World Oral Health Day 2024 : దంత సంరక్షణ ప్రాముఖ్యత గురించి చెప్తూ.. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 20వ తేదీన ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నోటి వ్యాధుల సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దీనిని నిర్వహిస్తున్నారు. ఏటా చాలామంది నోటి శుభ్రత పాటించకపోవడం వల్ల వివిధ అనారోగ్యాల బారిన పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. వీటికి చెక్ పెట్టాలని, ఓరల్ హెల్త్ మీద అవగాహన కల్పించాలని ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఈ డేని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు.. దంత సంరక్షణలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవం చరిత్ర (World Oral Health Day History)
ప్రపంచ ఓరల్ హెల్త్ డే అనేది FDI వరల్డ్ డెంటల్ ఫెడరేషన్ ముందుకు తీసుకొచ్చింది. దంత సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరింది. దీంతో 2007లో ప్రపంచ నోటి ఆరోగ్య దినోత్సవాన్ని ప్రకటించారు. మొదట్లో సెప్టెంబర్ 12వ తేదీన ఈ డేని జరుపుకునే వారు. FDI వ్యవస్థాపకుడు డాక్టర్ చార్లెస్ గోడన్ పుట్టిన రోజుగా సెప్టెంబర్ 12వ తేదీని వరల్డ్ ఓరల్ డే నిర్వహించేవారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ తేదీని మార్చి 20కి మార్చారు. 2013 నుంచి దీనిని కంటిన్యూగా మార్చి 20వ తేదీనే నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యంపై దృష్టి సారించాలనే లక్ష్యంతో ఈ డేని నిర్వహిస్తున్నారు.
ఓరల్ హెల్త్‌ని ఎలా పరిగణిస్తారంటే..
వయసు వారీగా ఎన్ని దంతాలుండాలంటే..
అసలు ఓరల్ హెల్త్ బాగుందని ఎలా పరిగణిస్తారు అనే ప్రశ్న అందరిలో ఉంటుంది. వృద్ధులు ఓరల్ హెల్తీగా ఉన్నారని ఎలా గుర్తించాలంటే వారికి 20 సహజమైన దంతాలు కలిగి ఉండాలి. పిల్లలకు 20 పళ్లు ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యక్తు కు మొత్తం 32 పళ్లు ఉండాలి. ఉన్నవి కూడా పిప్పళ్లు లేనివై ఉండాలి. ఈ కౌంట్ అనేది మార్చి 20వ తేదీని సూచిస్తుంది. 3వ నెల, 20వ రోజు దీనినే ప్రతిబింబిస్తుందని చెప్తారు.
ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి..
నోటి వ్యాధులు అనేక దేశాలలో ప్రధాన ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. ప్రజలను జీవితాంతం అవి ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి. నోటి వ్యాధులు నొప్పి, అసౌకర్యం, సామాజిక ఒంటరితనం, ఆత్మవిశ్వాసం కోల్పోవడానికి దారి తీస్తున్నాయి. అంతేకాకుండా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ముడిపడి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. అయితే కొన్ని నోటి సమస్యలను నివారించవచ్చు. మరికొన్ని సమస్యలను ఆదిలోనే చికిత్స అందించి కంట్రోల్ చేయవ్చచు. ఈ విషయాన్నే తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ వ్యాప్తంగా వరల్డ్ ఓరల్ డేని నిర్వహిస్తున్నారు.
నోటి ఆరోగ్య దినోత్సవంపై ఇలా అవగాహన కల్పించాలంటే..
ఓరల్ హెల్త్ గురించి ఎంత అవగాహన కల్పించినా(Purpose of Oral Health Day).. వ్యక్తులు వ్యక్తిగత చర్యలు కచ్చితంగా తీసుకోవాలి. నోటి ఆరోగ్యం గురించి చిన్ననాటి నుంచి అవగాహన కల్పించాలి. పాఠశాలల్లో దీని గురించి ప్రత్యేక తరగతులు తీసుకోవాలి. నోటి ఆరోగ్య నిపుణులు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రయత్నాలు చేయాలి. ఇలాంటి చర్యలన్నీ మెరుగైన నోటి ఆరోగ్యాన్ని అందిస్తాయి. తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. టీ, కాఫీలు వంటివి దంతాల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. కాబట్టి అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ కూడా దంతాలకు హాని చేస్తాయి. అంతేకాకుండా ప్రతి ఆరునెలలకు ఓసారి దంత వైద్యుడి దగ్గరకు వెళ్లాలి. దంత సమస్యలుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇవన్నీ నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి.
Also Read : మీరు జీవితంలో ఎంత వరకు ఆనందంగా ఉన్నారు? హ్యాపీనెస్ స్పెక్ట్రమ్‌లో మీరు ఎక్కడ ఉన్నారు? తెలుసుకోండి