Watermelon and Muskmelon for Summer : వేసవికాలంలో ఎక్కువమంది తినే ఆహారాలలో పుచ్చకాయలు, ఖర్బూజలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వేడిని తగ్గించి.. డీహైడ్రేషన్ సమస్యలను దూరం చేస్తాయి. వీటిలో నీటి శాతం ఎక్కువగా ఉండడంతో పాటు.. శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. అందుకే వీటిని తినడం ఆరోగ్యానికి మంచిదిగా చెప్తారు. అయితే వేసవిలో పుచ్చకాయ తింటే మరింత లాభమా? లేదా ఖర్బూజను ఎక్కువగా తీసుకోవాలా? ఏది ఎక్కువ మంచిదో.. దేనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో చూసేద్దాం. 

Continues below advertisement

ఖర్బూజ బెనిఫిట్స్..

ఖర్బూజలో విటమిన్ ఎ, సి సమృద్ధిగా ఉంటాయి. ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. దీనిలో నీరు 90 శాతం ఉంటుంది. దీనిని సమ్మర్లో తినడం వల్ల కంటి ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అలాగే జీర్ణక్రియకు మంచిది. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు.. స్కిన్ హెల్త్ని మెరుగు పరుస్తుంది. ఖర్బూజలో ఉండే ఫైబర్ వల్ల కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి బరువు తగ్గడానికి కూడా హెల్ప్ చేస్తుంది.

పుచ్చకాయ ప్రయోజనాలు..

పుచ్చకాయలో 92 శాతం నీరు ఉంటుంది. దీనిలో కూడా విటమిన్ ఎ, సి ఉంటాయి. లైకోపిన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. వేసవిలో దీనిని తినడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. హీట్ స్ట్రోక్ నుంచి రక్షిస్తుంది. గుండె ఆరోగ్యానికి కూడా మంచిది. శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉండటం వల్ల వేసవిలో డీహైడ్రేషన్‌ సమస్య దూరమవుతుంది. 

Continues below advertisement

పుచ్చకాయ vs ఖర్బూజ

మీరు సమ్మర్లో హైడ్రేషన్ ఎక్కువగా కావాలనుకుంటే వాటర్‌మెలన్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. సమ్మర్లో వచ్చే జీర్ణ సమస్యలను దూరం చేసుకోవాలనుకుంటే.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడం కోసం మస్క్‌మెలన్ మంచిది. అలాగే వేసవిలో కూల్​గా ఉండేందుకు రెండూ మంచివే. 

తినేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

పుచ్చకాయ, ఖర్బూజ రెండూ ఆరోగ్యానికి మంచివే. అయితే ఒకేసారి ఎక్కువగా తినకపోవడమే మంచిది. తక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది. అలాగే డయాబెటిస్ ఉన్నవారు తగ్గించి తినాలి. పుచ్చకాయ అయినా, ఖర్బూజ అయినా కట్ చేసిన వెంటనే తినడం మంచిది. ఫ్రిడ్జ్​లో పెడితే 24 గంటల్లోపు తినేయాలని అంటున్నారు. వీటిని జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. కానీ షుగర్ వేసుకోకుండా చేసుకుంటే మంచిది. నేరుగా తినడం ఇష్టం లేనివారు, కుదరలేని వారు.. జ్యూస్​ల రూపంలో తీసుకోవచ్చు. అలాగే ప్యాక్డ్​ డ్రింక్స్​ కాకుండా.. తాజాగా చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. 

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.