ఇద్దరు మనుషులు కమ్యూనికేట్ చేసే సాధనమే భాష. ప్రపంచంలో దాదాపు ఏడు వేల భాషలు ఉన్నట్టు అంచనా. అన్నీ ప్రాధాన్యతను సంతరించుకోలేదు. కొన్ని మాత్రమే ప్రపంచస్థాయి గుర్తింపును పొందాయి. ఎక్కువ మంది ఆ భాషలను మాట్లాడడం వల్లే అవి ప్రసిద్ధి పొందాయి. అందరికీ తెలిసిన భాష ఇంగ్లిష్. ఇదే ప్రపంచాన్ని ఏలుతుందనుకుంటారు కానీ, దీనికి పోటీనిచ్చేలా మరో నాలుగు భాషలు ఉన్నాయి. మన దేశంలో 3,372 భాషల దాకా వాడుకలో ఉన్నాయి. కానీ కొన్ని భాషలే గుర్తింపును, ప్రాధాన్యతను పొందాయి.  ప్రపంచంలో అత్యధిక మంది మాట్లాడుతున్న భాషలేంటో, వాటిని ఎంత మంది మాట్లాడుతున్నారో తెలుసుకోండి. 


చైనీస్
ప్రపంచంలో అత్యధిక జనాభాను కలిగి ఉన్న దేశం చైనా. ఈ భాషను దాదాపు 1.3 బిలియన్ల ప్రజలు మాట్లాడుతున్నారు. చైనీస్ భాషలోనే కాస్త భిన్నమైన మాండలికం మాండరిన్. ఇది చైనీస్ భాషే. దీన్ని దాదాపు తొంభై ఒక్క కోట్ల మందికి పైగా మాట్లాడతారు. ముఖ్యంగా చైనాలోని గ్రామీణ ప్రాంతాల్లో ఈ భాష వినిపిస్తుంది.భూ గ్రహం మీదే అత్యధికంగా మాట్లాడే భాష చైనీసే. 


ఆంగ్లం
దీన్ని గ్లోబల్ లాంగ్వేజ్ అంటారు. చాలా దేశాల్లోని ప్రజలు ఆంగ్లం మాట్లాడతారు. దీన్ని ప్రాథమిక భాషగా ముప్పై ఏడుకోట్ల మంది ప్రజలు మాట్లాడుతుండగా, రెండో భాషగా పరిగణించే వారి సంఖ్య 75 కోట్లకు పైగా ఉంది. వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, అంతర్జాతీయ సంబంధాలకు కూడా ఈ భాష అతి ముఖ్యమైనదిగా మారింది. ఇంగ్లిషు వచ్చినవారిదే భవిష్యత్తు  అనే స్థాయికి చేరుకుంది పరిస్థితి. ఉద్యోగావకాశాలను, మెరుగైన జీవన నాణ్యతను అందించే భాషగా మారింది ఆంగ్లం. 


హిందీ
భారతదేశంలో హిందీ చాలా ముఖ్యమైన భాష. ఇక్కడున్న అధికారిక భాషల్లో ఇదీ ఒకటి. ఉత్తర భారతదేశంలో అంతా హిందీనే మాట్లాడతారు. అలాగే పాకిస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ భాషను మాట్లాడతారు. ప్రపంచవ్యాప్తంగా హిందీని దాదాపు 34 కోట్ల మందికి పైగా మాట్లాడతారు. భారతీయ విద్యలో ఈ భాషకి చాలా ప్రాధాన్యత ఉంది. హిందీ నేర్చుకుంటే భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా సంతోషంగా బతికేయచ్చు. 


అరబిక్
అరబిక్ మాట్లాడే వారి సంఖ్య ప్రస్తుతానికి 31 కోట్ల మంది. అయితే ఈ భాషలో కూడా చాలా మాండలికాలు ఉన్నాయి. ఖురాన్ ను రాసినది కూడా అరబిక్ లోనే. అందుకే ఈ భాషకు ప్రాధాన్యత ఎక్కువ. ఒమన్, మొరాకో వంటి దేశాల్లో కూడా అరబిక్ మాట్లాడతారు కానీ కాస్త భిన్నంగా ఉంటుంది. 


స్పానిష్  
ప్రపంచంలో చాలా మందికి ఇష్టమైన భాష స్పానిష్. విదేశీయులు కూడా ఈ భాషను నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. స్పానిష్‌ను దాదాపు 46 కోట్ల మంది మాట్లాడుతారని అంచనా. అమెరికా,స్పెయిన్, అహెమ్ లోని చాలా ప్రాంతాల్లో స్పానిష్ మాట్లాడతారు. 


ప్రపంచంలో 46 భాషలు పూర్తిగా అంతరించిపోయే దశలో ఉన్నాయి. ఆయా భాషలు మాట్లాడేవారు కేవలం ఒక్కొక్కరు మాత్రమే మిగిలారు. వారు మరణిస్తే ఆ భాష కూడా మరణిస్తుంది. 


Also read: ఈ రోటీలు రోజుకు రెండు తినండి చాలు, నెలలో అయిదు కిలోల బరువు తగ్గే అవకాశం


Also read: ఈ చిత్రంలో ఎన్ని పాండాలున్నాయో అర నిమిషంలో చెప్పండి, కేవలం 10 శాతం మందే గుర్తించగలరు