Tasty Rava Dosa Recipe : మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​ని త్వరగా, టేస్టీగా సిద్ధం చేసుకోవాలనుకుంటే మీరు సొరకాయతో క్రిస్పీ రవ్వ దోశలను ట్రై చేసుకోవచ్చు. అవును రవ్వ దోశలకు బదులుగా మీరు వీటిని ట్రై చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతాయి. మరి ఈ టేస్టీ, క్రిస్పీ, సింపుల్ రవ్వ దోశలను ఎలా తయారు చేసుకోవాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు 

సొరకాయ - 500 గ్రాములు

నీరు - 1 కప్పు

బియ్యం పిండి - ఒకటిన్నర కప్పు

రవ్వ - అర కప్పు

నీరు - 1 కప్పు

క్యారెట్ - 4 టేబుల్ స్పూన్లు (తురుము)

ఉల్లిపాయలు - 4 టేబుల్ స్పూన్లు 

జీలకర్ర - 1 టీస్పూన్

అల్లం తురుము - 1 టీస్పూన్

కరివేపాకు - 10

పచ్చిమిర్చి - 2

కొత్తిమీర - గుప్పెడు

సాల్ట్ - రుచికి తగినంత 

నీరు - 4 కప్పులు

తయారీ విధానం

ముందుగా సొరకాయ పైన తొక్కను తీసేయాలి. దానిని మధ్యలోకి కోసి సీడ్స్​ని తీసేయాలి. ఇది కచ్చితంగా చేయాలి. ఇప్పుడు వాటిని ఐస్​ ముక్కలుగా కోసుకోవాలి. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవి బాగా గ్రైండ్ అయ్యేందుకు ఓ కప్పు నీటిని కలిపి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దానిని పెద్ద మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో బియ్యం పిండి వేసి కలపాలి. మరో కప్పు నీటిని వేసి.. బియ్యం పిండి ముద్దలుగా లేకుండా కలపాలి. దీనిని పది నిమిషాలు పక్కన పెట్టాలి. 

ఇప్పుడు క్యారెట్​ను సన్నగా తురుముకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కోసుకోవాలి. అల్లం, కొత్తిమీర, కరివేపాకును సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమంలో మరో 4 కప్పుల నీటిని వేసి.. బాగా కలపాలి. దానిలోనే క్యారెట్ తురుము, ఉల్లిపాయ ముక్కలు, అల్లం, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు దానిలో సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడేంత సాల్ట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. 

స్టౌవ్ వెలిగించి దానిపై తవా పెట్టాలి. దానిపై కాస్త నూనె వేసుకుని.. వేడి అవ్వనివ్వాలి. అది బాగా వేడి అయిన తర్వాత ముందుగా తయారు చేసుకున్న మిశ్రమాన్ని బాగా కలిపి పోయాలి. సన్నగా మిశ్రమాన్ని గ్యాప్ లేకుండా పోసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్​ని మీడియంలో పెట్టి కాస్త నూనె వేసి ఫ్రై చేయాలి. ఇలా చేసిన తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు, కరకరలాడేలా వండుకుని దించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ క్రిస్పీ దోశ రెడీ.

ఈ దోశలను కొబ్బరి చట్నీతో లేదా టమాటా చట్నీతో కలిపి తినొచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. టేస్టీగా, హెల్తీగా మీ మార్నింగ్​ని స్టార్ట్ చేయాలనుకుంటే మీరు ఈ టేస్టీ, క్రిస్పీ దోశలను ట్రై చేయవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు ఈ టేస్టీ రెసిపీని ట్రై చేసి.. ఆస్వాదించేయండి.