ఈ భూమ్మీద ఉన్న తెలివైన జంతువుల్లో కోతి టాప్ ప్లేస్ లో ఉంటుంది. కోతి అచ్చం మనిషి మాదిరిగానే ఆలోచిస్తుంది. 90 శాతానికి పైగా మనిషి చేసే పనులన్నీ కోతి జాతి  చేస్తుంది. చరుచుగా జనాల దగ్గర ఉన్న తినుబండారాలను దొంగిలించడంలో ఎంతో తెలివిని ప్రదర్శిస్తుంది. కొన్నిసార్లు కోతులు ఫోన్లు, కళ్లజోళ్లు, ఇతర వస్తువులను లాక్కొని వెళ్తుంటాయి.  ఎక్కువ శాతం ఆహార పదార్థాలను దొంగిలిస్తుంటాయి. అప్పుడప్పుడు ఇళ్లలోకి చొరబడి రకరకాల వస్తువులను దోచుకెళ్తుంటాయి. పండ్లు సహా ఇతర పదార్థాలను తీసుకెళ్తుంటాయి.   


చాలా సార్లు, కోతులు దేవాలయాలు, పార్కుల దగ్గర పర్యాటకుల నుంచి  ఆహారాన్ని స్వైప్  చేయడం గమనిస్తుంటాం. చిప్స్, పండ్లను తీసుకొని పారిపోతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి బ్యాగ్ నుంచి  ఓ కోతి ఆపిల్ పండును  చాలా తెలివిగా దొంగతనం  చేసి పారిపోయే వీడియో సోషల్ మీడియాలో బాగా  వైరల్ అవుతున్నది. ఓ వ్యక్తి తన వీపుకు బ్యాగును తగిలించుకుని ఉన్నాడు. అందులో కొన్ని ఆపిల్ పండ్లు ఉన్నాయి. పార్కులో కూర్చుని పరిసరాల అందాలను చూస్తూ ఉన్నాడు. అక్కడే ఉన్న ఓ కోతి ఆ బ్యాగ్ దగ్గరికి వస్తుంది. బ్యాగులో తినడానికి ఏమైనా ఉన్నాయేమోనని అనుమానంతో  ముందుగా బ్యాగ్ జిప్ ఓపెన్ చేస్తుంది. అందులో  ఏమీ ఉండవు. అక్కడితో ఆగిపోకుండా.. మరో జిప్ ను ఓపెన్ చేస్తుంది. అందులో యాపిల్స్ కనిపిస్తాయి. కోతికి ఎక్కడ లేని సంతోషం కలుగుతుంది. వెంటనే చేతిని లోపలికి పెట్టి ఓ ఆపిల్ పండును తీసుకుంటుంది. సైలెంటుగా అక్కడి నుంచి పరుగులు తీస్తూ పారిపోతుంది.





కోతి దొంగతనం వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'waowafrica' అనే వినియోగదారు షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.  కోతి అత్యంత  నిపుణత కలిగిన దొంగలా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రకరకాల ఫన్నీ కామెంట్స్ హాస్యపు జల్లులు కురిపిస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియోను 103k మంది చూశారు. వందల సంఖ్యలు కామెంట్స్ వస్తున్నాయి. కోతి తెలివి పట్ల నెటిజన్లు అవాక్కవుతున్నారు.