Is Saree Cancer Real?: క్యాన్సర్ పేరు వినగానే భయంతో వణికిపోతారు. ప్రతి ఏటా చాలా మంది క్యాన్సర్ బారిన పడి చనిపోతుంటారు. క్యాన్సర్లలో చాలా రకాలు ఉంటాయి. అయితే, గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా చీర క్యాన్సర్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇంతకీ, చీర క్యాన్సర్ అంటే ఏంటి? ఇది ఎలా వ్యాపిస్తుంది? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? చీర క్యాన్సర్ గురించి డాక్టర్లు ఏం చెప్తున్నారు? అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..


చీర కట్టుకుంటే నిజంగానే క్యాన్సర్ వస్తుందా?


భారతీయ మహిళలకు చీర అంటే ఎంతో ఇష్టం. నచ్చిన చీరలు కట్టుకుని సంతోషపడతారు. తాజాగా చీర కట్టుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందని తెలియడంతో చాలా మందిలో ఒకరకమైన భయం నెలకొంది. అంతేకాదు, ఈ వ్యాధి కేవలం భారత్ లో మాత్రమే ఉంది. దానికి కారణం భారతీయ మహిళలు మాత్రమే చీరను ధరిస్తారు. నిజానికి చీర కట్టుకోవాలంటే పెట్ కోట్ ధరించాలి. దీన్ని నడుముకు గట్టిగా కట్టుకుంటారు. ఇలా ఎక్కువ సేపు నడుముకు కట్టుకోవడం వల్ల చర్మం దెబ్బతిని నల్లగా మారుతుంది. ఇలాగే కొంతకాలం పాటు కొనసాగితే చీర క్యాన్సర్ సోకే అవకాశం ఉంది. దీన్ని స్క్వామన్ సెల్ కార్సినోమా అంటారని వైద్యులు వెల్లడించారు.


చీర క్యాన్సర్ ఎందుకు వస్తుందంటే?


2011లో జర్నల్ ఆఫ్ ది ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌ చీర క్యాన్సర్ కు సంబంధించి రెండు కేసుల గురించి వివరించింది. చీర గట్టిగా కట్టుకోవడం వల్ల నడుము భాగం చర్మవ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.  అదే పరిస్థితి చాలా కోసం కొనసాగితే చర్మ క్యాన్సర్ కు గురయ్యే అవకాశం ఉంది. దీనిని శారీ క్యాన్సర్ అంటారని సదరు నివేదిక వెల్లడించింది. ‘వెస్ట్ లైన్ క్యాన్సర్’ అనికూడా పిలుస్తారని తెలిపింది. చీరలు మాత్రమే కాదు పెట్ కోట్లు, ధోతీలు, జీన్స్ ధరించినా నడుము దగ్గర ఒత్తిడికిలోనై శారీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. భారత్ లో ఉండే వేడి, పెట్ కోట్స్ ధరించేందుకు ఉపయోగించే దారం పరిశుభ్రంగా లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు.


శారీ క్యాన్సర్ లక్షణాలు


1. చీర ధరించే నడుము భాగంలో ఎరుపు దద్దుర్లు ఏర్పడటంతో పాటు, దురద కలుగుతుంది.


2. నడుము చుట్టు భాగంగలో చర్మ కణాలు చనిపోయి నల్లగా మారుతుంది.


3. నడుము దగ్గర చిన్న చిన్న గడ్డలు ఏర్పడుతాయి.


చీర క్యాన్సర్‌ను ఎలా నివారించాలి అంటే?


చీర క్యాన్సర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వైద్యులు వెల్లడించారు. రాత్రి పూట పడుకునే ముందు నడుము చుట్టూ మాయిశ్చరైజింగ్ క్రీములు పూయడం వల్ల సమస్య నుంచి బయటపడే అవకాశం ఉందని తెలిపారు. చీరను రెగ్యులర్ గా ధరించకపోవడం మంచిదంటున్నారు. అయితే, శారీ క్యాన్సర్ విషయంలో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. శారీ క్యాన్సర్ వచ్చే అవకాశం కేవలం 0.1 నుంచి 2.5 శాతం వరకు ఉంటుందని వెల్లడించారు. అంతేకాదు, చీర క్యాన్సర్ అనడం వల్ల చాలా మంది చీర కట్టుకుంటేనే వస్తుందనే అపోహలో ఉన్నారని అభిప్రాయపడ్డారు. 


Read Also: చీటికి మాటికి కోపంతో ఊగిపోతున్నారా? ప్రాణాలు పోవడం ఖాయం - ఎందుకంటే?