High-Protein Meal Plan : సమ్మర్​లో హెల్తీగా, హైడ్రేటెడ్​గా ఉండేందుకు డైట్​ ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇది మీకోసమే. రైస్​తో, ఇంట్లో దొరికే ఫుడ్స్​తో డైట్​ని సింపుల్​గా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రోటీన్​తో నిండిన, కార్బ్స్​ ఎక్కువ తీసుకోకుండా, హైడ్రేటింగ్​గా ఉంచే ఫుడ్స్​ని కూడా కలుపుకొని డైట్​ని ఎలా ఫిక్స్ చేయాలో.. సమ్మర్​లో జీర్ణ సమస్యలను దూరం చేసే ఫుడ్స్​ని ఎలా డైట్​లో చేర్చుకోవచ్చో.. ఇంట్లోనే ఈజీగా కుక్​ చేసుకునే వంటలతో వారం రోజులకు మీ డైట్​ను ఇలా ప్లాన్ చేసుకోండి. 

బ్రేక్​ఫాస్ట్​గా

సోమవారం బ్రేక్​ఫాస్ట్​గా మూడు ఇడ్లీలు, కొబ్బరి చట్నీ, రెండు ఉడకబెట్టి గుడ్లు తినొచ్చు. మంగళవారం బ్రేక్​ఫాస్ట్​గా రెండు రాగి దోశలు, టోమాటో చట్నీ తినొచ్చు. రెండు ఎగ్​ వైట్స్​తో ఆమ్లెట్ వేసుకోవచ్చు. బుధవారం మసాలా ఉప్మాను కూరగాయలతో చేసుకోవచ్చు. ఆనియన్ చట్నీతో దానిని తీసుకోవచ్చు. రెండు ఉడకబెట్టిన గుడ్లు తినాలి. గురువారం పొంగల్​ని పుదీనా చట్నీతో కలిపి తినాలి. పొంగల్ కాస్త హెవీగా ఉంటుంది కాబట్టి 1 ఉడకబెట్టిన గుడ్డు తినొచ్చు. శుక్రవారం 3 ఇడ్లీలు, కొబ్బరి పాలు, ఉడకబెట్టిన గుడ్డును బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. శనివారం ఒకటిన్నర కప్పుల చద్ది అన్నాన్ని.. పచ్చి ఉల్లిపాయతో తినొచ్చు. రెండు ఉడికించిన ఎగ్​ వైట్స్ తీసుకోవాలి. 

మధ్యాహ్న భోజనం 

సోమవారం సాంబార్ రైస్, ఉడికించిన క్యారెట్స్ తీసుకోవాలి. మంగళవారం లెమన్ రైస్​ని ఉడికించిన క్యారెట్, పనీర్ ఫ్రైతో కలిపి తీసుకోవచ్చు. బుధవారం సాంబార్ రైస్​ని ఉడికించిన శనగలతో కలిపి తీసుకోవాలి. గురువారం టొమాటో రసంని రైస్​తో కలిపి ఉడికించిన సొరకాయ ముక్కలతో కలిపి తీసుకోవచ్చు. శుక్రవారం పెరుగన్నం, కీరదోశతో తీసుకోవచ్చు. శనివారం వెజిటేబుల్ బిర్యానీ, ఉల్లిపాయ పెరుగు పచ్చడి, ఉడికించి వేయించుకున్న చనాతో కలిపి తీసుకోవచ్చు. 

డిన్నర్

సోమవారం పనీర్ బుర్జీని వంద గ్రాములు తీసుకుని.. ఉడికించి వేయించిన పాలకూరతో కలిపి రెండు చపాతీలు తినొచ్చు. మంగళవారం పెసర దోశలు రెండు వేసుకుని దానిని పుదీనా చట్నీతో తీసుకోండి. కీరదోశ సలాడ్​ని తీసుకోవచ్చు. బుధవారం ఎగ్​ కర్రీ, రెండు చపాతీలు, ఆనియన్ రైతాతో డిన్నర్ ముగించవచ్చు. గురువారం గ్రిల్ చేసిన పనీర్ 100 గ్రాములు తీసుకుని.. కప్పు రైస్​తో, ఉడికించిన పాలకూర వేసుకుని డిన్నర్ ముగించవచ్చు. శుక్రవారం 2 దోశలు 1 ఉడికించిన ఎగ్, ఉల్లిపాయ చట్నీతో డిన్నర్ చేయవచ్చు. శనివారం పనీర్ సలాడ్, పెసరపప్పు కర్రీ, మిల్లెట్ రోటీతో డిన్నర్ ముగించవచ్చు. 

స్నాక్స్​గా

సోమవారం బటర్ మిల్క్, వేయించిన పల్లీలు పది తినొచ్చు. మంగళవారం తాటిముంజలు, బెల్లంతో చేసిన పల్లీ చిక్కి తీసుకోవచ్చు. బుధవారం పుచ్చకాయ, మసాలా మఖానే తినొచ్చు. గురువారం నన్నారి షర్బత్, రోస్ట్ చేసిన 10 మఖానా తీసుకోవచ్చు. శుక్రవారం బొప్పాయి, బటర్ మిల్క్ తీసుకోవచ్చు. శనివారం బ్రౌన్ బ్రెడ్ పీనట్ బటర్ వేసుకుని రెండు తినొచ్చు. 

సమ్మర్​లో శరీరానికి అన్ని పోషకాలు అందిస్తూ.. హెల్తీగా, హైడ్రేటెడ్​గా ఉండేందుకు దీనిని ఫాలో అవ్వొచ్చు. వారం రోజులు దీనిని ఫాలో అయిన తర్వాత.. దీనినే తర్వాత వారాలకు కంటిన్యూ కూడా చేయవచ్చు. మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల కోసం నిపుణులు లేదా వైద్యుల సహాయంతో కూడా డైట్​ని ప్రిపేర్ చేసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.