Tasty Breakfast Recipe : రోజంతా మిమ్మల్ని ఎనర్జీగా ఉంటే టేస్టీ, హెల్తీ బ్రేక్​ఫాస్ట్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీరు బంగాళదుంపలతో చేసుకోగలిగే ఓ రెసిపీ గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మీకు టేస్ట్​తో పాటు హెల్త్​ని కూడా ప్రమోట్ చేస్తుంది. మీరు రోజంతా ఎనర్జీటిక్​గా ఉండేందుకు ఇది మీకు కిక్​ స్టార్ట్ ఇస్తుంది. కడుపు నిండుగా ఉండి.. మీ దృష్టిని చిరుతిళ్లపై మరల్చనివ్వదు. అలాంటి ఓ క్యూట్, టేస్టీ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.


కావాల్సిన పదార్థాలు


బంగాళదుంపలు - 3 


సగ్గుబియ్యం - అర కప్పు


అల్లం - అంగుళం


పచ్చిమిర్చి - 3


కొత్తిమీర - 1 కట్ట


పల్లీలు - 100 గ్రాములు


ఉప్పు - తగినంత


కార్న్ ఫ్లోర్ - 2 టేబుల్ స్పూన్లు


నిమ్మరసం - 1 స్పూన్


నూనె - వంటకు తగినంత


తయారీ విధానం


ముందుగా సగ్గుబియ్యాన్ని ఓ అరగంట నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై మీడియం సైజులో ఉన్న బంగాళదుంపలను ఉడికించుకోవాలి. ఉప్పు వేస్తే ఆలుగడ్డలు త్వరగా ఉడికిపోతాయి. పచ్చిమిర్చి, అల్లం, కొత్తిమీరను బాగా కడిగి చిన్నగా తురుముకోవాలి. మరోస్టౌవ్​పై పల్లీలను రోస్ట్ చేసుకుని పొట్టు తీసి.. మిక్సీలో వేయాలి. మెత్తని పొడిలా కాకుండా కాస్త బరకగా దానిని మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. 


ఇప్పుడు స్టౌవ్ ఆపేసి బంగాళదుంపలను నీటి నుంచి వేరు చేసి.. పైనున్న పొట్టు తీయాలి. వాటిని మిక్సింగ్ బౌల్​లోకి తీసుకుని పిసకాలి. ఇప్పుడు దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. పల్లీల పొడి, అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, కార్న్ ఫ్లోర్ వేసి బాగా కలపాలి. వీటిలో నీరు వేయాల్సిన అవసరం ఉండదు. దానిలో కాస్త నిమ్మరసం వేసి పిండిని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 


చేతులకు నూనె అప్లై చేసుకుని.. పిండిని చిన్న ముద్దగా తీసుకుని బటర్​ పేపర్​పై చపాతీలాగా చేతులతో వత్తాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై ఫ్రై పాన్ పెట్టుకోవాలి. దానిలో కాస్త నూనె వేసి.. తయారు చేసుకున్న చిల్లాను దానిపై వేసి రోస్ట్ చేసుకోవాలి. రెండో వైపు తిప్పి మరికొంచెం నూనె వేసి గోల్డెన్​ కలర్​లో వచ్చేవరకు రోస్ట్ చేయాలి. రెండు వైపులా మంచిగా రోస్ట్ అయిందని అనిపిస్తే.. పిండితో మరొకటి చేసుకోవాలి. 


ఇలా మొత్తం పిండితో పొటాటో చిల్లాను సిద్ధం చేసుకుని.. వేడి వేడిగా లాగించేయవచ్చు. వీటిని మీరు నేరుగా తినొచ్చు లేదంటే గ్రీన్ చట్నీతో కలిపి తీసుకోవచ్చు. కేవలం ఉదయం బ్రేక్​ఫాస్ట్​గానే కాకుండా సాయంత్రం స్నాక్​గా కూడా వీటిని చేసుకోవచ్చు. ఛాయ్​తో కలిపి తీసుకుంటే వీటి రుచే వేరు. ఇది మీరు రోజంతా ఎనర్జీటిక్​గా ఉండేలా చేస్తుంది. పైగా రుచిలోనూ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. చిరుతిండి తినాలనే కోరిక లేకుండా కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. పిల్లలు కూడా వీటిని ఇష్టంగా తింటారు. మధుమేహమున్నవారు కూడా వీటిని తీసుకోవచ్చు. దీనిలోని అల్లం జీర్ణ సమస్యలను దూరం చేసి.. హెల్తీ గట్​ను ప్రమోట్ చేస్తుంది. 


Also Read : మూడు ముక్కల పెసరట్టు.. ఇలా చేస్తే టేస్ట్ అదుర్స్ అన్నట్టు