Tips for Preventing Constipation : మలబద్ధకం రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఇది వస్తే కనుకు మల విసర్జన చేయడం కష్టంగా ఉంటుంది. అలాగే మలద్వారం వద్ద పగుళ్లు, కడుపు ఉబ్బరం, తిమ్మిరి వంటి జీర్ణ సమస్యలు ఉంటాయి. ఈ సమస్యను వీలైనంత త్వరగా తగ్గించుకోవాలని లేదంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు. 

Continues below advertisement

ఫైబర్ ఉండే ఫుడ్​ని తక్కువగా తీసుకోవడం, నీటిని తాగకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి, కొన్ని రకాల మందుల వల్ల మలబద్ధకం వస్తుంది. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ ఫుడ్స్​కి దూరంగా ఉండాలి? ఏమి తింటే మంచిదో ఇప్పుడు చూసేద్దాం. 

మలబద్ధకాన్ని ఇలా దూరం చేసుకోండి..

శరీరానికి అవసరమైనంత నీటిని అందించాలి. హైడ్రేటెడ్​గా ఉండాలి. రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిని లేదా హెర్బల్ డ్రింక్స్​ని తీసుకుంటే మంచిది. దీనివల్ల బౌల్ మూమెంట్స్ ఫ్రీ అవుతాయి. రోజుకు కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయడం మంచిది. లేదంటే వాకింగ్ చేసేనా మంచి ఫలితాలు ఉంటాయి. 

Continues below advertisement

వాష్​రూమ్​కి రోజూ వెళ్లండి. ఒకే టైమ్​కి వెళ్లడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మలబద్ధకం సమస్య దూరమవుతుంది. అలాగే మూమెంట్ ఉంటేనే కొందరు వాష్ రూమ్​కి వెళ్తారు. అలా కాకుండా రొటీన్ టైమ్​లో బౌల్ మూమెంట్ ఉన్నా లేకున్నా వెళ్లాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే మోషన్​ని కంట్రోల్ చేసుకోవద్దని సూచిస్తున్నారు. అలా చేస్తే పరిస్థితి ఇంకా దిగజారుతుందట. 

తీసుకోవాల్సిన ఫుడ్స్ ఇవే

రోజూ ఒకే టైమ్​కి ఫుడ్ తీసుకునేలా చూడండి. దీనివల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది. బౌల్ యాక్టివిటీ మెరుగవుతుంది. ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలి. యాపిల్స్, బెర్రీలు, ఎండు ద్రాక్షలు, అంజీర్, కివీ వంటి వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బ్రకోలీ, క్యారెట్స్, పాలకూర, స్ప్రౌట్స్ వంటివి కూడా మంచిదే. ఓట్స్, గోధుమ బ్రెడ్, బ్రౌన్ రైస్, క్వినోవాలో కూడా ఫైబర్ ఉంటుంది. పప్పులు, శనగలు, బ్లాక్ బీన్స్, కిడ్నీ బీన్స్ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. చియాసీడ్స్, అవిసెగింజలు, బాదం, వాల్​నట్స్​ని స్నాక్స్ రూపంలో తీసుకోవచ్చు. 

తినకూడని ఫుడ్స్ ఇవే..

కొన్ని ఫుడ్స్ మలబద్ధకాన్ని తగ్గిస్తే.. మరికొన్ని పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తాయి. అందుకే కొన్ని ఫుడ్స్ తీసుకోకూడదని చెప్తున్నారు నిపుణులు. ప్రాసెస్ చేసిన ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చిప్స్, ఐస్ క్రీమ్ వంటివి తీసుకోకపోవడమే మంచిదట. వైట్ బ్రెడ్, అన్నం, పాస్తా కూడా అంతమంచిది కావట. పాలు, చీజ్, కెఫిన్ వంటివాటికి దూరంగా ఉండాలంటున్నారు. ఆల్కహాల్ కూడా పరిస్థితిని విషమం చేస్తుందని చెప్తున్నారు. అందుకే వీటికి దూరంగా ఉండాలి. 

ఈ టిప్స్ ఫాలో అవుతూ డైట్​లో మార్పులు చేస్తే మలబద్ధకం కంట్రోల్ అవుతుందని చెప్తున్నారు. పరిస్థితి విషయమిస్తే మీరు వైద్యుల సాయం తీసుకోవచ్చు. అలాగే వారు సూచించిన టిప్స్ కచ్చితంగా ఫాలో అయితే మంచి ఫలితాలు ఉంటాయి. 

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.