అధిక ఉప్పు, చక్కెర, ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ ని ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడుతున్న ఫుడ్. వీటిని అధికంగా తినడం వల్ల గుండె, రక్త ధమనులు కష్టపడి పని చేయాల్సి వస్తుంది. ఇది కాలక్రమేణా గుండె కండరాలకి హాని కలిగించవచ్చు. కొవ్వు ఫలకం పేరుకుపోయేలా చేస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు సమస్య ఎదురవుతుంది. అనారోగ్య ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, మధుమేహం, ఊబకాయంతో సహా అనేక వ్యాధుల్ని ఇది తీసుకొస్తుంది.


అధిక రక్తపోటు సమస్యని తేలికగా తీసుకోకూడదు. ఇది గుండె జబ్బులు, స్ట్రోయిక్, మూత్రపిండ వైఫల్యంతో పాటు అనేక ప్రమాదకరమైన సమస్యలు పెంచుతుంది. అందుకే దాన్ని తప్పనిసరిగా అదుపులో ఉంచుకోవాలి. ఆహారం, జీవనశైలిలో మార్పులు చేయడంతో పాటు అనేక పానీయాలు కూడా రక్తపోటు స్థాయిలని తగ్గించడంలో సహాయపడతాయని పరిశోధనలు చెబుతున్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి.


రక్తపోటుని అదుపులో ఉంచే పానీయాలు


ఆమ్లా, అల్లం రసం: ఆమ్లా లేదా ఉసిరి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రక్తపోటు అభివృద్ధిని నిరోధిస్తుంది. అల్లంలో రక్తనాళాలు విస్తరించే వాసోడైలెష్న్ ను ప్రోత్సహించే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి రక్తనాళాలని సడలించి రక్తపోటుని తగ్గించడంలో సహాయపడతాయి.


ధనియాల నీరు: ధనియాలు లేదా కొత్తిమీర సారం మూత్ర విసర్జనగా పని చేస్తుంది. శరీరంలోని అదనపు సోడియం, వ్యర్థాలని బయటకి పంపించడంలో సహాయపడుతుంది. రక్తపోటుని తగ్గిస్తుంది.


బీట్ రూట్ టొమాటో జ్యూస్: బీట్ రూట్ ల్లో నైట్రేట్ పుష్కలంగా ఉంటుంది. దీనికి రక్తపోటుని తగ్గించే సామర్థ్యం ఉండి. నైట్రేట్, నైట్రిక్ ఆక్సైడ్ ను ఉత్పత్తి చేసి రక్తప్రవాహంలో దాని సాంద్రత పెంచుతుంది. ఎండోథెలియల్ పనితీరుని ఆప్టిమైజ్ చేస్తుంది. ఇక టొమాటో సారం లైకోపీన్, బీటా కెరోటిన్, విటమిన్ ఇ వంటి కెరొటీనాయిడ్లు కలిగి ఉంటుంది. ఇవి ప్రభావంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ నష్టాన్ని నివారిస్తుంది. సిస్టోలిక్, డయాస్టోలిక్ రక్తపోటు రెండింటినీ అదుపులో ఉంచే అద్భుతమైన గుణాలు ఈ పానీయంలో ఉన్నాయి.


ఇవే కాదు రక్తపోటుని అదుపులో ఉంచుకునేందుకు రెగ్యులర్ రొటీన్ వ్యాయామం కూడా మరింత సహాయం చేస్తుంది. బరువు తగ్గించి రక్తపోటు లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. సోడియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలకి దూరంగా ఉండాలి. దీని వల్ల రక్తపోటు పెరగకుండ ఉంటుంది. కొన్ని రకాల కూరగాయల్లో సోడియం అధికంగా ఉంటుంది. పాలకూర, మెంతి ఆకు, లెట్యూస్, జీడిపప్పు, టొమాటో ప్యూరీ, సాస్, ఊరగాయలు, ఖర్బూజ వంటి పదార్థాలలో సోడియం అధికంగా ఉంటుంది. వీటిని తింటే హై బీపీ పెరిగి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే ఈ ఆహార పదార్థాలు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే హైబీపీ మెదడు, కిడ్నీ, గుండె వంటి ప్రధానమైన అవయవాల మీద ప్రభావం చూపి ప్రాణాల మీదకు తీసుకొస్తుంది.


గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.


Also Read: హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో విసిగిపోయారా? అయితే ఈ ఫుడ్స్ తినండి


Join Us on Telegram: https://t.me/abpdesamofficial