India Tourism In Rainy Season : మనదేశంలో పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలు లెక్కలేనన్ని ఉన్నాయి. వాటిలో ఈ ఏడాది వర్షాకాలంలో వెళ్లేందుకు సరైన ప్రదేశాలు ఏవో తెలుసుకుందామా? అందాల ప్రకృతి ప్రపంచం గురించి మనమూ తెలుసుకుందాం. 


లోనావాలా, మహారాష్ట్ర:


లోనావాలా మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఉన్న ప్రశాంతమైన కొండ పట్టణం.పచ్చదనం, కొండలు, సుందరమైన ప్రకృతి దృశ్యాలతో సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ముంబై నుంచి 83.1 కిలోమీటర్లు, పుణె నుంచి 66 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైలు, ఫ్లైట్ ద్వారా చేరుకోవచ్చు. పశ్చిమ కనుమల్లో నివసించేవారు వీకెండ్ లో వెళ్లే ఫేవరెట్ ప్లేస్ ఇది. ట్రెక్కింగ్, సైట్ సీయింగ్, క్యాంపింగ్, సందర్శనా స్థలాలు, గుర్రపు స్వారీ అన్నీ సాధ్యం. అక్కడ బస చేసేందుకు హోటల్లు, గెస్ట్ హౌస్లు, హోమ్ స్టేలు ఉన్నాయి. 


మున్నార్, కేరళ:


మీరు ప్రకృతి ప్రేమికులు అయితే వర్షాకాలంలో కేరళలోని మున్నార్ స్వర్గంలా కనిపిస్తుంది. చుట్టూ పర్వతాలు, వాటిని సగానికి కప్పేస్తూ పేరుకుపోయిన మంచు.. ప్రశాంత వాతావరణం మనస్సును ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది.


చిరపుంజి, మేఘాలయ:


చిరపుంజి.. దేశంలోనే అత్యధిక వర్షం పడే రెండో ప్రాంతంగా గుర్తింపు పొందింది. వర్షాకాలంలో ఇక్కడ పర్యటన ఓ అడ్వెంచర్ వంటిది. చుట్టూ అడవులు, పొలాలు, మైదానాలతో వర్షాకాలంలో భూలోక స్వర్గంలా కనిపిస్తుంది. 


ఉదయపూర్, రాజస్థాన్:


భారతదేశంలో మోస్ట్ రొమాంటిక్ డెస్టినేషన్ గా రాజస్థాన్ లోని ఉదయ్ పేరు ఉంది. వర్షాకాలంలో ఇక్కడ కాస్త తక్కువ వర్షం పడుతుంది. కానీ ఇక్కడ పిచోళా, ఫతేసాగర్ సరస్సులు మాత్రం వర్షాకాలంలో చేస్తూ మైమరిచిపోవడం పక్కా. 


గోవా:


గోవా బీచ్‌ను చాలామంది స్వర్గంగా భావిస్తారు. ఇక్కడికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇసుక బీచ్‌లు, ప్రశాంతమైన వైబ్‌తో గోవా వర్షాకాలంలో అద్భుతంగా ఉంటుంది. ఓల్డ్ గోవాలోని కలోనియల్ ఆర్కిటెక్చర్‌ను చూడవచ్చు. 


కొడైకెనాల్, తమిళనాడు:


తమిళనాడులోని పళని కొండలలో కొడైకెనాల్, ప్రశాంతత, ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన మనోహరమైన హిల్ స్టేషన్. దట్టమైన అడవులు, మెలికలు తిరుగుతున్న నదులు, పొగమంచు లోయలతో మనస్సును ఆకట్టుకుంటుంది. కొడైకెనాల్ పిల్లర్ రాక్స్, కోకర్స్ వాక్ వంటి సుందరమైన దృక్కోణాలకు ప్రసిద్ధి చెందింది. సందర్శకులు ప్రశాంతమైన కొడైకెనాల్ సరస్సులో బోటింగ్ ఆనందించవచ్చు. 


డార్జిలింగ్, పశ్చిమ బెంగాల్:


పశ్చిమ బెంగాల్‌లో ఉన్న డార్జిలింగ్.. టీ ఎస్టేట్‌లు, అద్భుతమైన దృశ్యాలు, ప్రసిద్ధ డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేలకు ప్రసిద్ధి చెందింది. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని లోయలు, టీ తోటలు ఇలా ఎన్నో అద్భుతాలు కళ్ల ముందు ఉంటాయి. ఇక్కడికి వెళ్తే టైగర్ హిల్ నుంచి సూర్యోదయం నుంచి చూడటం మరిచిపోవద్దు.


కూర్గ్, కర్ణాటక:


బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో 270 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వానాకాలంలో పర్ఫెక్ట్ గేట్ వే అని చెప్పవచ్చు. చుట్టూ కాఫీ తోటలతో చూసేందుకు రెండు కళ్లూ చాలవు. మీకు సాహసాలు చెయ్యడం ఇష్టమైతే.. అక్కడి తడియాన్డమోల్ పర్వతాన్ని ఎక్కొచ్చు. ఇది  జలపాతాలు, సరస్సులతో పాటు కాఫీ తోటలతో భలే బాగుంటుంది. ఏకాంతం కోరుకొనే జంటలకు ఇది చక్కని ప్రాంతం.


Also Read : మధ్యరాత్రిలో మెలకువ వస్తే.. వెంటనే నిద్రపోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి