Ambani Family Diet Plan: ఆసియాలో అత్యంత ధనవంతుల్లో ఒకరైన లేదా ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన ఇంటి గురించి విన్నప్పుడు, మనస్సులో షాంపైన్, కేవియర్, ప్లేట్‌లపై కళాకృతులుగా కనిపించే ఫాన్సీ డిన్నర్‌ల చిత్రం ఏర్పడుతుంది. కానీ ఇక్కడే ముఖేష్ అంబానీ, నీతా అంబానీ ఆ ఊహను రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నారు. 27 అంతస్తుల యాంటిలియా, హెలిప్యాడ్‌లు, 600 మంది సిబ్బందితో కూడిన జీవితం మధ్య కూడా, వారి ఆహారం ఆశ్చర్యకరంగా చాలా సాధారణమైంది.  గృహ సంబంధమైంది, హై-ఫై కాదు, పూర్తిగా సింపుల్‌ శైలి.

Continues below advertisement

ముఖేష్ అంబానీ ఇప్పటికీ తన మూలాలను మర్చిపోలేదు. భారీ వ్యాయామం చేయకుండానే దాదాపు 15 కిలోల బరువు తగ్గారు, కానీ ఆ తర్వాత కూడా ఆయన ఆహారం చాలా సింపుల్,ఇంటిదై ఉంటుంది. అదే సమయంలో, నీతా అంబానీ కూడా అంతే క్రమశిక్షణతో ఉంటారు, ఆమె తేలికపాటి, శాకాహార ఆహారాన్ని ఇష్టపడతారు. కొన్నిసార్లు స్ట్రీట్‌ ఫుడ్‌ ఆస్వాదించకుండా ఉండరు. ముఖేష్ అంబానీ ఇంట్లో ఏం వండుతారో ఇక్కడ చూద్దాం. 

ఆదివారం ఇడ్లీ-సాంబార్

టిఫిన్‌ విషయానికి వస్తే, ముఖేష్ అంబానీ దక్షిణాది రుచుల వైపు మొగ్గు చూపుతారు. ప్రతి ఆదివారం, వారి ఇంట్లో ఇడ్లీ-సాంబార్ ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఇది ఆయన కళాశాల రోజులను గుర్తుకు తెచ్చే ఒక సంప్రదాయం వంటకం. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఇంటి వెలుపల ఆయనకు ఇడ్లీ-సాంబార్ ఎక్కువగా నచ్చిన ప్రదేశం ముంబైలోని మటుంగాలోని కేఫ్ మైసూర్. ఆయన కళాశాల ICT సమీపంలో ఉన్న ఈ ప్రదేశం ఇప్పటికీ అభిమాన ప్రదేశం.

Continues below advertisement

రోజువారీ గుజరాతీ దాల్

అంబానీ కుటుంబం ఆహారంలో రాజీపడేది ఏదైనా ఉంటే, అది దాల్. ముఖ్యంగా గుజరాతీ శైలిలో తయారు చేసిన తీపి-ఉప్పు దాల్. DNA నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ ఒక గిన్నె దాల్ లేకుండా తన రోజును ముగించరు. ప్రపంచంలోని ఏ లగ్జరీ ఫుడ్ కూడా ఆయనకు ఈ రోజువారీ గృహ దాల్ ఇచ్చినంత సంతృప్తిని ఇవ్వదు.

రోటీ-రాజ్మా

అంబానీ కుటుంబంలో తరచుగా రాజ్మా, రోటీ వడ్డిస్తారు. ధాన్యాలు, బియ్యం, సాధారణ రొట్టె ఎక్కువగా తింటారు.  ఇవన్నీ వారి రోజువారీ ఆహారంలో భాగం. ఇంత రిచ్‌ కుటుంబం ఇంత సాధారణ భోజనం, నిజమైన సౌకర్యం కొన్నిసార్లు చాలా  చిన్న విషయాల్లోనే దొరుకుతుందని చూపిస్తుంది.

దహీ-బటాటా పూరి

స్ట్రీట్ ఫుడ్‌ కూడా అంబానీ కుటుంబం ప్లేట్‌లో స్థానాన్ని కలిగి ఉంది. దీనిని నీతా అంబానీ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో, ముఖేష్ అర్ధరాత్రి కాఫీ లేదా పగటిపూట స్నాక్స్ కోసం బయటకు వెళ్లమని సూచిస్తారని ఆమె చెప్పారు. ఆయన దహీ-బటాటా పూరి స్నాక్‌గా తీసుకుంటారు.  

భేల్

దహీ పూరి ఒక మినహాయింపు అని మీరు అనుకుంటే, కాదు. ముఖేష్ అంబానీకి భేల్ కూడా చాలా ఇష్టం, అదే తేలికపాటి, పుల్లని-తీపి, మసాలా రుచి కలిగిన సాధారణ భేల్. ఆయన బిజీ షెడ్యూల్‌లో త్వరగా తినగలిగే స్నాక్ గా ఇది ఉంటుంది.