుండా.. ఇవి రంధ్రాలను మూసుకుపోకుండా స్కాల్ప్‌కు చికిత్స చేయడానికి హెల్ప్ చేస్తాయి. అయితే సీరమ్స్ ఎంచుకునేప్పుడు కొన్ని చెక్ చేసుకోవాలి. ఏ టైప్ సీరమ్.. ఏయే జుట్టు సమస్యలను దూరం చేస్తుందో తెలుసుకోవాలి. సాలిసిలిక్ యాసిడ్ పొలుసులను ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. చుండ్రు కలిగించే ఈస్ట్ను నియంత్రించడానికి జింక్ పిరిథియోన్, చుండ్రు తగ్గించడం కోసం కెటోకానజోల్, హెయిర్ ట్రీట్​మెంట్​కి టీ ట్రీ ఆయిల్, స్కాల్ప్ అవరోధాన్ని బలోపేతం చేయడానికి నియాసినమైడ్ సీరమ్స్ ఎంపిక చేసుకోవచ్చు. 

శుభ్రంగా ఉన్న స్కాల్ప్‌పై వారానికి రెండు నుంచి మూడు సార్లు యాంటీ-డాండ్రఫ్ సీరమ్‌లను ఉపయోగించవచ్చు. మీ స్కాల్ప్ ఎలా స్పందిస్తుందో దాని ఆధారంగా సర్దుబాటు చేయాలి. తేలికపాటి, హైడ్రేటింగ్ షాంపూతో జత చేయండి. సీరమ్స్ అధికంగా వాడితే చికాకు పెరగవచ్చు. 

చుండ్రును పెంచే తప్పులు

(Image Source: ABPLIVE AI)

 

వేడి నీటి స్నానాలు, అధికంగా జుట్టు వాష్ చేస్తే.. చుండ్రు పెరుగుతుంది. కఠినమైన ఉత్పత్తులు, హైడ్రేషన్ను దాటవేయడం సాధారణ తప్పులుగా చెప్తారు. ఇవి చుండ్రును మరింత పెంచుతాయి. కాబట్టి స్కాల్ప్ శుభ్రంగా ఉంచుకోవడం ముఖ్యం. ఒమేగా-3లు, జింక్, విటమిన్ D ఎక్కువగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. స్కాల్ప్ ఎక్స్‌ఫోలియేషన్ కూడా మంచిది. సమస్య ఎక్కువగా ఉంటే వైద్యుల సహాయం తీసుకోవాలి. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.