Top 5 Most Expensive Phones in the World : సాధారణంగా ఎవరైనా ముప్పై వేల నుంచి 50 వేల ఫోన్ వాడితే రిచ్ అంటూ టీజ్ చేస్తూ ఉంటాము. అదే లక్ష లేదా అంతకు మించి ఎక్కువ పెట్టి ఫోన్ కొంటే ఇంక మాటల్లేవు. మీరంటే రిచ్ బ్రో అనేస్తాము. ఐఫోన్, శామ్​సంగ్ వంటి ఫోన్స్ ఈ బడ్జెట్​లో ఉంటాయి. వీటిని కూడా కొందరు తమ తాహాతకు మించి అయినా సరే కొనేస్తారు. ఈఎంఐల రూపంలో అయినా ఈ ఫోన్స్ తీసుకోవాలని చూస్తారు. మరికొందరికి అవి విష్​ లిస్ట్​లోనే ఉంటాయి. మనం ఇవే రిచ్ అనుకుంటే.. కోట్లు ఖర్చు పెట్టి ఫోన్స్ కొనేవాళ్లని ఏమనాలి అంటారు. మే బి అపర కుబేరులు అనొచ్చేమో. ఎందుకంటే కొందరు 300 నుంచి 400 కోట్ల విలువైన ఫోన్స్ కొన్న వాళ్లు కూడా ఉన్నారు. మరి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న టాప్ 5 సూపర్ కాస్ట్లీ ఫోన్స్ ఏంటో.. అవి ఎవరి దగ్గర ఉన్నాయో.. ఇప్పుడు చూసేద్దాం. 

నాలుగు వందల కోట్లు..

ఫాల్కొన్ సూపర్​నోవా ఐఫోన్ 6 పింక్ డైమండ్ ఎడిషన్ (Falcon Supernova iPhone 6 Pink Diamond Edition) మోడల్. ఇది ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఫోన్‌ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. దీని ధర సుమారు 400 కోట్లుగా చెబుతున్నారు. ఈ ఫోన్‌పై 24 క్యారెట్ల బంగారు పూత ఉంటుంది. అంతేకాకుండా దాని వెనుక భాగంలో పింక్ డైెమండ్ ఉంటుంది. ఈ ఫోన్​ నీతా అంబానీ దగ్గర ఉంది. ఈమె కాకుండా ప్రపంచవ్యాప్తంగా కొందరు కుబేరులు ఈ ఫోన్‌ను యూజ్ చేస్తున్నారట. దీనిని కేవలం ఫోన్​గా మాత్రమే కాకుండా హోదాకు చిహ్నంగా చూస్తారు.

వందకోట్లు విలువైన ఫోన్ 

ఈ జాబితాలో iPhone 5 Black Diamond Edition by Stuart Hughes రెండవ స్థానంలో ఉంది. ఈ iPhone 5 Black Diamond Edition ధర సుమారు 100 కోట్లు ఉంటుందట. ఈ ఫోన్‌లో 600 బ్లాక్ డైమండ్స్, ఒక నీలమణి గాజు స్క్రీన్, 24 క్యారెట్ల బంగారం పొదిగి తయారు చేశారట. ఈ ప్రత్యేకమైన ఐఫోన్​ను ఒక చైనీస్ వ్యాపారి కొనుక్కున్నట్లు చెప్తారు.

Goldvish Le Million

సుమారు 9 కోట్ల విలువైన Goldvish Le Million ఫోన్‌లో తెల్ల బంగారం ఉపయోగించారు. అంతేకాకుండా ఈ ఫోన్‌లో 1,200 చిన్న వజ్రాలు కూడా పొదిగారట. ఒక సమయంలో ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫోన్​గా రికార్డు నెలకొల్పింది. అయితే ఈ ఫోన్ కేవలం మూడు యూనిట్లు మాత్రమే ఉన్నాయని చెప్తారు. నియర్ ఈస్ట్​లోని రాజ కుటుంబాల వద్ద ఈ ఫోన్ ఉందని చెప్తారు.

Vertu Signature Cobra

Vertu కంపెనీ లగ్జరీ ఫోన్‌లను తయారు చేయడానికి ప్రసిద్ధి చెందింది. దీనిలో Vertu Signature Cobra బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఫోన్‌లో కోబ్రా డిజైన్ ఉంటుంది. దీనిని 439 రత్నాలతో తయారు చేశారు. ఈ ఫోన్ ప్రముఖ హాలీవుడ్ నటులు, కుబేరులలో చాలామంది దగ్గర ఉంది. 

Caviar iPhone 14 Pro Max Diamond Snowflake Edition

Caviar iPhone 14 Pro Max Diamond Snowflake Edition ఫోన్ ధర సుమారు 1.3 కోట్లు. ఈ ఫోన్‌ను రష్యాకు చెందిన లగ్జరీ బ్రాండ్ కేవియర్ తయారు చేసింది. ఇందులో 18 క్యారెట్ల బంగారం, వజ్రాలు, టైటానియం ఉన్నాయి. రష్యా కుబేరులలో ఈ ఫోన్ చాలా ప్రసిద్ధి చెందింది.