Travel Insurance For Financial Covarage : ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు సేఫ్టీ అనేది ప్రధాన అంశంగా ఉండాలి. ఇండియాలో లేదా ఇతర ఏ ప్రాంతానికి వెళ్లినా.. యాక్సిడెంట్స్ వల్ల నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అందుకే ట్రావెల్ ఇన్సూరెన్స్‌పై ఇన్వెస్ట్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. అసలు ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఎలాంటి పాలసీ తీసుకుంటే మంచిది వంటి విషయాలు ఇప్పుడు చూసేద్దాం.
ట్రావెల్ ఇన్సూరెన్స్..
ప్రయాణ బీమా అనేది జర్నీలో జరిగే అనుకోని ప్రమాదాల నుంచి మీకు భద్రతనిస్తుంది. మెడికల్ ఎమర్జెన్సీలు, ఫ్లైట్ క్యాన్సిల్, లగేజ్ మిస్ అయినప్పుడు, ఇతర ప్రయాణ సంబంధిత నష్టాలకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా కవరేజ్‌ని ఇస్తుంది. అందుకే సరైన పాలసీని మీరు ఎంచుకుంటే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రీమియడం యాడ్ ఆన్స్‌తో మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.
ఎలాంటివి ఎంచుకోవాలంటే..
మీరు ప్రయాణాలు చేసేప్పుడు తగిన ట్రావెల్ ఇన్సూరెన్స్‌తో ఆర్థికంగా స్ట్రాంగ్‌గా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. అనుకోని ప్రమాదం ఎదురైతే ఇవి మీకు హెల్ప్ చేస్తాయి. ఇండియాలో చాలా కంపెనీలు ఈ ఇన్సూరెన్స్‌ని అందిస్తున్నాయి. అయితే వీటిని ఎంచుకునేప్పుడు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకోవాలంటున్నారు. అవేంటంటే..
పాలసీని అందించే ప్రొవైడర్స్.. ఒక్కొక్కరు ఒక్కో రకమైన బెనిఫిస్ అందిస్తారు. అయితే మీ ప్రయాణ అవసరాలకు ఏది ఉత్తమైనదో గుర్తించాలి. మీ జర్నీలో మీకు వేటినుంచి కవరేజ్ కావాలో ఎంచుకోవాలి. ప్రతి పాలసీకి సంబంధించిన నిర్దిష్ట కవరేజ్ ఎంత, వాటి లిమిట్స్ వంటివి తెలుసుకోవాలి.
మెడికల్ కవరేజ్
అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం మెడికల్ కవరేజ్‌ని చెక్ చేసుకోవాలి. రవాణా, ఆస్పత్రిలో చేరడంతో పాటు.. వైద్య ఖర్చులను కవర్ చేసే ప్లాన్‌ని చూసుకోవాలి. తగిన కవరేజ్ లేకుంటే ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఇది కీలకం.
క్యాన్సిలేషన్
ట్రిప్ క్యాన్సిల్ చేసుకున్నా.. ఏ ఇతర కారణాలతో అయినా అంతరాయం కలిగినప్పుడు ఇది హెల్ప్ చేస్తుంది. ఊహించని సంఘటనల వల్ల మీ ట్రిప్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీ పెట్టుబడిని కాపాడుకోవడానికి పాలసీలో ట్రిప్ క్యాన్సిలేషన్‌ని కవర్ చేస్తుందా లేదో తెలుసుకోవాలి.
కవరేజ్ లిమిట్స్
పాలసీ కవరేజ్ లిమిట్స్ తెలుసుకోండి. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చేలా కవరేజ్ ఉందో లేదో కచ్చితంగా తెలుసుకోవాలి. ముఖ్యంగా అడ్వెంచర్స్ చేయడం వంటి యాక్టివిటీల్లో పాల్గొన్నప్పుడు వైద్య సదుపాయాలకు ఈ పాలసీ హెల్ప్ చేస్తుందో లేదో తెలుసుకోవాలి.
Also Read : లక్షద్వీప్ వెళ్లడానికి ఆ సర్టిఫికెట్ కచ్చితంగా ఉండాలి, లేకుంటే వెళ్లలేరు.. బోనస్‌గా బడ్జెట్ ఫ్రెండ్లీ టిప్స్
మరిన్ని బెనిఫిట్స్..
ట్రావెల్ చేస్తున్నప్పుడు లగేజ్ కవరేజ్ కోసం.. విమానం లేదా రైలు ఆల్యసమైతే.. అదనపు ప్రయోజనాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ప్రయాణంలో ఆటంకాలు ఎదురైనప్పుడు ఏమైనా ఇతర బెనిఫిట్స్ పొందవచ్చో లేదో చూసుకోవాలి.
ఇవే కాకుండా మీ ప్రయాణ గమ్యస్థానం, అంచనా ఖర్చుల ఆధారంగా పాలసీ తీసుకోవచ్చు. ఏయే సంస్థలు ఎలాంటి పాలసీలు ఇస్తున్నాయో.. వాటి బెనిఫిట్స్‌లో మీకు ఏది బెస్టో తెలుసుకోవాలి. ఆన్లైన్లో ఈ ట్రావెల్ పాలసీలు తీసుకుంటే మంచి డీల్స్ సొంతం చేసుకోవచ్చు. క్లైయిమ్ చేసుకునేప్పుడు బెనిఫిట్స్ పెంచుకోవడానికి తగ్గింపులు తక్కువగా ఉండే పాలసీలు ఎంచుకోవాలి. పాలసీ కింద కవర్ కానీ అంశాలు ఏంటో కచ్చితంగా తెలుసుకోవాలి. ఇవన్నీ మీరు బెస్ట్ ట్రావెల్ పాలసీని ఎంచుకోవడంలో హెల్ప్ చేస్తాయి.
Also Read : మహా కుంభ మేళా 2025కు ప్రయాగ వెళ్తున్నారా? అయితే భక్తులు కచ్చితంగా ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే