చర్మ సంరక్షణ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ నిజానికి కాలుష్యం ఇతర కారణాల వల్ల మాత్రమే కాదు మనకి తెలియకుండా రోజు చేసే పనులు కూడా చర్మాన్ని దెబ్బ తీస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు. ఆలోచించకుండా చేసే పనులు మీ స్కిన్ ని పాడు చేస్తాయి. కాలక్రమేణా ముఖం మీద గీతలు ఏర్పడటానికి కారణం కావచ్చు. ఈ ఏడు అలవాట్లు మీ చర్మాన్ని నాశనం చేస్తాయి. చర్మం ముడతలు పడేలా చేసి వృద్ధాప్య సంకేతాలు కనిపించేలా చేస్తుంది.
స్ట్రీమ్ షవర్
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడి నీటితో స్నానం చేయడం చాలా హాయిగా అనిపిస్తుంది. కానీ వేడి నీటి స్నానం అప్పటికప్పుడు ఓదార్పుని ఇచ్చినప్పటికీ దీర్ఘకాలంలో అది ప్రభావం చూపిస్తుంది. వేడి నీరు చర్మం ఉపరితలం మీద మంటని కలిగిస్తుంది. ఫలితంగా తేమని కోల్పోతుంది. షవర్ లో ఎక్కువ సేపు గడిపినప్పుడు చేతి వేళ్ళు ఎప్పుడైనా గమనించారా? ముడతలు పడి నానిపోయినట్టుగా కనిపిస్తాయి. చర్మం పొడిగా మారుతుందని అర్థం. శరీరానికి హైడ్రేషన్ తో పాటు మాయిశ్చరైజర్ అవసరం. స్నానం చేసిన వెంటనే టవల్ తో రఫ్ గా కాకుండా సున్నితంగా తుడుచుకోవాలని చర్మ సంరక్షణ నిపుణులు సూచిస్తున్నారు.
కళ్ళు రుద్దడం
కళ్ళు పదే పదే రుద్దేయడం కొంతమందికి అలవాటు. అయితే ఇది చర్మం మీద ముడతలు తీసుకొస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే కళ్లని రుద్దకుండ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల కళ్ళపై చాలా ఒత్తిడి పడి కాలక్రమేణా చర్మం పెళుసుగా మారిపోతుంది. టగ్గింగ్ వంటి పనులు చర్మం సాగిపోయేలా చేస్తుంది. కొల్లజెన్ విచ్చిన్నతకు కారణమవుతుంది. నిరంతరం కళ్ళు రుద్దడం వల్ల చర్మం తేమని కోల్పోతుంది.
అతిగా క్లెన్సింగ్
ముఖం నుంచి మేకప్, సన్ క్రీం, ధూళిని పోగొట్టుకోవడం ఖచ్చితంగా ముఖ్యం. అందుకే రాత్రివేళ దినచర్యలో క్లెన్సింగ్ చాలా అవసరం. కానీ రోజుకు రెండు సార్లు కంటే ఎక్కువగా క్లెన్సింగ్ చేయడం వల్ల చర్మాన్ని మృదువుగా ఉంచే సహజ నూనెలు తొలగిపోతాయి. ఫలితంగా పొడిగా మారిపోతుంది. గీతలు, ముడతలు, అకాల వృద్ధాప్యానికి దారి తీసే అవకాశం ఉంది. ముఖం శుభ్రం చేసుకోవడం కోసం గోరు వెచ్చని నీటిని ఉపయోగించమని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు.
సన్ గ్లాసెస్ మరచిపోవద్దు
సన్ గ్లాసెస్ కేవలం ఫ్యాషన్ కోసం మాత్రమే కాదు సూర్యుడి నుంచి హానికరమైన యూవీ కిరణాల నుంచి కళ్లని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఎండలో ఉన్నప్పుడు వాటిని ధరించకపోతే ముడతలు, మచ్చలు ఏర్పడతాయి. ఎండ ఉన్నా లేకపోయినా చర్మాన్ని సంరక్షించుకోవడం కోసం తప్పనిసరిగా సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి.
ఫోన్ చూడటం
ఫోన్ చూడకుండా కాసేపు కూడ ఉండలేరు. మెడ వంచి ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉండటం వల్ల మెడలో మడతలు వస్తాయనే విషయం చాలా మంది గ్రహించరు. అధిక స్క్రీన్ సమయం మెడ మీద ప్రభావం చూపుతుంది. అలాగే గర్భాశయ వెన్నెముక కండరాలు, కణజాల నిర్మాణాల మీద ఒత్తిడి కలిగిస్తుంది. మెడ వంగడం వల్ల చర్మం ముడుచుకుపోతుంది. కాలక్రమేణా ఈ ముడతలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.
ఒకవైపు పడుకోవడం
నిద్రపోయేటప్పుడు కొంతమందికి ఒక వైపు మాత్రమే పడుకునే అలవాటు ఉంటుంది. ముఖం దిండుకి అదుముకుని పడుకోవడం వల్ల చర్మం కుంగిపోతుంది. దీని వల్ల మడతలు పడతాయి. చర్మం మీద రాపిడి తగ్గించుకోవడానికి సిల్క్ లేదా శాటిన్ పిల్లో కేస్ ఉపయోగించడం మంచిది.
స్ట్రాస్ ద్వారా సిప్పింగ్
కొన్ని పానీయాలు తీసుకునేటప్పుడు స్ట్రాస్ తో సిప్పింగ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల నోటి చుట్టు ముడతలు పడతాయి. కొల్లజెన్ స్థాయి తగ్గిపోతుంది. అది చర్మాన్ని బలహీనపరుస్తుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.