Common Sense : కామన్ సెన్స్ అనేది నాట్ కామన్​. నిజమే ఇది అందరికీ ఉండాలని రూల్ లేదు. అలాగే అందరి నుంచి దీనిని ఎక్స్​పెక్ట్ కూడా చేయకూడదు. అలా చేస్తున్నామంటే మనకి కామన్ సెన్స్ లేనట్టే. అయితే ఇది లేకపోతే మాత్రం కష్టాలు కొని తెచ్చుకున్నట్లే. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ ప్రతి సంవత్సరం అమెరికాలో Use Your Common Sense అంటూ స్పెషల్​గా ఓ Dayని నిర్వహిస్తున్నారు. 

Continues below advertisement


కామన్ సెన్స్ డే చరిత్ర


అమెరికన్ కమెడియన్ విల్ రోజర్స్ జ్ఞాపకార్థం నిమిత్తం ప్రతి సంవత్సరం నవంబర్ 4వ తేదీన దీనిని జరుపుతున్నారు. “Common Sense అనేది చాలా rare అయిపోయింది” అనే విల్ చెప్పిన మాటను హైలెట్ చేస్తూ దీనిని నిర్వహిస్తున్నారు. కామన్ సెన్స్ ఎంత అవసరమో చెప్తూ.. దానిని కనీసం ఉపయోగించాల్సిన సమయాన్ని చెప్తూ ఈ స్పెషల్ డే చేస్తున్నారు. 


నిజానికి కామన్ సెన్స్ అనేది చదువుకున్న వాళ్లకి మాత్రమే ఉంటుందని చెప్పలేము. అలాగని చదువుకోని వాళ్లకి ఉండదా అంటే అది కూడా పూర్తిగా తప్పే. పరిస్థితులను అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసుకునేవాళ్లు చదువున్నా.. లేకున్నా మూర్ఖులే. కాబట్టి దీనిని అందరి నుంచి కోరుకూడదు. అలాగే ఇది ఒకరి నుంచి నేర్చుకునేది కూడా కాదు. మనకి మనమే రియలైజ్ అవ్వాలి. అది ఎవరికి, ఎప్పుడు వస్తుందని చెప్పలేము. అయితే ఎలాంటి విషయాల్లో కచ్చితంగా కామన్ సెన్స్ వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


కామన్ సెన్స్ అంటే అర్థమిదే..


మన చేసే పనుల్లో ప్రాక్టికల్​గా ఆలోచించి.. సింపుల్ లాజిక్​తో.. పరిస్థితికాంప్లికేటెడ్​గా కాకుండా నిర్ణయాలు తీసుకోవడమే కామన్ సెన్స్. దీనివల్ల మనకి, ఎదుటివారికి కూడా ఇబ్బంది కలుగకుండా ఉండాలి. రోజువారీ పరిస్థితులకు అనుగుణంగా.. అనుభవాలతో మంచి నిర్ణయం తీసుకోవాలని ఇది సూచిస్తుంది. మరి ఎలాంటి విషయాల్లో కచ్చితంగా కామన్ సెన్స్ ఉపయోగించాలో ఇప్పుడు చూసేద్దాం. 


కామన్ సెన్స్ ఎప్పుడు ఉపయోగించాలంటే..


ఏదైనా అనుకోని పరిస్థితి ఎదురైనప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవాలంటే కామన్ సెన్స్ కచ్చితంగా వాడాలి. తక్కువ సమయంలో తీసుకున్నా సరే అది మీకు లేదా ఇతరులకు ఇబ్బంది కలిగించనిదై ఉండేలా మీ నిర్ణయం ఉండాలి. నలుగురిలో ఉన్నప్పుడు.. ఏదైనా ఇబ్బంది ఎదురవ్వడం లేదా ఏదైనా సమస్యను దూరం చేయడానికి కామన్ సెన్స్ వాడాలి. 


పనిలో, రిలేషన్​షిప్స్​లో, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసేప్పుడు, రోజువారీ కార్యకలాపాల్లో ఆఖరికి సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కూడా దీనిని ఉపయోగించాలి. కొన్ని వార్తలు నమ్మాలా వద్దా? కొన్ని నమ్మకాలు, స్కామ్స్, ఆరోగ్యం, డబ్బు వంటి ఎన్నో విషయాల్లో దీనిని ఉపయోగించాల్సి ఉంది. దీనిని సరైన సమయంలో.. సరైన విధానంలో వాడకపోతే.. సెన్స్​లేని రిజల్ట్స్ మీ లైఫ్​లోకి వస్తాయని గుర్తించుకోవాలి. ఎందుకంటే మీరు ఎంత తెలివైనా, ఎంత డబ్బున్నా.. కామన్ సెన్స్ లేకపోతే.. దానికి సెన్సే ఉండదు.