అధిక కొలెస్ట్రాల్ చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. కొవ్వు పదార్థాలు తినడం, తగినంత వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు, ధూమపానం, మద్యం సేవించడం వల్ల మొత్తం ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల అధిక కొలెస్ట్రాల్ సమస్య ఒక్కటే కాదు మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే పోషకాహారం తీసుకునేటప్పుడు కొలెస్ట్రాల్ తగ్గించే ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. కొవ్వుని తగ్గించుకోవాలనుకుంటే మీకు ఉత్తమమైన ఎంపిక సత్తు పిండి లేదా బెంగాల్ గ్రామ్. పేదవాడి ప్రోటీన్ సత్తు పిండిని భారతదేశంలో బీహార్, జార్ఖండ్, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ వంటి అనేక ప్రాంతాల్లో బాగా ప్రాచుర్యం పొందింది. అధిక ప్రోటీన్లు ఉండటం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ గా పరిగణిస్తారు.


కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది


సత్తుతో తయారు చేసిన పానీయం వేసవిలో దాహాన్ని తీర్చడమే కాకుండా సహజంగా కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం సత్తులో మెగ్నీషియం, ఐరన్. మాంగనీస్, కాల్షియంతో నిండి ఉంది. ఇది తక్కువ-గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం. మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఇది గొప్ప ఎంపిక. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది, రక్తపోటును నియంత్రిస్తుంది. సత్తులో అధిక పీచు (18 గ్రాములు) ఉండటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచడానికి ఒక గొప్ప మార్గం.


చెడు కొలెస్ట్రాల్ ని వదిలించుకోవడం కోసమా చియా గింజలతో పాటు సత్తు పొడిని మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ఈ పానీయం ధమనులను శుభరపరచడానికి కూడా సహాయపడుతుంది. ఇందులోని ఫిబర్ రక్తనాళాలను శుభ్రపరిచి, రక్త ప్రసారం మెరుగు పరుస్తుంది.


వేసవిలో సత్తు తాగడం వల్ల ప్రయోజనాలు


బరువు తగ్గుతారు


ఇందులో కేలరీలు తక్కువ. ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. జీవక్రియను పెంచుతుంది.


చర్మానికి మేలు


రోజూ సత్తుని తాగడం వల్ల చర్మం సహజంగా మెరుస్తుంది. హైడ్రేషన్ ఇస్తుంది. ఐరన్ పుష్కలంగా ఉంది. జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో సత్తుని తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ, పేగు కదలికలు మెరుగుపడతాయి. ఇందులో కరగని ఫైబర్ ఉంటుంది. పెద్ద పేగును శుభ్రపరిచి ఎసిడిటీ, వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.


సత్తు డ్రింక్ ఇలా చేయండి


అధిక కొలెస్ట్రాల్ రొగులు గరిష్ట ప్రయోజనాలు పొందటానికి సత్తు డ్రింక్ తాగితే మంచిది. ఒక టేబుల్ స్పూన్ సత్తు పౌడర్ లో రాత్రంతా నానబెట్టిన చియా గింజలు కలపాలి. దీనిలో ఫైబర్ ఉంటుంది. అందులో చిటికెడు నల్ల ఉప్పు, నిమ్మరసం వేయాలి. దీన్ని బాగా మిక్స్ చేసి ప్రతిరోజూ ఉదయం తాగితే మంచి ఫలితాలు పొందుతారు.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: కౌమారదశలో ఉన్నవాళ్ళు వీటిని తిన్నారంటే మీ మెదడు పనితీరు భేష్