Trisha Krishnan 43rd Birthday : తెలుగు, తమిళ సినిమాల్లో అందానికి మారుపేరుగా నిలిచింది త్రిష కృష్ణన్. ఆమె వయసు పెరిగే కొద్దీ.. మరింత యంగ్​గా మారుతుంది ఈ బ్యూటీ. మే 4, 1983లో పుట్టిన ఈ భామ.. నేటితో 42 ఏళ్లు దాటి.. 43లోకి అడుగు పెట్టంది. కానీ లుక్స్​లో మాత్రం 23ని తలపిస్తుంది ఈ భామ. మరి ఈ గ్లామర్ క్వీన్ ఫాలో అయ్యే బ్యూటీ టిప్స్, స్కిన్ కేర్ సీక్రెట్స్ ఏంటో.. అవి ఆమెను యంగ్​గా ఉండడానికి ఎలా హెల్ప్ చేస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

Continues below advertisement

హైడ్రేషన్ 

త్రిష రోజూ కనీసం 4 లీటర్ల నీళ్లు తాగుతుంది. ఇది ఆమె స్కిన్​ని హైడ్రేటెడ్​గా, ప్లంప్​గా ఉంచుతుంది. దీనికి తోడు ఆరెంజ్ జ్యూస్, దానిమ్మ జ్యూస్, గ్రీన్ టీ కూడా తాగుతుంది. గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. టీ, కాఫీలు తీసుకోదు. 

స్కిన్ గ్లో సీక్రెట్

విటమిన్ సి పుష్కలంగా ఉండే ఫుడ్స్ తీసుకుంటుంది. సిట్రస్ ఫ్రూట్స్ అంటే నిమ్మకాయ, ఆరెంజ్ తీసుకుంటే స్కిన్​లో చాలా మంచి మార్పులు వచ్చాయని తెలిపింది త్రిష. స్కిన్ గ్లో చేయడంతోపాటు, కళ్లు కూడా మంచిగా ఉంటాయని తెలిపింది.

Continues below advertisement

స్కిన్ కేర్ బేసిక్స్

త్రిష స్కిన్ కేర్ రొటీన్ చాలా సింపుల్​గా ఉంటుంది. క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ బాగా ఫాలో అవుతుంది. డీప్ క్లెన్సింగ్, మాయిశ్చరైజింగ్, సన్ ప్రొటెక్షన్ స్కిన్ కేర్​లో కీలకమైనవని చెప్తోంది. నేచురల్, కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుందట. 

ఫిట్ నెస్ ఫ్రీక్

త్రిష ఫిట్​నెస్​కి బాగా ప్రయారిటీ ఇస్తుంది. యోగా, పైలేట్స్, డాన్సింగ్ రెగ్యులర్​గా చేస్తుంది. వ్యాయామం వల్ల కొల్లాజెన్ ప్రొడక్షన్ పెరిగి.. స్కిన్ టైట్​గా, గ్లోయింగ్​గా మారుతుందని నమ్ముతుంది. ఫ్రీహ్యాండ్ ఎక్సర్సైజ్, కార్డియో, స్విమ్మింగ్ కూడా చేస్తుంది.

నిద్రే ప్రధానం

రాత్రి 7 నుంచి 8 గంటలు నిద్ర ఉండేలా చూసుకుంటుంది. దీనివల్ల స్కిన్ ని రిఫ్రెష్​గా, గ్లోయింగ్​గా అవుతుందని చెప్తుంది. 

నో జంక్ ఫుడ్

జంక్ ఫుడ్ పూర్తిగా మానేసి.. న్యూట్రిషన్ అధికంగా ఉండే హెల్తీ మీల్స్ తింటుంది. బ్రేక్ ఫాస్ట్ హెవీగా తీసుకుంటుందట. అవి రోజంతా ఎనర్జీ ఇస్తాయని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

స్ట్రెస్ మేనేజ్మెంట్

మెడిటేషన్, రీడింగ్, ఫ్యామిలీతో సమయం గడపడం ద్వారా ఒత్తిడి అదుపులోకి తెచ్చుకుంటానని తెలిపింది. స్ట్రెస్ వల్ల ముఖం మీద ఫైన్ లైన్స్, డల్ స్కిన్ వస్తాయని కాబట్టి వీలైనంత వరకు ఒత్తిడి తగ్గించుకోవాలని తెలిపింది. 

లెస్ ఈజ్ మోర్!

త్రిష హెవీ మేకప్ వాడదు. ఐలైనర్, లిప్ బామ్​తో సింపుల్ లుక్ మెయింటెయిన్ చేస్తుంది. ఇది స్కిన్​కి మంచిది. రెగ్యులర్ లుక్ కోసం ఫౌండేషన్​తో పాటు ఐలైనర్, మాస్కారా, లిప్ గ్లాస్ వాడుతుంది.