చాలామంది పురుషుల్లో ఎప్పుడూ ఉండే సందేహం.. చిన్నగా ఉంటే, తన భాగస్వామితో కలయిక కష్టమవుతుందా అని. దాన్ని మైండ్‌లో పెట్టుకోవడం వల్ల.. అసలుకే ఎసరు వస్తుంది. మానసిక ఆందోళనకు గురై.. తమ జీవితమే వేస్ట్ అనే నిర్ణయానికి వచ్చేస్తారు. అబ్బాయిలూ.. మీకు కూడా అలాంటి ఆలోచనే ఉందా? అయితే, ఇప్పటికైనా అది బుర్ర నుంచి పూర్తిగా బయటకు తీసేయండి. ఎందుకంటే.. Size size doesn't matter. 


‘ఏక్ మినీ కథ’ సినిమా చూశారా? అందులో హీరో సంతోష్ శోభన్ కూడా ఇదే సమస్యతో బాధపడుతుంటాడు. చిన్నప్పటి నుంచి తన ఫ్రెండ్స్ ‘అది’ చిన్నది అంటూ ఏడిపించడం, P*rn సినిమాల్లో చూపించే సైజులతో పోల్చుకోవడం వంటివి మనసును అతలాకుతలం చేసేస్తాయి. వాస్తవానికి.. ఆ పనిలో పాల్గోడానికి సైజుతో పనిలేదు. అది ఎంత ఉన్నా సరే.. ఇద్దరి ఆట హాయిగా సాగుతుంది. అంతేకాదు.. పిల్లలు కూడా కనేయొచ్చు. కాబట్టి, ఆ విషయం గురించి మరిచిపోండి. దీనిపై నిపుణులు కూడా ఏం చెబుతున్నారో చూడండి. 


స్తంభిస్తే చాలు.. సైజుతో పనిలేదు


పురుషుల అంగం సైజు 2 నుంచి 4 అంగుళాల వరకు ఉంటుంది. అయితే, స్తంభించేప్పుడు 2 అంగుళాల అంగం 4 అంగుళాలకు పెరుగుతుంది. నాలుగు అంగుళాలు ఉన్నవారికి కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందని అనుకోవడం అపోహ మాత్రమే. నాలుగు అంగుళాల అంగం ఉండేవారికి మరింత పొడవయ్యే అవకాశం ఉండదట. చెప్పాలంటే.. 2 అంగుళాల సైజు ఉండేవారికే సాగే గుణం ఎక్కువగా ఉంటుందట. అలాగే కలయికలో పాల్గొన్నప్పుడు ఎక్కువ స్టిఫ్‌గా ఉండి భాగస్వామిని కేక పెట్టించే అంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారట. 


వాస్తవానికి చిన్న అంగం కలిగిన పురుషుల భాగస్వామికి కలయికలో తక్కువ అంచనాలు ఉంటాయి. అయితే, కలయిక తర్వాత.. తన పార్టనర్‌ పెర్ఫార్మెన్స్ చూసి ఆశ్చర్యపోతారట. చెప్పాలంటే.. పెద్ద అంగం కలిగేవారు అంతగా సంతృప్తి పరచలేరట. అలాగే వీరు స్ట్రోక్స్ ఇచ్చినా మహిళలకు నొప్పి కలగదు. బాగా ఎంజాయ్ చేస్తారు. అంతేకాదు.. స్కలనానికి పట్టే సమయం కూడా చాలా ఎక్కువట. అంటే.. చిన్న అంగం గలవారు ఎక్కువ సేపు కలయికలో పాల్గొంటారన్నమాట. అయితే, పెద్ద అంగం కలవారితో కలిసిన తర్వాత స్త్రీలు నొప్పితో బాధపడతారట. 


సర్జరీలు వద్దు.. 


చాలామంది.. అంగం సైజును పెంచుకొనేందుకు సర్జరీలు చేయించుకుంటారు. కానీ, అది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే.. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకూ పనికిరాకుండా చేస్తాయట. అలాగే.. సర్జరీలో కూడా ఉన్న అంగాన్నే స్తంభింపజేసి.. కాసింత పొడవు కనిపించేలా చర్మాన్ని అతికించి ఆ భ్రమ కలపిస్తారట. అలాగే బయట అమ్మే మూలికలను కూడా నమ్మొద్దని నిపుణులు చెబుతున్నారు. కేవలం అంగస్తంభన సమస్యలు వస్తేనే వైద్యుడిని సంప్రదించాలని అంటున్నారు. 


అంగం ఎలా పనిచేస్తుంది?


అంగ స్తంభనలో టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే, శరీరంలో రక్త ప్రవాహం కూడా సక్రమంగా ఉండాలి. స్త్రీని చూసినప్పుడు లేదా లైంగిక ప్రేరేపణ జరిగినప్పుడు అంగం ఉద్వేగానికి గురవ్వుతుంది. రక్తప్రవాహం వేగవంతమై పురుషాంగంలోని ‘కార్పోరా కావెర్నోసా’లోని రక్త నాళాలు తెరుచుకుంటాయి. దీంతో రక్తం అందులోకి ప్రవేసించి నరాలు, రక్తనాళాల్లో స్థిరపడి.. కండరాలను బలోపేతం చేస్తుంది. ఫలితంగా అంగస్తంభన ఏర్పడుతుంది. వీర్య స్కలనం కాగానే.. మళ్లీ యథాస్థితికి చేరుతుంది.


Also Read: పొట్టివాళ్లు గట్టోళ్లా? ఎత్తు పెరిగితే ‘అంగ స్తంభన’ సమస్యలు? తాజా స్టడీలో షాకింగ్ ఫలితాలు